twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రోజు రోజుకూ రికార్డులు సృష్టిస్తూ పోతున్న ది కాశ్మీర్ ఫైల్స్.. దర్శకుడికి Y కేటగిరీ భదత్ర?

    |

    బాలీవుడ్ ఫిల్మ్ మేకర్, 'ది కాశ్మీర్ ఫైల్స్' డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రికి 'వై' కేటగిరీ భద్రత కల్పించారు. ఆయన భద్రత కోసం ఇప్పుడు సాయుధ కమాండోలను నియమించారు. భారతదేశం అంతటా ఆయన ఎక్కడ ఉన్నా ఆయనకు CRPF రక్షణగా ఉంటుంది. 1990లలో కాశ్మీరీ పండిట్ కమ్యూనిటీకి చెంది మారణహోమానికి గురైన మొదటి తరం బాధితుల వీడియో ఇంటర్వ్యూ ఆధారంగా వివేక్ అగ్నిహోత్రి 'ది కాశ్మీర్ ఫైల్స్'ని రూపొందించారు. అసలు ఆయనకు ఎందుకు ఈ భద్రత కల్పించారు అనే వివరాల్లోకి వెళితే

    భద్రత కల్పించాలని సిఫార్సు

    భద్రత కల్పించాలని సిఫార్సు


    బాక్సాఫీస్ వద్ద 100 కోట్ల మార్క్‌ను క్రాస్ చేసిన ఈ చిత్రానికి దేశవ్యాప్తంగా భారీ ఆదరణ లభించింది. కాశ్మీరీ పండిట్ల పోరాటం, వారి వర్ణించలేని బాధను చూపించినందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మరియు కేంద్ర హోం మంత్రి అమిత్ షా కూడా సినిమా మరియు దర్శకుడు వివేక్ అగ్నిహోత్రిని ప్రశంసించారు. అయితే కాశ్మీర్ ఫైల్స్ డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రికి ఉన్న ముప్పును ముందే ఊహించిన కేంద్ర నిఘా సంస్థలు,వీఐపీ భద్రత కల్పించాలని సిఫార్సు చేశాయని అంటున్నారు. భారతదేశంలో భద్రతను వారి థ్రెట్ ను బట్టి Z ప్లస్, Z, Y మరియు X కేటగిరీలుగా విభజిస్తారు. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ, ఇంటెలిజెన్స్ బ్యూరో (IB) సిఫార్సు మీద ప్రతి సంవత్సరం నిర్దిష్ట వ్యక్తుల భద్రతను సమీక్షిస్తుంది.

    వివిధ వర్గాలుగా

    వివిధ వర్గాలుగా


    వారి ప్రమాద స్థాయిని బట్టి, ఉన్నత మరియు ప్రత్యేక వ్యక్తులకు వివిధ కేటగిరీలుగా రక్షణ కల్పిస్తారు. దేశంలో వీఐపీ భద్రతను దృష్టిలో ఉంచుకుని వారికి వివిధ కేటగిరీల భద్రతను కల్పిస్తారు. పెద్ద నాయకులకు, అధికారులకు ఎలాంటి భద్రత కల్పించాలో నిర్ణయించే హక్కు ప్రభుత్వానికి ఉంది. ఆ సెక్యూరిటీ సిస్టమ్ అంటే ఏమిటి వివిధ వర్గాలుగా వర్గీకరించబడింది. ఇందులో SPG రక్షణ, Z ప్లస్, Z, Y మరియు X కేటగిరీలు ఉన్నాయి.

