టాలీవుడ్‌కు ఊర్వశి రౌతెలా సెగలు ... బన్నీ, డార్లింగ్ అంటూ వయ్యారాలు
బాలీవుడ్ ను తన అందాలతో ఓ ఊపు ఊపేస్తున్న ఆందాల ఊర్వశీ రౌతెలా, ఇప్పుడు టాలీవుడ్ లోనూ కాస్తంత సెగలు పుట్టించేందుకు సిద్ధమవుతోంది. సంపత్ నంది సినిమా కోసం దిగివచ్చిన ఈ అందాల తార, బ్లాక్ రోజ్ అనే ద్విభాషా చిత్రంలో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇక ఇలా వచ్చిందో లేదో అప్పుడే అమ్మడు తెలుగువారిని బుట్టలో వేసుకునేందుకు స్కెచ్ వేసేస్తోంది.
మోహన్ భరద్వాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న థ్రిల్లర్ మూవీ బ్లాక్ రోజ్ గురించి మాట్లాడుతూ వయ్యారాలు పోతున్న ఊర్వశి, తెలుగు లోగిలి తన సొంతిల్లు అన్నట్లే ఉందని సంబరపడిపోతోంది. ఇక్కడే మరిన్ని సినిమాలు చేయాలని సరదా పడుతున్న ఈ సుందరాంగి మనసులోని ముచ్చటను కూడా బయటపెట్టేసింది.

విషయం ఏమిటంటే, ఊర్వశీ పాపకు అల్లు అర్జున్, ప్రభాస్ లతో కలసి స్క్రీన్ షేర్ చేసుకోవాలని ఉందట. మరి అమ్మడు ఎలాగూ ఇక్కడే ఉండాలని కలలు కంటోంది కాబట్టి, మన రైటర్లు ఆ దిశగా చకచకా కథలు చెక్కేస్తారేమో చూడాలి. ఎలాగూ సంపత్ నంది ఊర్వశిని దృష్టిలో పెట్టుకునే బ్లాక్ రోజ్ కథ రాసుకున్నాడట. మణిశర్మ ఈ సినిమాకు స్వరాలు సమకూర్చనుండగా, సౌందర రాజన్ సినిమాటోగ్రఫీ బాధ్యతలు స్వీకరించారు. మరి తెలుగునాట ఊర్వశి ప్రయాణం ఎలా సాగుతుందో చూడాలి.


Click it and Unblock the Notifications











