twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Ranveer Singh's Nude Photoshoot ప్రచారం కోసమే.. ఘాటుగా స్పందించిన కశ్మీరి ఫైల్స్ డైరెక్టర్

    |

    బాలీవుడ్ నటుడు రణ్‌వీర్ సింగ్ ఇటీవల చేసిన న్యూడ్ ఫోటోషూట్ దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. జూలై 21వ తేదీన పేపర్ మ్యాగజైన్‌లో ప్రచురించబడిన ఈ ఫోటోషూట్ వివాదాస్పదంగా మారింది. గోడకు అత్తుకొన్ని.. నేలను అతుకొన్న బల్లిలా రణ్‌వీర్ సింగ్ చేసిన ఫోటోషూట్‌పై రకరకాల కామెంట్లు, అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఈ క్రమంలో వివాదాస్పద చిత్రం కశ్మీరీ ఫైల్స్ చిత్ర దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి ఘాటు స్పందించిన తీరు ఎలా ఉందంటే?

     పాప్ ఐకాన్‌కు నివాళిగా

    పాప్ ఐకాన్‌కు నివాళిగా


    70వ దశకంలో పాప్ ఐకాన్ బర్ట్ రేనాల్డ్స్ పేపర్ మ్యాగజైన్ కోసం ఫోటోషూట్ చేసి అప్పట్లో సంచలనం రేపాడు. బర్ట్ రేనాడ్స్‌కు నివాళిలర్పించేందుకు కోసం రణ్‌వీర్ సింగ్ ఈ ఫోటోషూట్ చేశాడు. గోడకు బల్లిలా అతుక్కొని.. నేలను కరుచుకొని రణ్‌వీర్ ఫోటోషూట్‌కు ఫోజిచ్చాడు. ఈ ఫోటోషూట్‌పై సోషల్ మీడియాలో కొందరు దుమ్మెత్తి పోస్తున్నారు.

    ముంబైలో ఎఫ్ఐఆర్ నమోదు

    ముంబైలో ఎఫ్ఐఆర్ నమోదు

    రణ్‌వీర్ సింగ్ న్యూడ్ ఫోటోషూట్‌ తప్పుబడుతూ మంగళవారం ముంబైలోని చెంబూరు పోలీస్ స్టేషన్‌లో ఎఫ్ఐఆర్ నమోదైంది. రణ్‌వీర్ సింగ్‌పై నేకీ ఖి దీవార్ అనే స్వచ్చంద సంస్థ పోలీసులకు ఫిర్యాదు చేసింది.నగ్నంగా ఫోటోషూట్ చేసి మహిళల మనోభావాలను దెబ్బ తీశారు. కావున బాలీవుడ్ నటుడిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు.

     స్వచ్ఛంద సంస్థ ఫిర్యాదుతో

    స్వచ్ఛంద సంస్థ ఫిర్యాదుతో


    నేకీ ఖి దీవార్ సంస్థ దాఖలు చేసిన ఫిర్యాదును పరిగణనలోకి తీసుకొన్న ముంబై పోలీసులు ఇండియన్ పీనల్ కోడ్ కింద కేసు నమోదు చేశారు. ఐటీ యాక్ట్ ప్రకారం సెక్షన్ 292, 293 50 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ కేసుపై దర్శకుడు వివేక్ ఆగ్నిహోత్రి ఘాటుగా స్పందించారు.

     రణ్‌వీర్ సింగ్‌పై కేసు నమోదా?

    రణ్‌వీర్ సింగ్‌పై కేసు నమోదా?


    ముంబైలో జాతీయ టెలివిజన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వివేక్ అగ్నిహోత్రి స్పందిస్తూ.. రణ్‌వీర్‌పై కేసు నమోదు చేయడం స్టుపిడ్ చర్యగా అభివర్ణించారు.కేవలం ప్రచారం కోసమే ఈ కేసు నమోదు చేశారు. ఈ కేసు దాఖలైన తీరు చూస్తే చాలా ఆశ్చర్యంగా ఉంది. మహిళ మనోభావాలు దెబ్బ తినడం ఏమిటి అని అగ్నిహోత్రి ప్రశ్నించారు.

    దేవుడు సృష్టించిన అద్బుతం అంటూ

    దేవుడు సృష్టించిన అద్బుతం అంటూ


    ఎన్నో ఏళ్ల నుంచి మీడియాలో మహిళల నగ్న, అర్ధనగ్న చిత్రాలు విస్తృతంగా ప్రచారంలో ఉన్నాయి. అప్పుడు మగవాళ్ల మనోభావాలు దెబ్బ తిన్నాయా? రణ్‌వీర్ ఫోటోషూట్ చేస్తే దానిని తప్పుబడుతూ వాదన చేయడం నిజంగా తెలివి తక్కువతనమే. మానవ శరీరం గురించి మన సంస్కృతిలో గొప్పగా చెప్పుకొన్నారు. భూమిపై దేవుడు సృష్టించిన అద్బుతంలో మానవ శరీరం ఒకటి. అలాంటి దేహాన్ని చూపించుకోవడం తప్పు అవుతుందా? ఇలాంటి వాదనలు, కేసులు నాకు నచ్చవు. ఇలాంటివి సనాతన ఆలోచనలు. వాటిని నేను ఒప్పుకోను అని వివేక్ అగ్నిహోత్రి అన్నారు.

    English summary
    The Kashmir Files director condemns on Case filed on Ranveer Singh nude photoshoot. Vivek Agnihotri reacted that, filing a case on Ranveer Singh is stupidity.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X