For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  The Family Man 2: లోనావాలాలో ప్రియమణికి కొలీగ్ మధ్య ఏం జరిగింది.. షాకింగ్ విషయాలు బయటపెట్టిన మనోజ్ బాజ్పేయి!

  |

  కరోనా కారణంగా దాదాపుగా అందరూ ఇళ్లకే పరిమితం కావడంతో గత ఏడాది నుంచి సినిమాలతో పాటు వెబ్ కంటెంట్ కి కూడా క్రేజ్ పెరుగుతోంది. మరీ ముఖ్యంగా గత ఏడాది రిలీజ్ అయిన వెబ్ సిరీస్ లలో ఫ్యామిలీ మాన్ మంచి పేరు తెచ్చుకుంది. మొదటి సీజన్ సక్సెస్ఫుల్ కావడంతో రెండో సీజన్ కూడా ఈ మధ్యనే రిలీజ్ చేశారు. ఈ రెండో సీజన్ కూడా విశేష ఆదరణ దక్కించుకుంది. తాజాగా ఈ సిరీస్ కు సంబంధించి కొన్ని ఆసక్తికర విషయాలను శ్రీకాంత్ తివారి పాత్రలో నటించిన మనోజ్ బాజ్పేయి పంచుకున్నారు. ఆ వివరాల్లోకి వెళితే.

  The Family Man 2 Review | Samantha, Screenplay రెండూ సూపర్ !! || Filmibeat Telugu
  ఆసక్తికర అంశాలు

  ఆసక్తికర అంశాలు

  ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ అశేష ఆదరణ పొందుతూ మిలియన్ల కొద్దీ వ్యూస్ తెచ్చుకున్న సంగతి తెలిసిందే. ఫ్యామిలీ మాన్ సిరీస్లో లీడ్ పాత్రలో నటించిన మనోజ్ బాజ్పేయి తన నటనకు గాను మంచి పేరు తెచ్చుకున్నారు. ఈ సిరీస్ కు సంబంధించిన కొన్ని వివరాలను ఆయన తాజాగా ఒక వెబ్ సైట్ తో పంచుకోగా ఆ వివరాలన్నీ మీకు అందిస్తున్నాం.

  చాలా ఆనందిసున్నా

  చాలా ఆనందిసున్నా

  ఈ సిరీస్ కి మూడవ సీజన్ ఉంటుందా ఉంటే ఇప్పటికే షూటింగ్ మొదలైందా అలాగే అక్కినేని సమంత తో నటించడం ఎలా అనిపించింది ప్రియమణి ఏం చేసింది ఇలాంటి అనేక అంశాలను ఆయన పంచుకున్నారు. ముందుగా ఈ రెండో సిరీస్ కి మంచి పేరు వస్తుందన్న ఆయన ఆ విషయంలో తను చాలా ఆనందిస్తున్నానని అన్నారు. ప్రేక్షకులు, స్నేహితులు అలాగే ఇండస్ట్రీకి సంబంధించి చాలామంది దీనిని మెచ్చుకుంటూ ఉండటం చూస్తే తాను పడిన కష్టమంతా మరిచి పోతున్నానని చెప్పుకొచ్చారు.

  ఆమె అంటే చాలా గౌరవం

  ఆమె అంటే చాలా గౌరవం

  తాము అనుకున్న దానికంటే ఎక్కువ రెస్పాన్స్ వచ్చిందని ఆయన చెప్పుకొచ్చారు. అలాగే సిరీస్కు ముందు తమిళనాడు వ్యాప్తంగా జరిగిన ఉద్యమం గురించి ప్రస్తావిస్తూ సిరీస్ మొత్తం చూశాక ఆ వివాదం మళ్ళీ లేదని ఆయన చెప్పుకొచ్చారు. ఇక సమంతతో కలిసి పనిచేయడం గురించి ఆయన ఆనందం వ్యక్తం చేశారు. ఆమెతో కలిసి పని చేస్తున్న సమయంలో ఎన్నో సార్లు ఎన్నో విషయాలు షేర్ చేసుకున్నామని ఒకరంటే ఒకరికి చాలా గౌరవం ఉందని చెప్పుకొచ్చారు.

