60 ఏళ్ళ హీరోలు 20 ఏళ్ళ అమ్మాయిలతో రొమాన్స్.. ది కాశ్మీర్ ఫైల్స్ డైరెక్టర్ సంచలన వ్యాఖ్యలు

సినిమా ఇండస్ట్రీలో గత కొంతకాలంగా అనేక మార్పులు చోటు చేసుకుంటున్న విషయం తెలిసిందే. జనాలు కమర్షియల్ సినిమాలకు రెగ్యులర్ సినిమాలకు పూర్తిగా దూరం పెట్టేశారు. వీలైనంత వరకు హై విజువల్ అలాగే సరికొత్త కంటెంట్ ఉంటే గానీ థియేటర్స్ వరకు రావడం లేదు. ఇక రీసెంట్ గా కొన్ని సినిమాలతో ఆ విషయం చాలా క్లారిటీగా అర్థమయింది. అయితే ఈ తరుణంలో బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు వివేక్ రంజన్ అగ్నిహోత్రి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి. ఆ వివరాల్లోకి వెళితే..

నెగిటివ్ ట్యాగ్స్

నెగిటివ్ ట్యాగ్స్

తరచుగా సినిమా ఇండస్ట్రీలో కొన్ని కాంబినేషన్స్ పై ఊహించని విధంగా విమర్శలు అయితే వస్తూ ఉంటాయి. ముఖ్యంగా బాలీవుడ్ సినిమా ప్రపంచంలో ఇటీవల కాలంలో హిందూ మతాలను కించపరిచే విధంగా హిందూ దేవుళ్లను తక్కువ చేసి చూపించే విధంగా కొంతమంది బాలీవుడ్ హీరోలు ప్రయత్నిస్తున్నారు అని ఇక వారిని క్షమించేది లేదు అని వారు సినిమాలను పూర్తిగా బాయ్ కాట్ చేయలేని నెగిటివ్ ట్యాగ్స్ ఒక రేంజ్ లో వైరల్ చేస్తున్నారు.

నెటిజన్స్ ఫైర్

నెటిజన్స్ ఫైర్

లాల్ సింగ్ చడ్డా సినిమాపై కూడా తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా విడుదల కాకముందే బాయ్ కాట్ చేయాలి అంటూ సోషల్ మీడియాలో అనేక రకాల ట్రెండింగ్ ట్యాగ్స్ వైరల్ అయ్యాయి. ఎందుకంటే గతంలో ఆమీర్ ఖాన్ చేసిన కొన్ని వ్యాఖ్యలుపై నెటిజన్లు తీవ్ర స్థాయిలో అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇండియాలో రక్షణ లేదు అనే విదేశాలకు వెళ్లిపోవాలని ఉంది అన్నట్లుగా దేశాన్ని తక్కువ చేసి మాట్లాడాడు అని నెటిజన్స్ ఒక రేంజ్ లో ఫైర్ అయ్యారు.

ది కాశ్మీర్ ఫైల్స్ డైరెక్టర్

ది కాశ్మీర్ ఫైల్స్ డైరెక్టర్

అయితే ఈ తరహా వివాదాలు కొనసాగుతున్న సమయంలో ది కాశ్మీర్ ఫైల్స్ సినిమాతో సంచలన విజయాన్ని అందుకున్న ప్రముఖ దర్శకుడు వివేక్ రంజన్ అగ్నిహోత్రి చేసిన కొన్ని వ్యాఖ్యలు సోషల్ మీడియాలోనే కాకుండా డిజిటల్ మీడియాలో కూడా హాట్ టాపిక్ గా మారిపోతున్నాయి. ముఖ్యంగా ఆయన సీనియర్ హీరోల పై చేసిన కామెంట్స్ ఊహించిన విధంగా ఉన్నాయి.

ఏదో లోపం ఉంది..

ఏదో లోపం ఉంది..

వివేక్ రంజన్ అగ్నిహోత్రి స్పందిస్తూ.. 60 ఏళ్ల హీరోలు 20/30 ఏళ్ల అమ్మాయిలతో రొమాన్స్ చేయడానికి, ఫోటో షాపింగ్ ముఖాలతో యవ్వనంగా కనిపించడానికి తహతహలాడుతున్నప్పుడు, సినిమా నాణ్యతను మరచిపోండి, బాలీవుడ్‌లో ప్రాథమికంగా ఏదో లోపం ఉంది... అంటూ ఆయన ట్విట్టర్ లో పేర్కొన్నారు.

బాలీవుడ్‌ నాశనం..

బాలీవుడ్‌ నాశనం..

అంతే కాకుండా బాలీవుడ్ డు నాశనం చేయడానికి ఒక ముఖ్యమైన కారణం ఉందని అనడం అందరిని షాక్ కు గురి చేసింది. సీనియర్ స్టార్స్ చాలా వరకు 'యంగ్‌గా అలాగే కూల్‌గా కనిపించడం' వల్లనే బాలీవుడ్‌ని నాశనం చేసింది. దీనికి ఒక వ్యక్తి మాత్రమే బాధ్యత వహిస్తాడు.. అని అన్నారు. ఇక ఆ బాధ్యత వహించే వ్యక్తి ఎవరు అనే విషయంలో అనేక రకాల పేర్లు వైరల్ అవుతున్నాయి. ఎక్కువగా బాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రధానమైన ముగ్గురు హీరోల పేర్లను ఇతర నెటిజన్లు ప్రస్తావనకు తీసుకు వస్తున్నారు .

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X