Don't Miss!
- Sports ముక్కలవుతున్న ముంబై.. హార్దిక్‌ను విమర్శిస్తూ నబీ పోస్ట్
- News జగన్ పై దాడి ఘటనలో మరో టర్నింగ్ ! వడ్డెర సంఘాల ఎంట్రీ..
- Lifestyle ఎండాకాలంలో ఈ ఫుడ్స్‌కు దూరంగా ఉండాలి.. లేదంటే డీహైడ్రేషన్ తప్పదు..
- Technology ధర రూ.1799 కే, Youtube ,UPI ఫీచర్లతో Itel కొత్త ఫీచర్ ఫోన్! సేల్ వివరాలు
- Automobiles ఈవీ ఓనర్లకు Google Maps గుడ్ న్యూస్.. ఇకపై మీకు ఈ టెన్షన్ ఉండదు.!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
మరీ ఇంత ఘాటుగానా? వైరల్ అవుతున్న హీరో హీరోయిన్ శృంగార సీన్లు
సినిమా స్క్రిప్టు డిమాండ్ చేస్తే ఎలాంటి బోల్డ్ సీన్లు అయినా చేయడానికి సిద్దంగా ఉండే హీరోయిన్ రాధిక ఆప్టే. ఇప్పటికే పలు సందర్భాల్లో వివాదాస్పద చిత్రాలు, సీన్లతో ఆమె వార్తల్లోకి ఎక్కారు. తనపై ఎవరైనా విమర్శలు చేస్తే తగిన సమాధానంతో తిప్పి కొట్టడం ఆమె స్టైల్.
'నేను ప్రపంచ సినిమాలు చూస్తూ పెరిగాను. వరల్డ్ వైడ్ చాలా దేశాలు తిరిగాను. ఎన్నో సంస్కృతులు చూశాను. మనం ఒక కళను ఎంచుకున్నపుడు అందులో చాలా రకాల ప్రయోగాలు చేయాల్సి ఉంటుంది. అందులో న్యూడిటీ కూడా ఒకటి. ఇండియాతో పాటు విదేశాల్లో నేను కళాకారులు నగ్నంగా ప్రదర్శన ఇవ్వడం చూశాను' అని రాధిక ఆప్టే గతంలో ఓ ఇంటర్వ్యూలో తెలిపారు.
నా బాడీని చూపించడానికి నేను ఏ మాత్రం సిగ్గుగా ఫీలవ్వను
నా బాడీని చూపించడానికి నేను ఏ మాత్రం సిగ్గుగా ఫీలవ్వను. ఒక నటిగా ఒక కథలోని భావాలను పలికించడానికి నా శరీరాన్ని ఒక ‘టూల్' ఉపయోగిస్తాను. సన్నివేశం అవసరాన్ని బట్టి నగ్నంగా నటించడంలో ఎలాంటి తప్పు లేదని నేను భావిస్తాను అని రాధిక ఆప్టే తెలిపారు.
ఘాటైన శృంగార సీన్లు
రాధిక ఆప్టే, దేవ్ పటేల్‌తో కలిసి నటించిన చితం ‘ది వెడ్డింగ్ గెస్ట్'. ఇదో బ్రిటిష్-అమెరికన్ మూవీ. ఇందులో ఇద్దరి మధ్య ఘాటైన శృంగార సన్నివేశాలు చిత్రీకరించారు. ఈ చిత్రం ఆల్రెడీ అమెరికాలో విడుదలైంది. అయితే ఇద్దరి మధ్య చిత్రీకరించిన సీన్లు సోషల్ ఇపుడు మీడియాలో వైరల్ అయ్యాయి.
ఆన్ లైన్ ద్వారా ఇండియాలో
‘ది వెడ్డింగ్ గెస్ట్' సినిమాను త్వరలో ఆన్ లైన్ ద్వారా ఇండియాలో అందుబాటులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. మూవీపై ఇక్కడ అంచనాలు పెంచడంలో భాగంగానే ఇద్దరిపై చిత్రీకరించిన శృంగార సీన్లు సోషల్ మీడియాలో విడుదల చేసినట్లు తెలుస్తోంది.
ది వెడ్డింగ్ గెస్ట్
‘ది వెడ్డింగ్ గెస్ట్' చిత్రానికి చిత్రానికి మైఖేల్ వింటెర్బాటర్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని 2018లోనే టోరంటో ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రదర్శించగా మంచి స్పందన వచ్చింది. మార్చిలోనే ఈ మూవీ అమెరికాతో విడుదలైనప్పటికీ ఈ సీన్లు ఇపుడు ఇంటర్నెట్లో వైరల్ అయ్యాయి.