Kangana Ranaut: కంగనా రనౌత్ చివరి సినిమా ఇదేనా?

ప్రముఖ బాలీవుడ్ నటి కంగనా రనౌత్ సినిమాలను వదిలేయబోతోందా? ఇప్పుడు ఎక్కడ చూసినా ఇదే చర్చ నడుస్తోంది. ఈ వార్తలు గనుక నిజమైతే ఆమె చివరి సినిమా ఇదే కాబోతోంది. మరి ఆ మూవీ ఏంటి అనే విషయంపై ఓ లుక్కేద్దాం పదండి.

కంగనా రనౌత్ 'గ్యాంగ్‌స్టర్'తో తెరంగేట్రం చేసి ఎన్నో సూపర్‌హిట్ చిత్రాలలో నటించింది. 15 ఏళ్ల కెరీర్‌లో కంగనా 40 సినిమాల్లో నటించింది. ఇప్పటి వరకు 4 జాతీయ అవార్డులు అందుకుంది. అయితే ఎంపీ అయిన తర్వాత కూడా కంగనా మరికొందరు తారల మాదిరిగా బాలీవుడ్‌లో యాక్టివ్‌గా ఉంటుందా లేక ఫుల్‌టైమ్ పొలిటీషియన్‌గా మారుతుందా అనే ఆసక్తి అభిమానుల్లో నెలకొంది.

This Might be Kangana Ranaut s Last Movie after winning Mandi Loksabha Elections

అంతకుముందు ఓ ఇంటర్వ్యూలో నటి కంగనా రనౌత్ మాట్లాడుతూ 'నేను ఒక సమయంలో ఒక పని మాత్రమే చేయాలనుకుంటున్నాను' అంటూ ఎన్నికల్లో గెలిచిన తర్వాత సినిమాల నుంచి తప్పుకుంటానని ప్రకటించి షాక్ ఇచ్చింది. అందుకే కంగనా బాలీవుడ్‌ని వీడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అంటున్నారు. నిజంగానే కంగనా రనౌత్ బాలీవుడ్ నుండి తప్పుకోవాలని నిర్ణయించుకుంటే ఇందిరా గాంధీ బయోపిక్ 'ఎమర్జెన్సీ' కంగనాకు చివరి చిత్రం అవుతుంది.

చాలా రోజులుగా ఈ సినిమా విడుదలకు సరైన సమయం దొరకడం లేదు. ఇప్పుడు రాజకీయాల గందరగోళంలో కంగనా సినిమా ఎప్పుడు విడుదలవుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. కంగనా బాలీవుడ్‌ నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకుంటే, అభిమానులు ఆమెను వెండితెరపై మిస్ అవుతారు. కంగనాకు భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. వైవిధ్యమైన పాత్రల్లో నటించే కంగనా సినిమా కోసం ఎదురు చూస్తూ ఉంటారు.

This Might be Kangana Ranaut s Last Movie after winning Mandi Loksabha Elections

కంగనా రనౌత్ ఇప్పుడుప్రముఖ బాలీవుడ్ నటి. కానీ ఆమె పరిశ్రమలో తనకంటూ ఓ స్థానాన్ని క్రియేట్ చేసుకోవడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది. కంగనా రనౌత్ ఎలాంటి గాడ్ ఫాదర్ లేకుండానే చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టింది. అయితే తన కఠోర శ్రమతో హిందీ చిత్ర పరిశ్రమలో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకుంది.

బాలీవుడ్‌లో వివాదం అయినా, దేశ రాజకీయాల్లో వివాదాస్పదమైన అంశమైనా కంగనా తన మనసులోని మాటను కుండబద్ధలు కొట్టినట్టుగా చెబుతుంది. ముంబైలో ఉన్నప్పుడు శివసేనకు వ్యతిరేకంగా కొన్ని ప్రకటనలు చేసి వివాదాల్లో చిక్కుకుంది. 2024 లోక్ సభ ఎన్నికల్లో ఆమె భారతీయ జనతా పార్టీ తరపున మండి నుండి లోక్‌సభ ఎన్నికల్లో గెలిచింది. ఎంపీగా కంగనా కెరీర్ ఇప్పుడు కొత్తగా ప్రారంభం కానుంది. ఎన్నో కష్టనష్టాలను ఎదుర్కొంటూ ఎదిగిన కంగనా.. తన దేశానికి, ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో, కష్టాల్లో ఉన్నవారికి న్యాయం చేయాలనే ఉద్దేశంతో రాజకీయాల్లోకి వచ్చినట్లు తెలుస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X