ఒంటరితనంతో నిర్మాత సూసైడ్.. డబ్బు, అక్రమ సంబంధాల వల్లే అంటూ ది కశ్మీర్ ఫైల్స్ డైరెక్టర్ సంచలన లేఖ
బాలీవుడ్‌లో ప్రముఖ నిర్మాత నితిన్ దేశాయ్ అలియాస్ నితిన్ చంద్రకాంత్ దేశాయ్ ఆత్మహత్య హిందీ సినీ పరిశ్రమలో కలకలం రేపింది. టెలివిజన్ రంగంలో కౌన్ బనేగా కరోడ్ పతి, బాలీవుడ్‌లో లగాన్, దేవదాస్ లాంటి హిట్ చిత్రాలను నిర్మించిన ఆయన బుధవారం ముంబైలోని కజ్రత్‌లోని సొంత స్టూడియోలో సూసైడ్ చేసుకోవడం సంచలనం రేపింది. నితిన్ దేశాయ్ మరణం తర్వాత ది కశ్మీర్ ఫైల్స్ దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి ట్విట్టర్‌లో సంచలన పోస్టు పెట్టారు. వివేక్ అగ్నిహోత్రి చేసిన ట్వీట్ వివరాల్లోకి వెళితే..
దర్శక, నిర్మాత వివేక్ రంజన్ అగ్నిహోత్రి సుదీర్ఘమైన లేఖ రాస్తూ.. నీవు ఎంత పెద్ద సక్సెస్ సాధించినా.. చివరకు నీవు ఓటమితోనే నీ జీవితాన్ని ముగించే రంగం బాలీవుడ్ సినిమా ప్రపంచం. అంతా నీ చుట్టే ఉన్నట్టు అనిపిస్తుంది. కానీ చివర్లో నీతో ఏది ఉండదు. నువ్వు, నీకు నీవుగానే మిలిగిపోతావు అని ట్వీట్‌లో పేర్కొన్నాడు.

సినిమా పరిశ్రమలో పేరు, ప్రఖ్యాతులు, డబ్బు, అభిమానులు, సైకోఫాంట్స్, కవర్లు,రిబ్బన్లు, అమ్మాయిలు, వారితో సంబంధాలన్నీ సక్సెస్‌తోపాటు అన్నీ నీతో వేగంగా ప్రయాణిస్తాయి. సక్సెస్‌లో ఉన్నప్పుడు నైతిక విలువలు, నీతి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. డ్రంక్ అండ్ డ్రైవింగ్, రేప్, టెర్రరిజం, హత్యలు చేసినా పట్టించుకోరు అని ట్వీట్‌లో వివేక్ ఎమోషనల్‌గా స్పందించారు.
బాలీవుడ్‌లో సక్సెస్ సాధిస్తే డబ్బు కుప్పలుతెప్పలుగా వచ్చి పడుతుంది. కానీ నీవు మధ్య తరగతి వాడిగానే జీవించావు. ఊహించని విధంగా వచ్చిన డబ్బు ఏం చేయాలో తెలియదు. భారీగా పెట్టుబడులు పెడుతావు. జనం నిన్ను బాగా నమ్ముతారు. నీవు చాలా మందికి సలహాలు ఇచ్చే స్థాయికి ఎదుగుతావు. నీకు సలహాలు ఇచ్చేవాళ్లు కరువు అవతుారు. నీవు ఎవరినీ నమ్మని స్థితికి చేరుకొంటావు అని వివేక్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు.

పరిశ్రమలోకి కొత్త జనరేషన్ వస్తూనే ఉంటుంది. నీవు నీ అస్థిత్వాన్ని క్రమంగా కోల్పుతుంటావు. నీవు పేరు ప్రఖ్యాతులు, డబ్బు మాయలోనే కొట్టుమిట్టాడుతుంటావు. నీలో ఇంకా డిమాండ్లు పెరిగిపోతుంటాయి. నీవు డిమాండ్ చేస్తూంటే నిన్ను ఈ ప్రపంచం ఒంటరివాడిని చేస్తుంది. అప్పుడు నీకు తెలియని చీకటి గుహలోకి మెల్లగా జారుకొంటావు. ఆ చీకటి ప్రపంచంలో ఏం జరుగుతుందో నీకు మాత్రమే తెలుస్తుంది. నీవు ఏదో చెప్పాలనుకొంటావు. కానీ నీ మాటలు వినే టైమ్ ఎవరికీ ఉండదు అని వివేక్ అగ్నిహోత్రి భావోద్వేగమయ్యారు.
గ్లామర్ ప్రపంచ మత్తులో ఉండి.. ఫ్యామిలీ, స్నేహితులు, విలువలు, నైతికత, నియమాలు, దయ, గ్రాటిట్యూడ్ లాంటి విషయాలను మరిచిపోతావు. దాంతో నీవు నీ అస్థిత్వాన్ని కోల్పోతావు.
నీకంటే ఓ గుర్తింపు కోల్పోతే.. నిన్నెవరూ ఇక్కడ పట్టించుకోరు. నీకు నీవుగా మిగిలిపోతావు. మేకప్, ఫ్యాన్స్ లేకుండా బయటకు రాలేవు. నీకు సీలింగ్ మాత్రమే మిత్రుడిగా మిగిలిపోతుంది. అదే నీ ఒంటరితనం, విషాద జీవితానికి ముగింపు పలుకుతుంది. సాధారణంగా బాలీవుడ్‌లో ప్రతీ జీవితానికి ముగింపు ఇదే అని వివేక్ అగ్నిహోత్రి తన సుదీర్ఘమైన లేఖను ముగించారు.


Click it and Unblock the Notifications











