‘సినిమా ఆడినా, ఆడక పోయినా... అభిమానులతో బంధం అలాగే ఉంటుంది’
బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ సినిమా రంగంలోకి అడుగు పెట్టి 30 ఏళ్ల పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... తాను తెరపై ఏం చేసినా అభిమానుల అభిరుచికి తగిన విధంగానే చేస్తాను, వారిని సంతృప్తి పరచడమే తనకు ముఖ్యమన్నారు.
"అభిమానులు, స్టార్స్ మధ్య ఒక బంధం ఉంటుంది. మైనే ప్యార్ కియా నుండి ఈ రోజు వరకు నాకు వారితో నిజంగా ఒక ప్రత్యేకమైన అనుబంధం ఉంది. నా సినిమాలు బాగా ఆడినా, ఆడక పోయినా వారితో నా బంధం ఎప్పుడూ అలాగే ఉంటుంది' అని సల్మాన్ ఖాన్ చెప్పుకొచ్చారు.
ఈ రోజు నేను ఈ స్థాయిలో ఉన్నానంటే కారణం అభిమానులు. వారి ఆదరణ వల్లే నేను ఇవన్నీ సాధించగలిగాను. అందుకే తాను ప్రతి క్షణం వారిని సంతోష పెట్టడానికే ప్రయత్నం చేస్తుంటాను అని భాయిజాన్ స్పష్టం చేశారు.

"నేను ఈ పరిశ్రమలో పనిచేయడం మొదలు పెట్టి 30 సంవత్సరాలు పూర్తయింది. అంతకుముందు వారు నన్ను సల్లు, సల్లే, సల్మాన్, బంటాయ్ లాంటి పేర్లతో పిలిచారు. ఇప్పుడు భాయ్ లేదా భాయిజాన్ అని పిలుస్తున్నారు. దీన్ని సాధించడానికి చాలా సమయం పట్టింది. ఈ ఎదుగుదల నిజంగా నాకు ఎంతో సంతోషాన్ని ఇచ్చింది. అభిమానులు నన్ను ట్రీట్ చేసే విధానంపై సంతృప్తిగా ఉన్నాను." అని ముంబైలో జరిగిన ఐపా ప్రెస్ కాన్ఫరెన్సులో సల్మాన్ ఖాన్ చెప్పుకొచ్చారు.
సల్మాన్ నటిస్తున్న సినిమాల విషయానికొస్తే... ప్రస్తుతం ఆయన ప్రభుదేవా దర్శకత్వంలో 'దబాంగ్ 3' సినిమా చేస్తున్నారు. దీంతో పాటు సాజిద్ నాడియాతో కలిసి 'కిక్ 2' అనే చిత్రం చేస్తున్నారు. కమర్షియల్ ఎంటర్టెనర్‌గా వీటిని రూపొందిస్తున్నారు.


Click it and Unblock the Notifications