     దేశంలో చాలా మందికి

    దేశంలో చాలా మందికి


    ఇప్పుడు వివేక్ అగ్నిహోత్రికి కేటాయించిన Y కేటగిరీ, సెక్యూరిటీలో మూడవ స్థాయి. ఈ రక్షణ తక్కువ ప్రమాదం ఉన్న వ్యక్తులకు అందించబడుతుంది. ఈ Y కేటగిరీలో మొత్తం 11 మంది భద్రతా సిబ్బంది నిర్ణీత వ్యక్తులకు భద్రత కల్పిస్తారు. వీరిలోనే ఇద్దరు పిఎస్‌ఓలు (ప్రైవేట్ సెక్యూరిటీ గార్డ్‌లు) మరియు ఒకరు లేదా ఇద్దరు కమాండోలను కూడా నియమిస్తారు. . దేశంలో చాలా మందికి వై కేటగిరీ భద్రత కల్పించారు. గతంలో కంగనాకు కూడా ఈ స్థాయి రక్షణ కల్పించారు.

    కంగనా రనౌత్‌కు కూడా

    కంగనా రనౌత్‌కు కూడా


    ఈ సినిమా చేసినందుకు గాను తనను చంపేస్తామని బెదిరింపులు వస్తున్నాయని వివేక్ అగ్నిహోత్రి పేర్కొన్న సంగతి తెలిసిందే. ఆ తర్వాతే వారికి వై కేటగిరీ భద్రత కల్పించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ సినిమా విడుదలకు ముందే వివేక్ అగ్నిహోత్రి తన ట్విట్టర్ ఖాతాను కూడా డీయాక్టివేట్ చేశారు. తనకు, తన కుటుంబానికి కొందరు వ్యక్తులు చంపేస్తామని బెదిరింపులు, అసభ్యకర సందేశాలు పంపిస్తున్నారని తెలిపారు. వివేక్ అగ్నిహోత్రి కంటే ముందే నటి కంగనా రనౌత్‌కు కూడా ప్రభుత్వం వై కేటగిరీ భద్రతను కల్పించింది.

    ఏ కేటగిరీ రక్షణ కల్పించాలో

    ఏ కేటగిరీ రక్షణ కల్పించాలో


    సాధారణంగా ప్రాణాపాయంలో ఉన్న దేశంలోని గౌరవనీయ వ్యక్తులు, రాజకీయ నాయకులకు ఈ భద్రత కల్పిస్తారు. ఈ భద్రత మంత్రులకు కల్పించే భద్రతకు భిన్నంగా ఉంటుంది. మాములుగా దీని కోసం ప్రభుత్వానికి దరఖాస్తు ఇవ్వాలి, ఆ తర్వాత ప్రభుత్వం నిఘా వర్గాల ద్వారా ప్రమాదాన్ని అంచనా వేస్తుంది. బెదిరింపు నిర్ధారణ కాగానే భద్రత కల్పిస్తారు. సంబంధిత వ్యక్తులకు ఏ కేటగిరీ రక్షణ కల్పించాలో హోం సెక్రటరీ, డైరెక్టర్ జనరల్ మరియు చీఫ్ సెక్రటరీ కమిటీ నిర్ణయిస్తుంది.

    కలెక్షన్స్ విషయానికి వస్తే

    కలెక్షన్స్ విషయానికి వస్తే


    ది కాశ్మీర్ ఫైల్స్' గత శుక్రవారం, మార్చి 11న విడుదలైన తర్వాత మంచి బిజినెస్‌ను చేస్తోంది. ఈ సినిమా వారం రోజుల్లో ఇండియన్ బాక్సాఫీస్ వద్ద మంచి బిజినెస్ చేసింది. ఇప్పటివరకు ఈ సినిమా 7 రోజుల్లో టోటల్ గా 98.30 కోట్ల బిజినెస్ చేసింది. ఏడో రోజు ఈ సినిమా రూ.19.05 కోట్లు రాబట్టింది. అంతకుముందు రోజు కంటే ఇది 5.83 శాతం ఎక్కువ. అలా టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్ ఇప్పుడు రూ.98.30 కోట్లుకు చేరింది. ఈ చిత్రంలో అనుపమ్ ఖేర్, దర్శన్ కుమార్, పల్లవి జోషి, మిథున్ చక్రవర్తి, చిన్మయ్ మాండ్లేకర్ ప్రధాన పాత్రలు పోషించారు.

    English summary
    The Kashmir Files director Vivek Agnihotri gets Y category security
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X