The India Story Censor Report: ది ఇండియా స్టోరి సెన్సార్ రిపోర్ట్.. కాజల్ అగర్వాల్‌కు షాక్

సౌత్ అండ్ బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం ది ఇండియా స్టోరి. ఈ సినిమాకు చేతన్ డీకే దర్వకత్వం వహించారు. సాగర్ బీ షిండే ఈ మూవీకి నిర్మాతగా వ్యవహరించారు .ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు శ్రేయాస్ తల్పాడే, మనీష్ వాద్వా, మురళీ శర్మ, అశ్వినీ బాండ్వే, హార్ధిక జోషి తదితరులు నటించారు. ఈ సినిమాను జీ స్టూడియోస్ సమర్పిస్తున్నది. ఎంఐజీ ప్రొడక్షన్స్ అండ్ స్టూడియోస్ బ్యానర్‌పూ నిర్మించారు.

ఈ సినిమా సాంకేతిక విభాగాల వివరాల్లోకి వెళితే.. మ్యూజిక్: మంగేష్ ధాక్డే, సినిమాటోగ్రాఫర్: నిశాంత్ భగత్, ఎడిటర్: ఆశీష్ మాత్రే, ప్రొడక్షన్ డిజైనర్: మితేష్ జోరే తదితరులు తమ బాధ్యతల్ని నిర్వర్తించారు. ఈ సినిమాకు సెన్సార్ వ్యవహారం వివాదాల్లో చిక్కుకొన్నది. ఈ సినిమా సెన్సార్ సర్టిఫికెట్ జారీ విషయంలో జాప్యం జరిగింది. ఈ మూవీ సెన్సార్ వివాదం ఏమిటనే వివరాల్లోకి వెళితే..

The India Story Censor Report

ది ఇండియా స్టోరి సినిమా కథ విషయానికి వస్తే.. వ్యవసాయ రంగంలోను, ఆహార పదార్థాల ఉత్పత్తి రంగంలో క్రిమి సంహారక మందుల ఉపయోగం వల్ల సమాజం, మనుషులపై దారుణమైన దుష్ప్రరిణామాలు చోటు చేసుకొంటున్నాయి. మానవ జీవనానికి స్లో పాయిజన్‌గా మారుతున్నాయనే పాయింట్‌తో సినిమా రూపొందింది. కోర్టు రూమ్ డ్రామాగా రూపొందిన ఈ చిత్రంలో లాయర్ పాత్రలో కాజల్ అగర్వాల్ నటించారు.

ఈ మూవీలో చర్చించిన పాయింట్, కథపై వ్యవసాయ రంగ వ్యాపార నిపుణులు తీవ్ర అభ్యంతరాలు తెలిపారు. క్రిమి సంహారక మందులు స్లో పాయిజన్ అని చెప్పడంపై నిరసన వ్యక్తం చేశారు. అంతేకాకుండా అలాంటి సన్నివేశాలు, డైలాగ్స్ తొలగించకపోతే లీగల్ నోటీస్ పంపుతాం అని చిత్ర నిర్మాతలను వార్నింగ్ ఇచ్చారు. అంతేకాకుండా మీ దగ్గర ఈ విషయానికి సంబంధించిన సైంటిఫిక్‌గా ఆధారాలు ఉంటే చూపించాలి అని వారు డిమాండ్ చేశారు. దాంతో ఈ సినిమా సెన్సార్ సర్టిఫికెట్ జారీ చేయడంలో జాప్యం జరిగింది. ఈ చిత్రంలోని కంటెంట్‌పై వ్యక్తమవుతున్న అభ్యంతరాలను చిత్ర నిర్మాతలు, దర్శకుల దృష్టికి సెన్సార్ అధికారులు తీసుకొచ్చారు.

ఈ సినిమాలోని సన్నివేశాలు, వాదనలు ప్రజలను తప్పు దోవ పట్టించేలా ఉన్నాయి. కాబట్టి ఈ సినిమాను రిలీజ్ చేయకుండా వాయిదా వేయాలి. ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాలను తొలగించాలి. కొన్ని డైలాగ్స్‌ను మార్చాలి అంటూ వ్యాపార వర్గాలు ఆందోళన చేస్తున్నారు. దాంతో ఈ సినిమా వివాదాల్లో చిక్కుకోవడం జరిగింది. దాంతో ఈ సినిమాకు ఎలాంటి సర్టిఫికెట్ లభిస్తుంది? ఈ చిత్రం జూలై 24వ తేదీన రిలీజ్ అవుతుందా? లేదా? అనేది ఆసక్తికరమైన విషయంగా మారింది.

Read more about: kajal aggarwal
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X