380 కోట్లు విడాకుల కోసం.. భార్యకు ఇచ్చిన స్టార్ హీరో ఎవరో తెలుసా?

స్టార్ కపుల్ ధనశ్రీ వర్మ - టీమిండియా క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్ విడాకుల నేపథ్యంలో మరోసారి సెలబ్రెటీల విడాకుల అంశం మనదేశంలో చర్చనీయాంశమైంది. అన్నింటికి మించి వీరిద్దరి విడాకుల్లో భరణం అంశం వెలుగులోకి రావడం కూడా ఈ ఆసక్తికి కారణం. సహజంగా సెలబ్రెటీల విడాకుల్లో భరణం వివరాలు బయటికి రావు.. కానీ చాహుల్ - ధనశ్రీల కేసులో ఈ విషయం లెక్కలతో సహా వెలుగులోకి రావడం చర్చనీయాంశమైంది. ఈ క్రమంలోనే ఇండియాలో ఖరీదైన విడాకులకు సంబంధించిన న్యూస్ ఒకటి వైరల్ అవుతోంది. ఈ వివరాల్లోకి వెళితే..

జీవితాంతం కలిసి బతకాలని అనుకున్న ఓ జంట మనస్పర్ధలు, గొడవలు, ఇతర వ్యక్తిగత కారణాలతో విడాకులు తీసుకోవడం ఇటీవలి కాలంలో పెరుగుతోంది. ఇదే సమయంలో భార్య నిత్యావసరాలు, ఆమె పోషణ నిమిత్తం భర్త భరణం కింద కొంత మొత్తాన్ని ఇస్తున్నారు. వారి వారి స్తోమతను బట్టి ఇది ఆధారపడి ఉంటుంది. అయితే సెలబ్రెటీలు, సంపన్నులు పెద్ద మొత్తంలో భరణాన్ని చెల్లించడం హాట్ టాపిక్‌గా మారుతోంది. చాహల్ తన భార్య ధనశ్రీ వర్మకు రూ.4.75 కోట్లను భరణం కింద చెల్లించడానికి అంగీకరించారు. ఈ చెల్లింపు విషయం డీలే కావడంతోనే విడాకులపై తీర్పు ఆలస్యమైందనే వాదనలు ఉన్నాయి.

this star hero reportedly paid around 380 crore as alimony to his ex-wife

అయితే భారతదేశంలో పెద్ద మొత్తంలో భరణం కింద భార్యకు చెల్లించిన వ్యక్తి ఎవరు అంటూ నెటిజన్లు చర్చించుకుంటున్నారు. అదే ఎవరో కాదు బాలీవుడ్ సూపర్‌స్టార్ హృతిక్ రోషన్. ఈయన తన మాజీ భార్య సుసానే ఖాన్‌కు వందల కోట్లను భరణం కింద చెల్లించారు. బాలీవుడ్ దర్శక నిర్మాత రాకేష్ రోషన్ కుమారుడే హృతిక్ రోషన్. చిన్న వయసులోనే బాలనటుడిగా మెప్పించిన ఆయన 2000లో కహోనా ప్యార్ హై సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చారు .

హృతిక్‌లో నటుడే కాదు.. నిర్మాత, దర్శకుడు, గాయకుడు కూడా ఉన్నారు. భారత్‌లో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకునే స్టార్స్‌లో హృతిక్ కూడా ఒకరు. సినిమాలతో పాటు టెలివిజన్‌లోనూ ఆయన సక్సెస్ కొట్టారు. ఇక పలు మ్యూజిక్ ఆల్బమ్స్‌తోనూ హృతిక్ రోషన్ సత్తా చాటుతున్నారు. హృతిక్ రోషన్ వ్యక్తిగత జీవితం విషయానికి వస్తే .. చిన్న వయసులోనే నటి, ఫ్యాషన్ డిజైనర్ సుసానే ఖాన్‌తో ప్రేమలో పడ్డ హృతిక్ రోషన్ ఆమెను పెళ్లాడారు. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు. అయితే కొన్ని వ్యక్తిగత కారణాలతో హృతిక్ - సుసానే ఖాన్‌లు తమ 14 ఏళ్ల వైవాహిక బంధానికి తెరదించుతూ విడాకులు తీసుకున్నారు.

హృతిక్ - సుసానేల విడాకుల వ్యవహారం బాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. కారణం ఆమెకు చెల్లించిన భరణమే. సుసానే ఏకంగా రూ.400 కోట్లు డిమాండ్ చేయగా రూ.380 కోట్లకు డీల్ కుదిరినట్లుగా బీటౌన్ టాక్. భరణంతో పాటు పిల్లలు హ్రేహాన్ రోషన్, హృదాన్ రోషన్‌ల సంరక్షణ బాధ్యతను కూడా హృతిక్ రోషన్ తీసుకున్నారు. తద్వారా బాలీవుడ్‌లో అత్యధిక భరణం చెల్లించిన వ్యక్తిగా హృతిక్ రోషన్ నిలిచారు. ఈ విషయం తెలిసి ఆయన అభిమానులు ముక్కున వేలేసుకుంటున్నారు. ప్రస్తుతం హృతిక్ .. ఎన్టీఆర్‌తో కలిసి వార్-2లో నటిస్తున్నారు. యశ్ రాజ్ ఫిల్మ్స్ నిర్మిస్తోన్న ఈ సినిమాలో కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తుండగా.. ఆగస్ట్ 14న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

More from Filmibeat

Read more about: hrithik roshan sussanne khan
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X