హీరోతో బ్రేకప్‌పై స్పందించిన క్రేజీ బ్యూటీ.. నా తప్పుకు భాద్యత వహిస్తా.. విడిపోవాలని లేదు!
సినీతారల ప్రేమ వ్యవహారాలు, విడిపోవడం సాధారణంగా వినిపించే వార్తలే. కానీ కొన్ని ప్రేమ జంటలు మాత్రం అభిమానులని విశేషంగా ఆకర్షిస్తుంటాయి. అలాంటి జంటల్లో కత్రినా కైఫ్, రణబీర్ కపూర్ జంట కూడా ఒకటి. ఘాడమైన ప్రేమలో వీరిద్దరూ చాలా కాలం పాటు సహజీవనం చేశారు. రణబీర్ కపూర్ బాలీవుడ్ లో స్టార్ హీరోగా కొనసాగుతున్నాడు. కత్రినా కైఫ్ తన అందంతో, నటనతో అద్భుతమైన అవకాశలు అందుకుంటోంది. కత్రినా కైఫ్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో రణబీర్ కపూర్ తో బ్రేకప్ కావడంపై స్పందించింది.

నా తప్పుంటే భాద్యత వహిస్తా
రణబీర్ కపూర్ తో విడిపోవడం గురించి మాట్లాడుతూ.. ఆ సమయంలో అనేక ఇబ్బందుల నుంచి నేను కోలుకోవాలంటే బ్రేకప్ కావడం తప్పనిసరి. మా ఇద్దరి మధ్య రిలేషన్ బ్రేక్ కావడానికి నా తప్పు ఏదైనా ఉంటె అందుకు భాద్యత వహిస్తా అని కత్రినా కైఫ్ తెలిపింది. కానీ నా తప్పు లేకుంటే మాత్రం జరిగిన వ్యవహారానికి నేను భాద్యురాలిని కాదు. ఆ సమయంలో మా అమ్మ నాకు అండగా నిలిచింది. చాలా మంది అమ్మాయిలు ప్రేమలో సమస్యలు ఎదుర్కొంటున్నారు. నువ్వు ఒంటరి దానివి అయ్యావని అనుకోవద్దు అని ధైర్యం చెప్పిందని కత్రినా వెల్లడించింది.

ఎవరికోసమో నేను మారను
కత్రినా కైఫ్ చెబుతూ.. బ్రేకప్ సమయంలో ప్రశాంతత కోల్పోయా. కానీ ఆ ఇబ్బందులేవీ నాలో మార్పుకు కారణం కాలేదు. విడిపోవడానికి ముందు ఎలా ఉన్నానో తర్వాత కూడా అలాగే ఉన్నా. ఎవరి కోసమో, లేక పరిస్థితుల ప్రభావం వల్లనో నేను మారే వ్యక్తిని కాదని కత్రినా తెలిపింది. నా కంటూ ఓ వ్యక్తిత్వం ఉంది దానిని ఎప్పటికి కోల్పోను అని కత్రినా తెలిపింది.

విడిపోవాలని లేదు
బంధాల విషయంలో నేను చాలా ఎమోషనల్ గా ఉంటా. నేను సెన్సిటివ్ గా ఉండే మనిషిని. విడిపోవాలని నాకు లేదు. ప్రేమించే వారికీ దూరంగా ఉండాలని ఎప్పుడూ అనుకోను. కానీ ఓ మహిళగా నా గుర్తింపుకు భంగం కలిగే పరిస్థితి ఎదురైనప్పుడు మాత్రం ఇలాంటి నిర్ణయాలు తీసుకోక తప్పదు అని కత్రినా తెలిపింది. జీవితంలో ఇంతకన్నా పెద్ద సమస్యలు ఎన్ని ఎదురైనా మన గుర్తింపుని మాత్రం కోల్పోకూడదు అని కత్రినా తెలిపింది.

సింగిల్‌గా ఉంటూ
కత్రినా కైఫ్ బికినీ వేసుకుని రణబీర్ తో రొమాన్స్ చేస్తున్న దృశ్యాలు కూడా అప్పట్లో సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అంత ఘాటుగా వీరిమధ్య ప్రేమాయణం సాగింది. ఆ తర్వాత విభేదాలతో విడిపోయారు. ప్రస్తుతం రణబీర్ కపూర్ అలియా భట్ ప్రేమలో ఉన్నాడు. కత్రినా కైఫ్ మాత్రం సింగిల్ గానే ఉంటూ భారీ చిత్రాల్లో అవకాశాలు దక్కించుకుంటోంది. ప్రస్తుతం కత్రినా కైఫ్ సల్మాన్ ఖాన్ సరసన భారత్ చిత్రంలో నటిస్తోంది.


Click it and Unblock the Notifications











