6 కోట్ల వివాదంలో తలైవి సినిమా..కంగన రనౌత్ రియాక్షన్ ఏమిటంటే?

బాలీవుడ్ క్వీన్ కంగన రనౌత్ నటించిన తలైవి చిత్రం వివాదంలో కూరుకుపోయింది. 2021 సెప్టెంబర్‌లో రిలీజైన ఈ సినిమాను జీ స్టూడియోస్ ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేసింది. ఈ సినిమా విషయంలో రావాల్సిన కోట్ల రూపాయలను ఇప్పించాలంటూ ఇండియన్ మోషన్ పిక్చర్స్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ (IMPPA)ను జీ స్టూడియోస్ ఫిర్యాదు చేయడం వివాదంగా మారింది. తమిళనాడు మాజీ సీఎం జే జయలలిత జీవిత కథ ఆధారంగా రూపొందిన తలైవి డిస్ట్రిబ్యూషన్ హక్కుల వివాదం వివరాల్లోకి వెళితే..

తలైవి సినిమా రిలీజ్ అయినప్పటి నుంచి వివాదాల్లో నానుతూనే ఉంది. ఈ సినిమా రిలీజ్ తర్వాత నిబంధనలకు విరుద్ధంగా రెండు వారాల్లో నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో రిలీజ్ చేయడంతో కలెక్షన్లు దారుణంగా పడిపోయాయి. దాంతో ఈ సినిమాను బాయ్‌కాట్ చేయాలని మల్టీప్లెక్స్‌లు పిలుపునిచ్చాయి. ఈ సినిమా హిందీలో తొలి రోజు దారుణంగా 32 లక్షలు, లైఫ్ టైమ్‌లో 2 కోట్ల మేర వసూళ్లను రాబట్టింది. తెలుగు, తమిళంలో కేవలం 5.75 కోట్లతో సరిపెట్టుకొన్నది. ఇదిలా ఉంటే.. డిస్ట్రిబ్యూషన్ రైట్స్ వివాదానికి విషయానికి వస్తే..

Thalaivii landed into controversy of 6 crores distribution rights: Here is Kangana Ranaut

తలైవి సినిమా తమిళ, హిందీ వెర్షన్‌ ఇండియా, ఓవర్సీస్‌లో జీ స్టూడియోస్ విడుదల చేసింది. అయితే ఈ సినిమా కోసం డిస్ట్రిబ్యూషన్ హక్కుల కోసం చెల్లించిన 6 కోట్ల రూపాయల అడ్వాన్స్ మొత్తాన్ని రీఫండ్ చేయాలనంటూ విబ్రి మోషన్ పిక్చర్స్‌ను కోరింది. ఈ మేరకు జీ రాసిన లేఖకు స్పందించకపోవడంతో IMPPAను జీ స్టూడియోస్ ఆశ్రయించింది. అంతేకాకుండా తమకు రావాల్సిన అడ్వాన్స్ మొత్తాన్ని చెల్లించాలంటూ జీ స్టూడియోస్ కోర్టును కూడా ఆశ్రయించేందుకు సిద్దమవుతున్నది అనే వార్తలు బాలీవుడ్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి.

Thalaivii landed into controversy of 6 crores distribution rights: Here is Kangana Ranaut

అయితే తలైవి డిస్ట్రిబ్యూషన్ రైట్స్ వివాదంపై కంగన రనౌత్ స్పందించారు. తలైవి సినిమా డిస్ట్రిబ్యూషన్ రైట్స్ విషయంలో వస్తున్న వార్తల్లో నిజాలు లేవు. ఈ సినిమా రిలీజై రెండేళ్లు కావొస్తున్నది. ఇలాంటి వార్తలు ఎలా పుట్టుకొస్తాయని కంగన ఆశ్చర్యాన్ని వ్యక్తం చేసింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X