నెపోటిజమ్ ఉచ్చులో జాన్వీ, అలియా భట్.. ఇద్దరికి ఉన్న తేడా అదే.. అందుకే ఆమె బయటపడింది

బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో నెపోటిజమ్ డోస్ ఏ రేంజ్ లో పెరిగిందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. సుశాంత్ సింగ్ మృతిపై అసలు కారణం తెలిసే వరకు కొందరికి నిద్ర పట్టేలా లేదని అర్ధమవుతోంది. నెపోటిజమ్ వలనే ఆ యువ నటుడు ప్రాణాలు విడిచాడు అని టాక్ వచ్చినప్పటి నుంచి కూడా అలియా భట్ పై తీవ్ర స్థాయులో విమర్శలు వస్తున్న విషయం తెలిసిందే. జాన్వీ కపూర్ పై కూడా కొన్ని నెగిటివ్ కామెంట్స్ వచ్చాయి.

Recommended Video

RRR : Rajamouli చెప్పకముందే Alia Bhatt తప్పుకుందా? ఆలియా లేకపోవడమే మంచిదంటున్న ఫ్యాన్స్ || Oneindia
చుక్కలు చూపించారు..

చుక్కలు చూపించారు..

గతంలో ఎప్పుడు లేని విధంగా అలియా భట్ కి నెటిజన్స్ కి చుక్కలు చూపించారనే చెప్పాలి. సుశాంత్ ప్రాణాలు విడిచిన మరుసటి రోజే ఆమె చిట్టా విప్పడం మొదలైంది. గతంలో ఆమె చేసిన కామెంట్స్ సుశాంత్ ని తక్కువ చేసి మాట్లాడడం సెటైర్లు వేయడం లాంటివి అభిమానుల ఆగ్రహానికి కారణమయ్యాయి. ఆ ఎఫెక్ట్ సడక్ 2పై గట్టిగానే పడింది.

అదే సమయంలో రిలీజ్ అవ్వడం..

అదే సమయంలో రిలీజ్ అవ్వడం..

కరెక్ట్ గా సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మృతిపై విమర్శలు వస్తున్న సమయంలోనే అలియా భట్ లీడ్ రోల్ లో నటించిన సడక్ 2 ట్రైలర్ రిలీజ్ అవ్వడంతో యూ ట్యూబ్ లో అత్యంత చెత్త ట్రైలర్ గా నిలిచేలా చేశారు. ఇక అదే తరహాలో సినిమాకు కూడా 1 రేటింగ్ రావడం షాక్ ఇచ్చిందనే చెప్పాలి.

జాన్వీ కొంచెం బెటర్..

జాన్వీ కొంచెం బెటర్..

ఇదే తరహాలో శ్రీదేవి, బోణి కపూర్ కూతురు జాన్వీ కపూర్ నటించిన గుంజన్ సక్సెనా పై కూడా కొన్ని విమర్శలు వచ్చాయి. కానీ నెపోటిజమ్ దెబ్బ ఎంత చూపించినా కూడా జాన్వీ ఆ బయోపిక్ తో ఓ వర్గం ఆడియెన్స్ ని అయితే మెప్పించగలిగింది. 3 వరకు రేటింగ్స్ అందుకోగలిగింది. ఇక జాన్వీ నటనపై కొన్ని విమర్శకు అయితే గట్టిగానే వచ్చాయి.

తేడా ఏమిటంటే..

తేడా ఏమిటంటే..

ఇక వీరిద్దరి మధ్య ఉన్న తేడా ఏమిటంటే... అలియా భట్ సడక్ 2 ఆల్ రెడీ నెపోటిజమ్ దెబ్బకు ఇమేజ్ డ్యామేజ్ అయ్యింది. ఇక సినిమా రిలీజ్ అనంతరం కనీసం సినిమా కొంత కూడా పాజిటివ్ కామెంట్స్ అందుకోలేకపోయింది. ఆ సినిమా కంటెంట్ అలాగే అలియా భట్ నటనపై ట్రోలింగ్ డోస్ బాగానే పెరిగింది. జాన్వీ కపూర్ మాత్రం ఎంతో కొంత ఆకట్టుకోగలిగితే అలియా మాత్రం అసలు ఎవరు కూడా పాజిటివ్ కామెంట్స్ చేయకపోవడం గమనార్హం.

అందుకే ఆ రూమర్స్ తగ్గలేదు

అందుకే ఆ రూమర్స్ తగ్గలేదు

కనీసం జాన్వీ నెపోటిజమ్ పై స్పందించింది. టాలెంట్ ఉంటేనే, జనాలు ఆదరిస్తేనే ఎవరైనా సరే ఇండస్ట్రీలో ఉంటారని కొందరిని ఆలోచింపజేసింది. దీంతో ఆమె నెపోటిజమ్ ఉచ్చులో నుంచి భయటపడుతున్నట్లు టాక్ వస్తోంది. కానీ అలియా ఇంతవరకు స్పందించలేదు. అందుకే ఆమెపై రూమర్స్ కూడా ఆగలేదనే కథనాలు వేలువడుతున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X