32000 హిందూ అమ్మాయిలు అలా దారుణంగా.. దేశంలో అలాంటి కుట్ర! (The Kerala Story 2)
బాలీవుడ్‌లో ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ సన్‌షైన్ పిక్చర్స్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత విపుల్ అమృత్‌లాల్ షా నిర్మించిన చిత్రం ది కేరళ స్టోరి 2 గోస్ బియాండ్. ఈ సినిమాకు కామఖ్య నారాయణ్ సింగ్ దర్వకత్వం వహించారు. ఈ సినిమాకు ఆషిన్ ఏ షా, రవిచంద్ నల్లప్ప సహ నిర్మాతలుగా వ్యవహరించారు. వాస్తవ సంఘటనల ఆధారంగా అత్యంత వివాదాస్పద చిత్రంగా తెరకెక్కిన ఈ చిత్రంలో ఉల్కా గుప్తా, అదితి భాటియా, ఐశ్వరయ ఓజా కీలక పాత్రలు పోషించారు.
విపుల్ అమృత్‌లాల్ షా కథ అందించిన ఈ చిత్రానికి మన్నన్ షా మ్యూజిక్ అందించారు. ఎడిటర్‌గా సంజయ్ శర్మ, అభిజిత్ చౌదరీ సినిమాటోగ్రఫి, సౌండ్ డిజైనర్‌గా మానస్ చౌదరీ, ప్రొడక్షన్ డిజైనర్‌గా జుహీ తల్మాకీ వ్యవహరించారు. ఫిబ్రవరి 27వ తేదీన రిలీజ్ అయ్యే ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ ఇటీవల రిలీజై సంచలనం, వివాదాలకు కేంద్ర బిందువుగా మారింది. అయితే ఈ సినిమాపై కేరళ ప్రభుత్వం సీరియస్‌గా ఉండటమే కాకుండా నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందన వ్యక్త మవుతున్నది. ఈ నేపథ్యంలో ఈ సినిమాపై పెరుగుతున్న వివాదంపై జాతీయ వార్తా సంస్థ ఏఎన్ఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో నిర్మాత విపుల్ అమృత్‌లాల్ షా ఏం చెప్పారంటే?

కేరళ సంస్కృతి, సాంప్రదాయాలపై మాకు వ్యతిరేకత లేదు. కేరళను భగవంతుడి ప్రసాదంగా భావిస్తాం. అలాంటి రాష్ట్రంలో ఉన్న మత మార్పిడి భూతాన్ని తరిమికొట్టాలన్నదే మా ప్రయత్నం. ది కేరళ స్టోరి సినిమాను కొందరు విమర్శించి దుష్ప్రచారం చేశారు. 32000 మంది అమ్మాయిలను లవ్ జిహద్ పేరుతో మత మార్పిడి చేశారనేది అవాస్తవమని వాదించారు. మేము చెప్పిన విషయాలన్నీ వాస్తవాలే అని రుజువలతో సహా యూట్యూబ్‌లో ఓ వీడియో తీసి పెట్టాం. ఇప్పటికీ కూడా అది అందుబాటులో ఉంది అని నిర్మాత విపుల్ అమృత్‌లాల్ షా అన్నారు.
అమ్మాయిల మత మార్పిడి గురించి మేము పేర్లతో సహా గణాంకాలను వెల్లడించాం. ప్రభుత్వం వద్ద మా లెక్కలంటే ఎక్కువగా సమాచారం ఉండి ఉంటుంది. మా సినిమా రిలీజ్ తర్వాత కూడా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. కఠినమైన చట్టాలను అమలు చేయలేకపోవడం శోచనీయం. ప్రస్తుతం ది కేరళ స్టోరీ 2 సినిమాలో దేశంలో భారీ ఎత్తున్న జరుగుతున్న మత మార్పిడి, ఆ కుట్రను వివరంగా చెప్పబోతున్నాం. ది కేరళ స్టోరీ 1 కథ నేపథ్యంగా, ఆధారంగానే ది కేరళ స్టోరీ 2 కథ ఉంటుంది అని ఆయన అన్నారు.
ది కేరళ స్టోరీ 2 సినిమా రిలీజ్‌కు మాకు ఎలాంటి ఇబ్బందులు లేవు. మేము వాస్తవం చెప్పాలని మాత్రమే ప్రయత్నం చేస్తున్నాం. అలాగని మీరు అభద్రతాభావంతో ఉన్నట్టు కాదు. మేము వాస్తవాలు చెబితే దానిని డేంజర్‌గా ఫీలైతే అది ప్రతికూలంగా మారే ప్రమాదం ఉంది అని నిర్మాత విపుల్ షా అన్నారు. ఈ సినిమాపై వస్తున్న విమర్శలు, ట్రోలింగ్, వ్యతిరేకత గురించి ఆయన స్పందిస్తూ మీడియాకు తన అభిప్రాయాలను వెల్లడించారు.
ఇదిలా ఉండగా, ది కేరళ స్టోరి 2 సినిమా ట్రైలర్ రిలీజ్ తర్వాత కేరళలో తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఎలాంటి మత ఘర్షణలు, విద్వేషాలే లేకుండా దేవుడు ప్రసాదించిన రాష్ట్రంలో మత సామరస్యం కొనసాగుతున్నది. అలాంటి రాష్ట్రంలో ఇలాంటి సినిమాల ద్వారా విద్వేషాలు రగిలించడానికి కుట్రలు జరుగుతున్నాయి అని ఖండిస్తున్నారు. ఇటీవల ముఖ్యమంత్రి పినరయి కూడా ఘాటుగా స్పందించారు. ఈ సినిమాపై వాదోపవాదాలు భారీగా కొనసాగుతున్నాయి. ఈ సినిమా ఫిబ్రవరి 27వ తేదీన ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతున్నది.


Click it and Unblock the Notifications











