డైరెక్టర్‌ని అరెస్ట్ చేసిన పోలీసులు.. మరీ ఇంత ఫ్రాడా!
ప్రముఖ దర్శకుడు విజయ్ రత్నాకర్ గట్టి మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ జీవితం ఆధారంగా ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిష్టర్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. తాజగా విజయ్ రత్నాకర్ ని జీఎస్టీ ఇంటెలిజెన్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. విజయ్ రత్నాకర్ కు చెందిన వి ఆర్ జి డిజిటల్ కంపెనీకి సంబంధించి 34 కోట్ల జీఎస్టీ ఫ్రాడ్ జరిగినట్లు అధికారులు గుర్తించారు.
మోసపూరిత పత్రాల ద్వారా విజయ్ రత్నాకర్ 34 కోట్ల మోసానికి పాల్పడ్డారని అధికారులు అతడిని అరెస్ట్ చేశారు. విజయ్ రత్నాకర్ ప్రముఖ వ్యాపార వేత్త రత్నాకర్ కుమారుడు. ఆయనపై కూడా పలు అవినీతి ఆరోపణలు ఉన్నాయి.

రాజకీయ నేపథ్యం ఉన్న సినిమాతో వెలుగులోకి వచ్చిన విజయ్ రత్నాకర్ అవినీతి కేసులో ఇరుక్కోవడం హాట్ టాపిక్ గా మారింది. ఇక ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిష్టర్ చిత్ర విషయానికి వస్తే ఈ చిత్రంలో మన్మోహన్ సింగ్ పాత్రలో ప్రముఖ నటుడు అనుపమ్ ఖేర్ నటిస్తున్నారు.


Click it and Unblock the Notifications











