'భారత్' 10 కోట్ల సెట్ నాశనం.. సల్మాన్ తెలుగు ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్!
కండల వీరుడు సల్మాన్ ఖాన్ నటిస్తున్న తాజా చిత్రం భారత్. సుల్తాన్, టైగర్ జిందా హై తర్వాత వీరిద్దరి కాంబోలో వస్తున్న హ్యాట్రిక్ మూవీ ఇది. భారత్ పై మంచి అంచనాలు నెలకొని ఉన్నాయి. ఇటీవల్ రిపబ్లిక్ డే సందర్భంగా విడుదలైన టీజర్ తో సినిమాపై మరింతగా అంచనాలు పెరిగాయి. ఒడే తో మై ఫాదర్ అనే కొరియన్ చిత్రానికి ఇది రీమేక్. మరోసారి కత్రినా కైఫ్ ఈ చిత్రంలో సల్మాన్ తో జోడి కట్టింది. రంజాన్ సందర్భంగా విడుదల కానున్న ఈ చిత్రం గురించి ఆసక్తికర వార్తలు వస్తున్నాయి.

ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్
సల్మాన్ ఖాన్ కు దేశవ్యాప్తంగా క్రేజ్ ఉంది. అన్ని భాషల్లో సల్మాన్ ఖాన్ ని అభిమానించే వాళ్ళు ఉన్నారు. కానీ సల్మాన్ ఖాన్ చిత్రాలు పెద్దగా ఇతర భాషల్లోకి డబ్ కాలేదు. ఇది ఒకరకంగా ఇతర భాషల్లో ఉన్న సల్మాన్ ఖాన్ అభిమానులకు నిరాశ కలిగించే విషయమే. కానీ సల్మాన్ ఖాన్ భారత్ చిత్రం విషయంలో తెలుగు, తమిళ, మలయాళీ ఫ్యాన్స్ ని నిరాశపరచడం లేదు. అన్ని భాషల్లో భారత్ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. ఇప్పటికే డబ్బింగ్ కార్యక్రమాలు ప్రారంభమైనట్లు తెలుస్తోంది.

5 గెటప్పుల్లో
సల్మాన్ ఖాన్ ఈ చిత్రంలో 18 ఏళ్ల యువకుడి నుంచి 60 ఏళ్ల వృద్దుడిగా అతడి పాత్ర 5 గెటప్పుల్లో ఉండనున్నట్లు తెలుస్తోంది. అలీ జాఫర్ ఈ చిత్రాన్ని పీరియాడిక్ డ్రామాగా తెరకెక్కిస్తున్నాడు. ఇక భారత్ చిత్ర షూటింగ్ కూడా చివరి దశకు చేరుకున్నట్లు తెలుస్తోంది. కేవలం 6 రోజుల షూటింగ్ మాత్రమే మిగిలి ఉందట. షూటింగ్ ముగియగానే పోస్ట్ ప్రొడక్షన్ పనులు ప్రారంభించనున్నారు.

10 కోట్ల సెట్ నాశనం
క్లైమాక్స్ సన్నివేశాల కోసం ఇటీవలే చిత్ర యూనిట్ 10 కోట్ల ఖర్చుతో భారీ సెట్ నిర్మించినట్లు తెలుస్తోంది. కానీ క్లైమాక్స్ సన్నివేశాల చిత్రీకరణలోభాగంగా సెట్ మొత్తం కూల్చి వేయనున్నట్లు తెలుస్తోంది. అంటే 10 కోట్ల ఖర్చుతో సెట్ నిర్మించి కొద్దీ రోజులు కూడా ఉంచకుండా కూల్చేయనున్నారు. క్లైమాక్స్ లో వచ్చే యాక్షన్ సన్నివేశాల్లో భాగంగా ఇలా జరుగుతుందట.

కీలక పాత్రల్లో
ఈ చిత్రంలో సునీల్ గోవర్, టబు, దిశా పటాని కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇటీవలే సల్మాన్ ఖాన్, దిశా పటాని, కత్రినా కైఫ్ పై దర్శకుడు అద్భుతమైన వెడ్డింగ్ సాంగ్ చిత్రీకరించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం దర్శకుడు తెలుగు, తమిళ, మలయాళీ భాషల్లో భారత్ చిత్రానికి డబ్బింగ్ ఆర్టిస్టులని ఎంపిక చేసుకుంటున్నారు. త్వరలో భారత్ చిత్రానికి సంబంధించిన మరిన్ని విశేషాలు తెలియనున్నాయి.


Click it and Unblock the Notifications











