‘ఆ డైరెక్టర్ సినిమాలు డిజాస్టర్లు.. అందుకే మైండ్ దొబ్బింది’
బాలీవుడ్‌లో ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ సన్‌షైన్ పిక్చర్స్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత విపుల్ అమృత్‌లాల్ షా నిర్మించిన చిత్రం ది కేరళ స్టోరి 2 గోస్ బియాండ్. ఈ సినిమాకు కామఖ్య నారాయణ్ సింగ్ దర్వకత్వం వహించారు. ఈ సినిమాకు ఆషిన్ ఏ షా, రవిచంద్ నల్లప్ప సహ నిర్మాతలుగా వ్యవహరించారు. వాస్తవ సంఘటనల ఆధారంగా అత్యంత వివాదాస్పద చిత్రంగా తెరకెక్కిన ఈ చిత్రంలో ఉల్కా గుప్తా, అదితి భాటియా, ఐశ్వరయ ఓజా కీలక పాత్రలు పోషించారు.
విపుల్ అమృత్‌లాల్ షా కథ అందించిన ఈ చిత్రానికి మన్నన్ షా మ్యూజిక్ అందించారు. ఎడిటర్‌గా సంజయ్ శర్మ, అభిజిత్ చౌదరీ సినిమాటోగ్రఫి, సౌండ్ డిజైనర్‌గా మానస్ చౌదరీ, ప్రొడక్షన్ డిజైనర్‌గా జుహీ తల్మాకీ వ్యవహరించారు. ఫిబ్రవరి 27వ తేదీన రిలీజ్ అయ్యే ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ ఇటీవల రిలీజై సంచలనం, వివాదాలకు కేంద్ర బిందువుగా మారింది. ఈ క్రమంలో బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్ చేసిన కామెంట్స్‌ను ది కేరళ స్టోరీ 2 డైరెక్టర్ కామాఖ్య నారాయణ్ సింగ్ ఖండించారు. అనురాగ్ చేసిన కామెంట్స్ ఏమిటి? కామాఖ్య సింగ్ ఇచ్చిన రియాక్షన్ ఏమిటనే వివరాల్లోకి వెళితే..

ఇటీవల కేరళలో జరిగిన ఫిలింఫేర్ అవార్డుల కార్యక్రమంలో పాల్గొన్న దర్శకుడు, నటుడు అనురాగ్ కశ్యప్ మీడియాతో మాట్లాడుతూ.. ది కేరళ స్టోరీ సినిమా బుల్ షిట్. మత విద్వేషాలను రెచ్చగొట్టే ప్రాపగండా సినిమా. ప్రజలను మతం పేరిట విడదీసే ప్రయత్నం చేస్తున్నారు. నాకు బీఫ్ (గొడ్డు మాసం)తో పరోటా తినడం అంటే ఇష్టం. బీఫ్ తినడం వల్ల నష్టమేమీ లేదు అంటూ కామెంట్ చేశాడు. వాళ్లు ప్రజలకు కనీసం కిచిడీ కూడా తినిపించలేరు. కానీ సినిమాలో బీఫ్ తినిపిస్తున్నారు. నిర్మాత విపుల్ షా డబ్బు కోసం ఎంతకైనా దిగజారుతాడు, ఎవరి కాళ్లైనా నాకుతాడు అని అన్నారు. ఆయన మాటలు సోషల్ మీడియాలో వైరల్ కావడమే కాకుండా ఆ కంటెంట్‌పై మిక్స్‌డ్ రియాక్షన్స్ వచ్చాయి. అనురాగ్ కామెంట్స్‌పై ది కేరళ స్టోరీ 2 డైరెక్టర్ కామాఖ్య నారాయణ్ సింగ్ ఘాటుగా స్పందించారు.
ది కేరళ స్టోరీ 2 మూవీ గురించి అనురాగ్ కశ్యప్ చెప్పిన మాటలను ఎవరూ సీరియస్‌గా తీసుకోవద్దు. ఆయనను ఆడియెన్స్ పట్టించుకోవడం ఎన్నడో మానేశారు. చాలా ఏళ్లుగా ఆయన తీసిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్లుగా మారాయి. దాంతో ఓ రకమైన మానసిక రుగ్మతకు లోనయ్యారేమో. అందుకే వాస్తవాలను, సత్యాలను గ్రహించడం లేదు. హిందూ అమ్మాయిలు, మన సోదరీమణులను బలవంతంగా మత మార్పిడి చేయిస్తూ గొడ్డు మాంసం తినిపిస్తున్నారు. ఆయనకు ఈ విషయాలు కనిపించడం లేదు. వాటిని పట్టించుకోవడం లేదు అని దర్శకుడు కామఖ్య నారాయణ్ సింగ్ ఘాటుగా బదులిచ్చారు.
దేశంలో జరుగుతున్న ఇలాంటి విషయాలు సమస్యగా కనిపించడం లేదు. ఆయనకు బ్రహ్మణుల నుంచి గానీ, నెట్‌ఫ్లిక్స్ నుంచి, ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి సమస్యలు ఉన్నాయి. మా సినిమాలోని ప్రతి సన్నివేశాలకు సంబంధించిన వాటికి సాక్ష్యాలు ఉన్నాయి. వాటిపై మేము విస్త్రృత పరిశోధన చేశాం. కావాలంటే ఆయన ఇంటికి ఆ మెటీరియల్ పంపుతాం. ఆయన ఇంటికి చాలా మంది చెప్పులు పంపిస్తారు. కానీ మేము అలాంటివి పంపించకుండా మా పరిశోధన మెటీరియల్ కావాలంటే పంపించడానికి రెడీగా ఉన్నాం అని కామాఖ్య నారాయణ్ సింగ్ పేర్కొన్నారు.


Click it and Unblock the Notifications











