ఇదంతా ఎవరి పని? యూట్యూబ్‌లో ట్రైలర్ కనిపించకుండా కుట్ర?

'ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్' నాలుగైదు రోజులుగా రాజకీయ వర్గాల్లో మాట్ టాపిక్ అయిన ట్రైలర్. 'ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్: ది మేకింగ్ అండ్ అన్ మేకింగ్ ఆఫ్ మన్మోహన్ సింగ్' అనే వివాదాస్పద పుస్తకం ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందించారు. మన్మోహన్‌సింగ్‌పై ఆయన మాజీ మీడియా సలహాదారు సంజయ్ బారు రాసిన పుస్తకం ఇది.

కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని యూపీఏ పదేళ్లు అధికారంలో ఉన్నపుడు మన్మోహన్ ప్రధానిగా పని చేశారు. పేరుకే ఆయన్ను ప్రధాని కుర్చీలో కూర్చోబెట్టి సోనియా, రాహుల్, ఆమె కుటుంబం ప్రభుత్వాన్ని నడిపించారు అనే విమర్శలను ఉన్నాయి. ఈ అంశాలను ఫోకస్ చేస్తూ.. 'ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్' చిత్రాన్ని రూపొందించారు.

ఇటీవల ఈ ట్రైలర్ యూట్యూబ్‌లో విడుదలవ్వగా మంచి స్పందన వచ్చింది. అయితే ఇపుడు ట్రైలర్ చూద్దామని ప్రయత్నించగా అది కనిపించడం లేదు. ట్రైలర్ కాకుండా దానికి గురించి వార్తలే దర్శనిమిస్తున్నాయి. ఈ విషయం మన్మోహన్‌సింగ్‌ పాత్రలో నటించిన అనుపమ్ ఖేర్ దృష్టికి వెళ్లడంతో.... ఈ విషయమై యూట్యూబ్‌కు ఫిర్యాదు చేశారు.

ట్రైలర్ కోసం సెర్చ్ చేస్తే 50వ స్థానంలో కూడా కనిపించడం లేదు, మొన్నటి వరకు నెం.1 ట్రెడింగులో ఉన్న ట్రైలర్ ఇపుడు కనిపించక పోవడం ఏమిటని ప్రశ్నించారు. అయితే ఇదంతా ఎవరి పని? ఇలా చేయడం వెనక ఎవరి కుట్ర అయినా ఉందా? అనే సందేహాలు సైతం వ్యక్తం అవుతున్నాయి.

The Accidental Prime Minister trailer goes missing from YouTube

విజయ్‌ రత్నాకర్‌ దర్శకత్వం వహించిన మూవీలో సోనియా గాంధీ పాత్రలో సుసాన్నే బెర్నెట్‌, ప్రియాంక గాంధీ పాత్రలో అహనా కుమ్రా, రాహుల్‌ గాంధీ పాత్రలో అర్జున్‌ మాథుర్‌ నటించారు. సునీల్‌ బోహ్రా, జయంతిలాల్‌ గదా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 2019 జనవరి 11న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X