సూరజ్ పంచోలీ నిర్దోషి, జియా ఖాన్ హత్య కేసులో సీబీఐ కోర్టు సంచలన తీర్పు
బాలీవుడ్ నటి జియా ఖాన్ మృతి కేసులో ముంబయి సీబీఐ ప్రత్యేక కోర్టు తీర్పు ఇచ్చింది. నటుడు సూరజ్ పంచోలీని నిర్దోషిగా ప్రకటించింది. సూరజ్ లీని దోషిగా నిర్ధారించేందకు ఎలాంటి సాక్ష్యాధారాలు లేకపోవడంతో నిర్దోషిగా ప్రకటిస్తున్నట్లు కోర్టు పేర్కొంది. 2013 జూన్ 3వ తేదీన బాలీవుడ్ నటి జియా ఖాన్ ముంబైలోని తన ఇంట్లో సూసైడ్ చేసుకుని చనిపోయింది.
జియా ఖాన్ రాసి పెట్టిన లేఖ ఆధారంగా జియా ఖాన్ సూసైడ్ కు నటుడు సూరజ్ పంచోలీ కారణమని పేర్కొంటూ సెక్షన్ 306 కింద అరెస్టు చేశారు పోలీసులు.
జియా ఖాన్ రాసినట్లుగా చెబుతున్న లేఖను తాను చనిపోయిన వారం రోజుల తర్వాత అంటే జూన్ 10వ తేదీన పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. జియా ఖాన్ కు, ఆదిత్య పంచోలీ జరీనా వహాబ్ ల కుమారుడు అయిన సూరజ్ పంచోలీకి మధ్య అఫైర్ ఉండేది.

చాలా కాలం పాటు వారిద్దరి మధ్య సంబంధం కొనసాగింది. జియా ఖాన్ చనిపోయిన తర్వాత తన మృతికి సూరజ్ పంచోలీయే కారణమని జియా తల్లి రబియా ఖాన్ ఆరోపించారు. సూరజ్ పంచోలీయే దోషి అని తన వల్లే జియా ఖాన్ సూసైడ్ చేసుకుందని ఆరోపించింది రబియా ఖాన్. 2013 అక్టోబరులో సీబీఐ విచారణ కోరుతూ బాంబే హైకోర్టును ఆశ్రయించింది. అంతే కాదు జియా ఖాన్ ఆత్మహత్య చేసుకోలేదని, తనను చంపేసి సూసైడ్ గా చిత్రీకరించారని రబియా ఖాన్ ఆరోపించింది.

బాంబే హైకోర్టు ఆదేశాల మేరకు జులై 2014లో మహారాష్ట్ర పోలీసుల నుండి సీబీఐ కి జియా ఖాన్ మృతి కేసు బదిలీ అయింది. జియా ఖాన్, సూరజ్ పంచోలీ లివింగ్ రిలేషన్ షిప్ లో ఉండేవారని జియా ఖాన్ తల్లి సీబీఐకి చెప్పింది. అయితే ఈ కేసులో సీబీఐ విచారణ జరిపి కోర్టు ముందు ప్రవేశ పెట్టింది. ఇరువైపుల వాదనలు, సాక్ష్యాధారాల ఆధారంగా నేడు సీబీఐ కోర్టు సూరజ్ ను నిర్దోషిగా తేల్చింది.


Click it and Unblock the Notifications











