టాప్ డైరెక్టర్‌తో సూపర్ స్టార్ సినిమా ఇప్పట్లో లేనట్లే...

బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్, అలియా భట్ రొమాన్స్ వెండితెరపై చూడటానికి మరికొంత సమయం వేచి ఉండాలి. సల్మాన్ ఖాన్, అలియా భట్ తొలిసారి కలి నటిస్తున్న చిత్రం 'ఇన్షా అల్లా'. సంజయ్ లీలా భన్సాలీ దర్వకత్వం వహిస్తున్న ఈచిత్రాన్ని ఈద్ 2020కి ప్లాన్ చేశారు. అయితే ఈ సినిమా అనుకున్న సమయానికి రావడం లేదట.

'ఇన్షా అల్లా' ప్రేక్షకుల ముందుకు రావడానికి మరింత సమయం పడుతుందని వెల్లడిస్తూ సల్మాన్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా అభిమానులకు సందేశం ఇచ్చారు. "సంజయ్ లీలా భన్సాలీతో చేయబోయే సినిమా ఆలస్యం అవుతుంది. అయితే మిమ్మల్ని తప్పకుండా ఈద్ 2020కి థియేటర్లో కలుస్తా, ఇన్షా అల్లా" అని సల్మాన్ ఖాన్ అభిమానులకు భరోసా ఇచ్చాడు. అయితే, ఈద్ సందర్భంగా తన ఏ చిత్రం బయటకు వస్తుందనే వివరాలను ఆయన వెల్లడించలేదు.

 The film with Sanjay Leela Bhansali is pushed but I will still see you all on Eid 2020: Salman Khan

రెండు దశాబ్దాల తరువాత సల్మాన్, సంజయ్ కలిసి 'ఇన్షా అల్లా' చేస్తున్నారు. వారి చివరి చిత్రం 1999లో వచ్చిన హిట్ మూవీ 'దిమ్ దే చుకే సనమ్'. అయితే మధ్య ఆయన సంజయ్ లీలా దర్శకత్వంలో వచ్చిన 'సావరియా'లో అతిధి పాత్ర చేశారు.

సల్మాన్ ఈ ఏడాది మార్చిలో ట్వీట్ చేస్తూ, "మేము కలిసి సినిమా చేసి 20 సంవత్సరాలు అయ్యింది, ఇన్నాళ్ల తర్వాత ఇద్దరం కలిసి సినిమా చేస్తుండటం సంతోషంగా ఉంది. 'ఇన్షా అల్లా' అనే చిత్రం చేయబోతున్నాం. అలియా కూడా ఇందులో నటిస్తోంది'' అని పేర్కొన్నారు.

"నేను మొదట సంజయ్ లీలా భన్సాలీ కార్యాలయంలోకి అడుగుపెట్టినప్పుడు నాకు 9 ఏళ్లు, లోనికి వెళ్లినపుడు కాస్త భయం వేసింది. ఆయన తదుపరి చిత్రంలో ఉంటానని అనుకున్నాను. కానీ ఇంతకాలం వెయిట్ చేయాల్సి వస్తుంది అనుకోలేదు" అని అలియా మర్చి 19న చేసిన ట్వీట్లో పేర్కొన్నారు.

'ఇన్షా అల్లా'లో సల్మాన్ 40 అమెరికాకు చెందిన వ్యాపారవేత్తగా నటించనుండగా, అలియా 20 ఏళ్ల వయసు ఉండే నటిగా కనిపిస్తుంది. ఈ చిత్రం నార్త్ ఇండియా, యూఎస్‌లోని కొన్ని ప్రాంతాల్లో చిత్రీకరించనున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X