The Kerala Story 2: కేరళ స్టోరీ 2 సరికొత్త వివాదం.. ముఖ్యమంత్రి సీరియస్ వార్నింగ్!
బాలీవుడ్‌లో ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ సన్‌షైన్ పిక్చర్స్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత విపుల్ అమృత్‌లాల్ షా నిర్మించిన చిత్రం ది కేరళ స్టోరి 2 గోస్ బియాండ్. ఈ సినిమాకు కామఖ్య నారాయణ్ సింగ్ దర్వకత్వం వహించారు. ఈ సినిమాకు ఆషిన్ ఏ షా, రవిచంద్ నల్లప్ప సహ నిర్మాతలుగా వ్యవహరించారు. వాస్తవ సంఘటనల ఆధారంగా అత్యంత వివాదాస్పద చిత్రంగా తెరకెక్కిన ఈ చిత్రంలో ఉల్కా గుప్తా, అదితి భాటియా, ఐశ్వరయ ఓజా కీలక పాత్రలు పోషించారు.
విపుల్ అమృత్‌లాల్ షా కథ అందించిన ఈ చిత్రానికి మన్నన్ షా మ్యూజిక్ అందించారు. ఎడిటర్‌గా సంజయ్ శర్మ, అభిజిత్ చౌదరీ సినిమాటోగ్రఫి, సౌండ్ డిజైనర్‌గా మానస్ చౌదరీ, ప్రొడక్షన్ డిజైనర్‌గా జుహీ తల్మాకీ వ్యవహరించారు. ఫిబ్రవరి 27వ తేదీన రిలీజ్ అయ్యే ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ ఇటీవల రిలీజై సంచలనం, వివాదాలకు కేంద్ర బిందువుగా మారింది. అయితే ఈ సినిమాపై కేరళ ప్రభుత్వం సీరియస్‌గా ఉండటమే కాకుండా నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందన వ్యక్త మవుతున్నది. అయితే ఈ సినిమా ట్రైలర్‌లో అత్యంత వివాదాస్పదంగా మారిన అంశాలు ఏమిటి? కేరళ ప్రభుత్వం ఎందుకు సీరియస్ అవుతున్నారనే వివరాల్లోకి వెళితే..

ది కేరళ స్టోరీ సినిమా ట్రైలర్ విషయానికి వస్తే.. హిందూ అమ్మాయిలను పక్కాగా ప్లాన్ చేసి ముస్లిం మతంలోకి చేర్చడమనేది ముఖ్యమైన పాయింట్‌గా కనిపించింది. ప్రేమ పేరుతో హిందూ అమ్మాయిలకు ఎవర వేసి వారిని వివాహం చేసుకొన్న తర్వాత బలవంతంగా ముస్లిం మతాచారాలను అనుసరించేందుకు వారిపై శారీరక దాడులు జరపడం లాంటి సన్నివేశాలు గుండెను పిండేసేలా ఉన్నాయి. పెళ్లికి ముందు నాస్తికుడిని, తనకు మతపరమైన ఉద్దేశాలు లేవని చెప్పి.. పెళ్లి తర్వాత ఓ అమ్మాయిని ముస్లిం యువకుడు శారీరకంగా హింసించడం.. ఆమె చేత గొడ్డు మాంసం బలవంతంగా తినిపించడం.. తినకపోతే నలుగురు కలిసి ఆమె నోట్లో బలవంతంగా కుక్కడం లాంటి సన్నివేశాలు భావోద్వేగాలను రెచ్చగొట్టేలా ఉన్నాయి. దాంతో ఈ సినిమా ట్రైలర్ అందర్నీ ఆకర్షించడమే కాకుండా పలు రకాల అభిప్రాయాలు సోషల్ మీడియాలో వ్యక్తమవుతున్నాయి.
అయితే ఈ సినిమా కథపై కేరళ ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. తాజాగా కేరళ ముఖ్యమంత్రి పినరయి ఘాటుగా స్పందించారు. కేరళలో మత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా ది కేరళ స్టోరీని రూపొందించారు. కేరళలో సెక్యులర్ ట్రెడిషన్‌ను అవమాన పరిచే విధంగా చిత్రీకరించారు. ఈ సినిమా మొదటి పార్ట్‌లో కూడా అవాస్తవాలు జొప్పించారు. మతపరమైన ప్రయోజనాలు ఈ సినిమా వెనుక ఉన్నాయి. కేరళలోని మత సహనాన్ని, సోదరభావాన్ని చూసి జీర్ణించుకోలేకని కొందరు ఇలాంటి కథలతో రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు అని అన్నారు.
అసత్య ప్రచారాలు చేయడమే సంఘ్ పరివార్ లక్ష్యంగా కనిపిస్తున్నది. పరస్పర అవగాహనతో కేరళ ప్రజలు జీవిస్తున్నారు. ఈ ప్రాంతంలో ఎలాంటి మత ఘర్షణలు కూడా లేవు. అలాంటి నేలపై విద్వేషాలు రెచ్చగొట్టాలనే ప్రయత్నం చేస్తున్నారు. శాంతి, మత సామరస్యానికి భంగం కలిగించేలా చేస్తున్నారు. అవాస్తవ కథనాలతో రెండు వర్గాలను విడదీసే కుట్ర జరుగుతున్నది. ఇలాంటి చర్యలను ప్రభుత్వం సహించబోదు అని ఆయన అన్నారు అనే విషయంపై సోషల్ మీడియాలో భారీగా చర్చ జరుగుతున్నది.


Click it and Unblock the Notifications











