డబ్బు విషయంలో నా భర్తతో వాదించలేను, అందుకే వద్దనుకున్నా: విద్యా బాలన్
బాలీవుడ్ కపుల్స్ చాలా మంది కలిసి పని చేయడానికి ఆసక్తి చూపుతుంటారు. అయితే విద్యా బాలన్, నిర్మాత సిద్ధార్థ్ రాయ్ కపూర్ తమ వృత్తిపరమైన, వ్యక్తిగత జీవితాన్ని వేరుగా ఉంచడానికి ప్రధాన్యత ఇస్తున్నారు.
ఇటీవల ఓ ఇంటర్వ్యూలో విద్యా బాలన్ మాట్లాడుతూ తన భర్తతో కలిసి పని చేయకపోవడానికి గల కారణంపై స్పందించారు. "దర్శకుడు, నిర్మాతతో ఏమైన సమస్య ఉంటే నేను వారితో వాదించి తేల్చుకుంటాను. ఇలాంటివి ఏమైనా ఉంటే సిద్ధార్థ్‌తో నేను అలా చేయలేను.'' అన్నారు.

"నేను మా సంబంధం యొక్క పవిత్రతను నిలుపుకోవాలనుకుంటున్నాను. తమ ఇద్దరికీ నచ్చిన స్క్రిప్ట్‌లు కూడా వదిలేసిన సందర్భాలు ఉన్నాయని విద్యా తెలిపారు. అంతే కాకుండా రెమ్యూనరేషన్ విషయంలో బేరమాడలేను అని తెలిపారు.
ఆయన మీరు ఇంతే తీసుకోండి అని అడిగితే, నేను అంతకంటే పది రెట్లు నాకు వస్తుంది అని వాదిస్తాను. మీరు నా టాలెంటుకు తక్కువ విలువ కడుతున్నారని అంటాను. ఇలా జరిగితే ఎలా ఉంటుందో ఊహించుకోండి. ఇలాంటి పరిస్థితి మా మధ్య రాకూడదు... అని విద్యా బాలన్ అభిప్రాయడ్డారు.
ఈ సందర్భంగా విద్యా బాలన్ తమ డేటింగ్ రోజులను గుర్తు చేసుకున్నారు. విద్యా బాలన్, సిద్ధార్థ్ రాయ్ కపూర్ వివాహం 2012లో జరిగింది. సౌత్ ఇండియన్ స్టైల్, పంజాబీ ఆచారాల ప్రకారం రెండు విధానాల్లో పెళ్లి చేసుకున్నారు. విద్యా బాలన్ సినిమాల విషయానికొస్తు.. ఆమె నటించిన 'మిషన్ మంగళ్' ఆగస్ట్ 15న విడుదలై ఇప్పటి వరకు రూ. 200 కోట్లు వసూలు చేసింది.


Click it and Unblock the Notifications











