కోపంతో జేబు చింపుకున్నాడు... ఇద్దరు స్టార్ హీరోల మధ్య గొడవకు కారణం ఆ సీనే!

షారుక్ ఖాన్ బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎదగక ముందు, కుర్రాడిగా ఉన్నప్పుడే... సన్నీ డియోల్ అప్పట్లో పెద్ద స్టార్. 1993లో యశ్‌చోప్రా దర్శకత్వంలో వచ్చిన 'డర్‌' సినిమాలో షారుక్‌, సన్నీ డియోల్‌ కలిసి నటించారు. అయితే ఆ తర్వాత ఇద్దరూ కలిసి సినిమాలు చేయలేదు. అసలు అప్పటి నుంచి ఇద్దరి మధ్య మాట కూడా లేవు. అందుకు కారణం ఈ సినిమా షూటింగ్ సమయంలో జరిగిన ఓ వివాదమే అని అంటుంటారు. సన్నీ డియోల్ కోపంతో జేబు కూడా చింపుకోవడంతో అప్పట్లో సెట్స్‌లో జరిగిన ఈ గొడవ గురించి మీడియా రకరకాలుగా రాసింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఈ సంఘటన ప్రస్తావనకు రాగా సన్నీ డియోల్ స్పందించారు.

ఆ సీన్ విషయంలోనే అసలు సమస్య

ఆ సీన్ విషయంలోనే అసలు సమస్య

‘డర్‌' చిత్రంలో నేను కమెండో పాత్ర పోషించాను. ఆరోజు సీన్లో షారుక్ నన్ను కొట్టి కత్తితో పొడిచే సీన్ ఉంది. ఈ సీన్ గురించి చెప్పగానే నేను దర్శకుడు యష్ చోప్రాతో వాదనకు దిగాను. చాలా బలంగా ఉండే కమెండోను ఒక కుర్రాడు కొట్టి కత్తితో ఎలా పొడుస్తాడు? ఇది రియాల్టీకి దూరంగా ఉంటుందని ప్రశ్నించాను. కానీ యష్ జీ నేను చెప్పింది వినిపించుకోకపోవడంతో నాకు కోపం వచ్చింది' అని సన్నీ డియోల్ తెలిపారు.

నాకు కోపం కట్టలు తెచ్చుకుంది, జేబు చిరిగిపోయింది

నాకు కోపం కట్టలు తెచ్చుకుంది, జేబు చిరిగిపోయింది

నేను ఎంత చెప్పినా యష్ చోప్రా వినిపించుకోలేదు. ఆయన నాకంటే పెద్దవారు, ఆయనపై గౌరవంతో అంగీకరించాను. కానీ నాకు కోపం కట్టలు తెంచుకుంది. నా చేతులు పాకెట్లో పెట్టుకుని వింటూ ఉండిపోయాను. ఆ కోపంలో నాకు తెలియకుండానే జేబు చించేసినట్లు... సన్నీ డియోల్ గుర్తు చేసుకున్నారు.

తప్పు వాళ్లదే, అందుకే భయపడ్డారు

తప్పు వాళ్లదే, అందుకే భయపడ్డారు

ఈ సంఘటనలో నా తప్పు ఏమీ లేదు. తప్పు వారిదే... నేను కోపంతో జేబు చింపుకోవడంతో వాళ్లు కాస్త భయపడ్డమాట నిజమే. అయితే సెట్స్‌లో షారుక్‌తో కానీ, యష్ చోప్రాతో కానీ ఎలాంటి గొడవ జరుగలేదని, సీన్ గురించి డిస్ట్క్రషన్ మాత్రమే జరిగిందని సన్నీ డియోల్ తెలిపారు.

16 ఏళ్లుగా మాటలు లేవు

16 ఏళ్లుగా మాటలు లేవు

షారుక్ ఖాన్‌తో దాదాపు 16సంవత్సరాలుగా మాటలు లేవు. మాట్లాడుకోవాల్సిన అవసరం కూడా మాకు రాలేదు. ఎందుకంటే నేను ఇండస్ట్రీలో జరిగే కార్యక్రమాలకు దూరంగా ఉంటాను. పాటు షారుక్, నేను ఎప్పుడూ ఎదురు పడలేదు. అందుకే మాట్లాడుకోలేదని సన్నీ డియోల్ తెలిపారు.

సన్నీ డియోల్

సన్నీ డియోల్

కాగా... ఇటీవల జరిగిన పార్లెమంట్ ఎన్నికల్లో సన్నీ లియోన్ బీజేపీ పార్టీ తరుపున గురుదాస్‌పూర్ లోక్ సభ నియోజకవర్గానికి పోటీ చేసి గెలుపొందారు. ఎన్నికల సందర్భంగా సన్నీ డియోల్ తన ఆస్తుల వివరాలను డిక్లేర్ చేస్తూ అఫిడవిట్ సమర్పించారు. మొత్తం రూ. 87.18 కోట్ల విలువగల ఆస్తులు ఉన్నట్లు అందులో పేర్కొన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X