  వారి కృషి అభినందనీయం

  వారి కృషి అభినందనీయం

  ఇక సమంత తెలుగు, తమిళ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ అనే విషయం తనకు తెలుసని ఆమెకు సంబంధించిన ఫ్యాన్స్ కూడా ఈ వెబ్ సిరీస్ ఇంతలా హిట్ కావడానికి బాగా కృషి చేశారు అని చెప్పుకొచ్చారు. ఈ సిరీస్ ఇంత హిట్ కావడం వెనుక వారి కృషి అభినందనీయమని ఆయన అన్నారు. ఇక ఈ రెండవ సిరీస్ లో నటించిన ఆసిఫ్ బాస్రా గురించి ఆయన ప్రస్తావిస్తూ ఆయన తనకు చాలా రోజుల నుంచి మంచి స్నేహితుడని అన్నారు.

  ఆసిఫ్ బాస్రా సీన్స్ చూడలేను

  ఆసిఫ్ బాస్రా సీన్స్ చూడలేను

  ఆసిఫ్ బాస్రా ఆత్మహత్య చేసుకోవడం తనను చాలా బాధించిందని చెప్పుకొచ్చారు. ఆయన చాలా మెంటల్ ట్రామా అనుభవించాడని అందుకే ఇంత దారుణమైన నిర్ణయం తీసుకున్నాడు అని చెప్పుకొచ్చారు. ఆయనతో కలిసి నటించిన సీన్ చూడలేనని అలా చూస్తే నాకు ఇబ్బందికరంగా అనిపిస్తుందని ఆయన చనిపోయిన విషయం కూడా తాను నమ్మలేకపోతున్నానని అన్నాడు.. ఆయన గుర్తు వస్తే ఆయనతో సరదాగా గడిపిన క్షణాలే గుర్తొస్తాయి అని చెప్పుకొచ్చారు.

  లోనావాలాలో ఏం జరిగింది

  లోనావాలాలో ఏం జరిగింది

  ఇక మొదటి సీజన్లో సుచి అలాగే ఆమె కొలీగ్ అరవింద్ మధ్య లోనావాలాలో ఏం జరిగింది అనే విషయం ఇప్పటికీ సస్పెన్స్ గానే ఉంచారని ఈ విషయం శ్రీకాంత్ కి ఉచిత చెప్పిందా లేదా అని అడిగితే ఆయన ఆసక్తికరంగా స్పందించాడు. ఒకవేళ శ్రీకాంత్ కి ఈ విషయం తెలిస్తే ఫ్యామిలీ మెన్ స్టోరీ ఎప్పుడో ముగిసిపోయేదని ఆయన షాకింగ్ కామెంట్స్ చెప్పారు. శ్రీకాంత్ కి తెలియక పోవడమే మంచిదని పేర్కొన్న ఆయన ఒకవేళ సుచి ఏదైనా సందర్భానుసారంగా చెబుతుందా లేదా అనేది తనకు తెలియదని అన్నాడు.

  మీకు తెలిసింది కుడా ఆయనకు తెలీదు

  మీకు తెలిసింది కుడా ఆయనకు తెలీదు

  ఈ విషయం గురించి ఇప్పుడే ఏమీ చెప్పలేమని సుచి శ్రీకాంత్ కి చెబుతుందా లేదా అనేది ఆమెనే డిసైడ్ అవుతుంది అని చెప్పుకొచ్చారు. లోనావాలాలో ఏదో జరిగిందన్న విషయం కనీసం ఆడియన్స్ కైనా తెలుసని కానీ శ్రీకాంత్ కు ఏమీ తెలియదని చెప్పుకొచ్చారు. శ్రీకాంత్ కి సుచి ఆనందంగా లేదని, తన పెళ్లి విషయంలో ఆమె ఇబ్బందిగా ఫీల్ అవుతోంది అని మాత్రమే తెలుసు అని ఆయన చెప్పుకొచ్చారు.

  English summary
  The Family Man 2 star Manoj Bajpayee in an recent interview reveals about aravind - suchi's lonavala episode. he revealed some more interesting facts.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X