twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘డియర్ కామ్రేడ్’ బాలీవుడ్ రీమేక్ లేనట్లేనా?

    |

    విజయ్ దేవరకొండ హీరోగా భరత్ కమ్మ దర్శకత్వంలో తెరకెక్కిన 'డియర్ కామ్రేడ్' చిత్రాన్ని ప్రముఖ బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ కరణ్ జోహార్ రిలీజ్ ముందే స్పెషల్ షో చూడటం, దాన్ని హిందీలో రీమేక్ చేయాలని డిసైడ్ అవ్వడం తెలిసిందే. ఆయన ఈ చిత్రానికి సంబంధించిన రైట్స్ రూ. 6 కోట్లకు దక్కించుకున్నారు అనే ప్రచారం కూడా జరిగింది.

    'డియర్ కామ్రేడ్' మూవీ తెలుగుతో పాటు సౌతిండియాలోని అన్ని భాషల్లో జులై 26న విడుదలైంది. రిలీజ్ ముందు భారీగా హంగామా చేయడం, ప్రమోషన్లు జోరుగా నిర్వహించడంతో సినిమాకు మంచి హైప్ వచ్చింది. ట్రైలర్, పాటలు కూడా సినిమాపై అంచనాలు పెరగడానికి కారణమైంది. అయితే ఈ చిత్రం అందరి అంచనాలను తలక్రిందులు చేస్తూ బాక్సాఫీస్ వద్ద యావరేజ్ టాక్ తెచ్చుకుంది. హీరోతో పాటు దర్శక నిర్మాతలు సినిమా ప్రమోషన్ కూడా ఆపేయడంతో ప్లాప్ లిస్టులో చేరిపోయింది.

    There will be no Dear Comrade Movie Bollywood remake

    రిలీజ్ తర్వాత సౌతిండియా బాక్సాఫీస్ వద్ద ఫలితాలు విశ్లేషించిన కరణ్ జోహార్... హిందీలో రీమేక్ చేసే ఆలోచన మార్చుకున్నారట. ఈ సినిమాను హిందీలో రీమేక్ చేస్తే నిర్మాతలతో కలిసి ప్రాఫిట్ షేరింగ్ చేసుకోవాలని గతంలో అనుకున్నారట. అయితే ఈ విషయంలో ఎలాంటి అగ్రిమెంట్ జరుగలేదని, సౌతిండియాలో బోల్తా కొట్టిన ఈ చిత్రాన్ని రీమేక్ చేయడానికి కరణ్ జోహార్ ఆసక్తి చూపడం లేదని తెలుస్తోంది.

    English summary
    Karan Johar was previously thought to remake the Dear Comrade movie in Bollywood. However, Karan Johar reversed his decision after the film failed to do well at the South Indian box office.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X