The GOAT Box Office: ది గోట్ మూవీకి రికార్డు ఒపెనింగ్స్.. ఆ దేశాల్లో విజయ్ బాక్సాఫీస్ జోష్!

ప్రముఖ తమిళ దర్శకుడు వెంకట్ ప్రభు డైరెక్షన్‌లో కల్పతి ఎస్ అఘోరం, కల్పతి ఎస్ గణేష్, కల్పతి ఎస్ సురేష్ నిర్మించిన చిత్రం ది గ్రెటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ (The GOAt). సైన్స్ ఫిక్షన్ యాక్షన్ డ్రామాగా రూపొందిన ఈ చిత్రంలో ఇళయ దళపతి విజయ్, ప్రభుదేవా, ప్రశాంత్, అజ్మల్ అమీర్, లైలా, స్నేహ, మీనాక్షి చౌదరీ, వైభవ్, యోగిబాబు తదితరులు నటించారు. సెప్టెంబర్ 5వ తేదీన రిలీజ్ అవుతున్న ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్ వివరాల్లోకి వెళితే..

తమిళనాడులో ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ ఏజీఎస్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై రూపొందిన ఈ సినిమాను భారీ వ్యయంతో నిర్మించారు. ప్రముఖ నటీనటులు, ప్రతిభావంతులైన సాంకేతిక నిపుణుల ఈ మూవీకి పనిచేయడంతో నిర్మాణ వ్యయం భారీగా ఖర్చు అయింది. దాంతో ఈ సినిమా బడ్జెట్ సుమారుగా 300 కోట్ల రూపాయలు అయిందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

The Greatest of All Time Advance Booking Worldwide Vijay Movie decent Start in Overseas

అయితే విజయ్‌కు ఉన్న ఫాలోయింగ్‌ను దృష్టిలో పెట్టుకొని ఈ మూవీ అడ్వాన్స్ బుకింగ్‌ను ఓవర్సీస్‌లో ముందుగానే ప్రారంభించారు. ఆస్ట్రేలియా, అమెరికా, యూకే, గల్ఫ్ ఫ్రాంతాల్లో ఒపెన్ అయిన అడ్వాన్స్ బుకింగ్‌కు భారీగా స్పందన లభిస్తున్నది. దీంతో ఈ సినిమా భారీగా వసూళ్లు సాధించే దిశగా అడుగులేస్తున్నది.

ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ (The GOAt) చిత్రానికి ఆస్ట్రేలియాలో తొలి రోజు మంచి రెస్పాన్స్ లభించింది. ఫస్ట్ డే అడ్వాన్స్ బుకింగ్ సుమారుగా 100K ఆస్ట్రేలియన్ డాలర్లు వసూలు చేసింది. ఇటీవల కాలంలో తొలి రోజు అడ్వాన్స్ బుకింగ్ ఈ మొత్తంలో రావడం ఇదే మొదటిసారి అని ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి.

ఇక నార్త్ అమెరికాలో ఈ మూవీకి డిమాండ్ బాగానే కనిపిస్తున్నది. ఈ చిత్రం ఇప్పటి వరకు అడ్వాన్స్ బుకింగ్ ద్వారా 400K డాలర్లు వసూలు చేసిందని ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఇంకా ఎనిమిది రోజులకుపైగా ఉండటంతో భారీగానే అడ్వాన్స్ బుకింగ్ కలెక్షన్లు నమోదు అవుతాయని పేర్కొన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X