మగవాళ్లను అనరు.. ఆడవాళ్లు కలిసి చేస్తేనే అంటారు.. ప్రియాంక చోప్రాకు షాకిచ్చిన మహిళ
Recommended Video
బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా.. ఈ పేరు ఎవరికీ పరిచయం చేయనవసరం లేదు. అంతలా ఆమె భారతీయులపై ప్రభావం చూపించింది. ఎన్నో భాషల్లో సినిమాలు చేసి ఇండియాలోనే టాప్ హీరోయిన్‌గా పేరు సంపాదించుకుంది. ఇదే క్రమంలో హాలీవుడ్‌లోకీ అడుగు పెట్టింది. అక్కడ కొన్ని సినిమాలతో పాటు వెబ్ సిరీస్‌లలో నటించి మెప్పించింది. అదే సమయంలో అక్కడ నిక్ జోనస్ అనే ఓ సింగర్ నచ్చడంతో అతడితో డేటింగ్ చేసేసింది. ఆ తర్వాత అతడినే పెళ్లి చేసుకుంది. ఇక్కడ షూటింగ్ లేని సమయంలో ఇప్పుడు భర్తతో పాటు అమెరికాలో ఉంటోంది.

హాలీవుడ్ కల్చర్
హాలీవుడ్‌లోకి అడుగు పెట్టిన తర్వాత ప్రియాంక ప్రవర్తనలో భారీ మార్పులు చోటు చేసుకున్నాయి. ఆమె అక్కడి కల్చర్‌కు బాగా అలవాటు పడిపోయింది. ఇక పెళ్లి తర్వాత ఇది మరింత ఎక్కువైంది. ఇక, కొద్దిరోజుల క్రితం ఆమె పుట్టినరోజు సందర్భంగా భర్త, మరికొందరితో కలిసి సిగరెట్ కాలుస్తోంది. దీనికి సంబంధించిన ఫొటోను ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. దీంతో నెటిజన్స్ తెగ ట్రోల్ చేశారు. గతంలో దీపావళి సందర్భంగా ఆమె చేసిన ఒక వీడియోను గుర్తు చేస్తూ ఆమెపై విమర్శల వర్షం కురిపించారు. నీతులు చెప్పడం వరకే.. చేయడం మాత్రం ఉండదు అంటూ కామెంట్ చేశారు.
హీరోలనైతే అనరు
లాస్‌ఏంజెల్స్‌లో తాజాగా బ్యూటీకాన్ అనే ఓ ప్రోగ్రామ్ జరిగింది. ఆ కార్యక్రమానికి ప్రియాంక చోప్రా గెస్ట్‌గా వచ్చింది. ఈ కార్యక్రమంలో ఆమె ప్రసంగించింది. ‘చాలా మంది మీరు మరో నటితో కలిసి పని చేస్తున్నారు కదా.. మీ ఇద్దరి మధ్య కోఆర్డినేషన్ ఉంటుందా అని అడుగుతున్నారు. అదే ప్రశ్నను ఇద్దరు హీరోలు కలిసి చేస్తే మాత్రం అడగరు. ఎందుకిలా చేస్తారో అర్థం కాదు. అంటే వీళ్ల దృష్టిలో ఆడవాళ్లు చులకనా..? దీనిపై మహిళలు ఏకం కావాలి' అంటూ చెప్పుకొచ్చింది.

మేము సగం మంది ఉన్నాము
అంతేకాదు, స్త్రీలు చేసే పనుల వల్ల పురుషులు సమాజంలో ఉన్నత స్థితిలో ఉంటున్నారని చెప్పింది. అలాగే, ‘మహిళలు ఒకరినొకరు సహకరించుకోవడం వల్ల మనలో సోదరిభావం పెరుగుతుంది. ప్రపంచ జనాభాలో 50 శాతం మంది ఉన్నందు వల్ల ప్రతి రంగంలో మహిళల ప్రాతినిధ్యం దక్కాలి. ఇది జరగాలంటే మహిళలే తొటి వారికి అధికారాన్ని దక్కేలా చేయాలి' అని ప్రియాంక చెప్పుకొచ్చింది.

షాకిచ్చిన మహిళ
ప్రియాంక ప్రసంగిస్తుండగా, ప్రేక్షకుల్లోని ఓ మహిళ నిల్చుని ‘బాలాకోట్‌పై జరిగిన దాడికి నువ్వు మద్దతుగా నిలిచావు. పాకిస్థాన్‌పై అణు యుద్దాన్ని ప్రోత్సహించావు. నువ్వు ఒక కపట వ్యక్తివి' అంటూ గట్టిగా అరించింది. దీనికి కారణం గతంలో జమ్ము కశ్మీర్ పుల్వామాలో మిలిటెంట్ దాడి తర్వాత భారత వైమానిక దళం పాకిస్తాన్ బాలాకోట్ ప్రాంతంలో దాడులు చేసింది. దీనికి మద్దతుగా ప్రియాంక ట్వీట్ చేసింది. దీన్ని గుర్తు చేస్తూనే సదరు మహిళ గొడవ చేసింది.


Click it and Unblock the Notifications











