సూసైడ్ చేసుకున్న లైన్ ప్రొడ్యూసర్.. అనుపమ్ ఖేర్ ఎమోషనల్ నోట్!

బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ ఒక విషాదకర వార్తని పంచుకున్నారు. ఆయన చేస్తున్న చిత్రం ది కాశ్మీర్ ఫైల్స్ లైన్ నిర్మాత సరానా ఆత్మహత్య చేసుకుందని ఆయన వెల్లడించారు. అనుపమ్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక హృదయ విదారక నోట్‌తో సరానాను జ్ఞాపకం చేసుకున్నారి. సమాచారం ప్రకారం, జూన్ 30 న సరానా ఉరి వేసుకుంది. అనుపమ్ ఫోన్ కు ఒక మెసేజ్ వచ్చింది, ఆ మెసేజ్ సరానా తల్లి పంపింది. ఆయన తన పోస్ట్‌లో ఆ స్క్రీన్ షాట్‌ను కూడా పంచుకున్నాడు.

ఉత్తరాఖండ్‌లో షూటింగ్‌ సందర్భంగా ఈ సినిమా సెట్స్‌లో ఆలస్యంగా సరానా పుట్టినరోజును జరుపుకున్న విషయాన్ని కూడా తన సుదీర్ఘ నోట్‌లో గుర్తు చేసుకున్నారు. గత ఏడాది దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ ప్రకటించిన తరువాత ఉత్తర ప్రదేశ్‌లోని అలీఘడ్లోని స్వగ్రామానికి వెళ్లినట్లు అనుపమ్ చెప్పుకొచ్చారు. తన పెంపుడు కుక్కతో ఉన్న సరానా పిక్ షేర్ చేసిన అనుపమ్, "ఇది సరానా నేను డెహ్రాడూన్ & ముస్సూరీలో కాశ్మీర్ ఫైల్స్ షూటింగ్ చేస్తున్నప్పుడు ఆమె సినిమాకి లైన్ ప్రొడ్యూసర్ అని చెప్పుకొచ్చారు. ఈ యూనిట్ తో పాటు ఆమె గత సంవత్సరం డిసెంబర్ 22న తన పుట్టినరోజును జరుపుకుందని అన్నారు.

‘The Kashmir Files’ line producer dies by suicide Anupam Kher pens an emotional note

జూలై 8న సరానా మరణ వార్త తనకు తెలిసిందని వెల్లడించారు. ఇక అనుపమ్ మరణించిన సరానా కుటుంబం కోసం ప్రార్థించాడు. " ఈ రోజు నాకు ఆమె ఫోన్ నుండి ఒక సందేశం వచ్చిందని, అది నన్ను నిజంగా కదిలించిందని అన్నారు. ఇక ఈ విషయం నన్ను తీవ్రంగా బాధపెట్టిందని అన్నారు. నిరాశ యువతరాన్ని ఎలా తీవ్రంగా ప్రభావితం చేస్తుందో ఇప్పటికైనా తెలుసుకోవాలాని అనుపమ్ పేర్కొన్నారు. నేను ఆమె ఆత్మ శాంతి కోసం ప్రార్థిస్తున్నాను మరియు ఆమె తల్లి మరియు సోదరుడు ఈ నష్టాన్ని ఎదుర్కోగలరని ఆశిస్తున్నానని ఆయన చెప్పుకొచ్చారు. ఇక ఈ మధ్య కాలంలో చాలా నటీనటులు, సినీ ఇండస్ట్రీకి చెందిన వారి సూసైడ్ కేసులు కొంచెం తగ్గాయనే చెప్పాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X