అందమైన జ్ఞాపకం - సల్మాన్ ఖాన్ కు వార్నింగ్ ఇచ్చిన భాగ్యశ్రీ
కొన్ని జ్ఞపకాలు అందంగా ఉంటాయి, మరికొన్ని జీవితాంతం భరించలేని భాధను విడిచిపెడతాయి. అయితే, బాలీవుడ్ అందాల నటి భాగ్యశ్రీ మాత్రం ఆ నాడు తనకు చికాకు తెప్పించన సంఘటనే, నేడు తియ్యటి జ్ఞపకంగా మారిందని గుర్తుచేసింది. ఈ జ్ఞాపకాన్ని మిగిల్చిన బాలీవుడ్ భాయ్ జాన్ సల్మాన్ ఖాన్ కు ధన్యవాదాలు చెప్పింది.
ఇంతకూ ఏమా మెమొరీ అంటారా..! సల్మాన్ ఖాన్ భాగ్యశ్రీ పేరు వినగానే మనకు ఠక్కున గుర్తొచ్చే పేరు మైనే ప్యార్ కియా అన్న సంగతి తెలిసిందే. తెలుగులో ప్రేమ పావురాలుగా అలరించిన ఈ సినిమా, అందరికీ ఆల్ టైమ్ ఫేవరేట్ అనడంలో సందేహమే లేదు. సినిమాలో వీరి కెమిస్ట్రీ ఏ రేంజ్ లో పండింది అంటే, అప్పట్లో ఫ్యాన్స్ వీరిద్దరూ నిజంగానే పెళ్లి చేసుకుంటే బాగున్ను అనేంతగా అలరించారు. జనాల సంగతి పక్కన పెడితే.. భాగ్యశ్రీకి మాత్రం తమిద్దరి మధ్యా ఏదో ఉందన్న మాట కూడా వినిపించడం ఇష్టం లేదట. ఈ నేపథ్యంలో సల్మాన్ ఖాన్ కు అమ్మడు అప్పట్లోనే గట్టి వార్నింగ్ కూడా ఇచ్చిందట.

అప్పటికే భాగ్యశ్రీ, తనకు కాబోయే భర్తతో పీకల్లోతు ప్రేమలో ఉంది. దీంతో, షూటింగ్ సెట్స్ లో అందరితోనూ సరదాగా ఉంటే సల్మాన్ ఖాన్ కు కాస్త దూర దూరంగా మెలగ సాగేదట. తమ ఇద్దరి గురించి రూమర్లు రావడం ఇష్టంలేకనే ఆమె ఆలా చేసేదట. అయితే భాగ్యశ్రీ వ్యవహారం గమనించిన సల్మాన్, ఆమెను మరింతగా ఏడిపించడం మొదలుపెట్టాడట. దీంతో విధిలేక సల్మాన్ భాయ్ కాస్త దూరంగా ఉండమని వార్నింగ్ ఇచ్చిందట భాగ్యశ్రీ. ఇక భాగ్యశ్రీ మరీ ఫీలవుతోందని గమనించిన సల్మాన్ భాయ్, ఆమె ప్రేమ వ్యవహారం తనకు తెలుసునని అందుకే సరదాగా ఆటపట్టిస్తున్నానని వెల్లడించాడట. అలా వారిద్దరి మధ్య జరిగన ఓ సంఘటన ఈరోజు ఓ తీయటి జ్ఞాపకంగా మారింది.


Click it and Unblock the Notifications











