Don't Miss!
- Sports ముంబై ఇండియన్స్‌కు బిగ్ షాక్: ఆ ఇద్దరికీ కోత
- News సాగర్ టెయిల్ పాండ్ నుండి ఏపీ నీటిచౌర్యం; ఎన్నికలవేళ మళ్ళీ కృష్ణా జలవివాదం!!
- Finance Gold Price Today: బంగారం ధర పై పైకే.. ఇక కొనలేమా..!
- Lifestyle లివర్ వ్యాధి లక్షణాలు ఇవే.. వెంటనే అప్రమత్తం కావాలి..
- Automobiles హ్యుందాయ్ ఎక్స్టర్ దిమ్మ తిరిగే మైలేజ్.. ఓనర్ ఫుల్ ఖుష్.. ఫొటోలతో సహా ప్రూఫ్ ఇదిగో.!!
- Travel తెలంగాణ టూరిజం.. హైదరాబాద్ టు షిర్డీ ఫ్లైట్ టూర్ ప్యాకేజీ..
- Technology ధర రూ.10 వేల లోపే, 108MP కెమెరాతో కొత్త ఫోన్! లాంచ్, సేల్ వివరాలు
భార్య ముందే దర్శకుడి చెంప పగలగొట్టింది.. బయటపడ్డ నిజస్వరూపం, వీడియో వైరల్!
హీరోయిన్లని లైంగికంగా వేధిస్తున్న బాలీవుడ్ ప్రముఖుల నిజస్వరూపాలు బయటపడుతున్నాయి. పలువురు నటీమణులు మీటూ ఉద్యమం ద్వారా సంచలన విషయాలు బయటపెడుతున్నారు. ఇప్పటి వరకు బాలీవుడ్లో సెలబ్రిటీలుగా చలామణీ అవుతున్న వారంతా ఈ ఆరోపణలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. లైంగిక వేధింపుల అంశం బాలీవుడ్ లో దుమారం రేపుతోంది. ప్రముఖ నటి గీతికా త్యాగి బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు సుభాష్ కపూర్ చెంప చెళ్లుమనిపించిన ఘటన సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
జాలీ ఎల్ఎల్బి దర్శకుడు
జాలీ ఎల్ఎల్ బి చిత్ర దర్శకుడు సుభాష్ కపూర్ కు బాలీవుడ్ లో మంచి పేరు ఉంది. అద్భుతమైన కథలతో ఆయన చిత్రాలు ఉంటాయని అంతా ప్రశంసిస్తారు. ఈ బాలీవుడ్ సీనియర్ దర్శకుడుపై ప్రముఖ నటి గీతికా త్యాగి సంచలన ఆరోపణలు చేసింది.
బిపాసా బసు చిత్రంలో
బిపాసా బసు ప్రధాన పాత్రలో నటించిన ఆత్మ చిత్రంలో కీలక పాత్రలో గీతికా త్యాగి నటించింది. ఆ తరువాత గీతికా పలు చిత్రాల్లో మెరిసింది. బాలీవుడ్ లో మీటూ ఉద్యమం జోరుగా సాగుతుండడంతో సుభాష్ కపూర్, గీతికా మధ్య గతంలో జరిగిన సంఘటన సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
|
సుభాష్ కపూర్ నిజస్వరూపం
గతంలో గీతికా సోషల్ మీడియా ద్వారా ఓ వీడియోని పోస్ట్ చేసింది. సుభాష్ కపూర్ నిజస్వరూపం ఇదే అంటూ కామెంట్ పెట్టింది. ప్రస్తుతం మీటూ ఉద్యమం జరుగుతుండడంతో ఆ వీడియో చర్చనీయాంశగా మారింది. తనని లైంగికంగా వేధించిన సుభాష్ కపూర్ ని అతడి భార్య ముందే నిలదీస్తున్న ఘటన ఇది. ఈ సంఘటన కొన్నేళ్ల క్రితం జరిగింది.
చెంప చెళ్ళుమనేలా
అతడి భార్య ముందే గీతికా సుభాష్ కపూర్ చెంప పగలగొట్టిన దృశ్యాలు వైరల్ గా మారాయి. ఈ దృశ్యాలు గీతికా పోస్ట్ చేసిన వీడియోలో లేవు. చెంపదెబ్బ కొట్టిన దృశ్యాలు రహస్య కెమెరాలో రికార్డ్ అయ్యాయి. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
జరిగింది ఇదే
రహస్యంగా కలవడానికి సుభాష్ కపూర్ గీతికా త్యాగిని పిలిచాడట. ఆ సందర్భంలో లైంగిక వేధింపులకు పాల్పడ్డట్లు తెలుస్తోంది. అతడి నీచమైన పనికి బుద్ది చెప్పాలని భావించిన గీతికా సుభాష్ కపూర్ భార్యకు కబురు పెట్టింది. సుభాష్ కపూర్ కూడా అక్కడికి వచ్చాడు. భార్య ముందే సుభాష్ కపూర్ ని నిలదీసిన గీతికా చెంపదెబ్బ కూడా కొట్టింది. చాలా సమయం పాటు వీరి మధ్య సంభాషణ సాగింది.
గీతికా ప్రియుడు కూడా
గీతికా త్యాగి, సుభాష్ కపూర్, అతడి సతీమణితో పాటు ఈ వీడియోలో మరో వ్యక్తి కూడా ఉన్నాడు. అతడు గీతికా ప్రియుడి అని ప్రచారం జరుగుతోంది. తన ప్రియురాలికి మద్దత్తు ఇస్తూ అతడు కూడా సుభాష్ కపూర్ ని నిలదీస్తున్నాడు.
అమీర్ ఖాన్ అవుట్
సుభాష్ కపూర్ ప్రస్తుతం అమీర్ ఖాన్ తో మొఘల్ అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. సుభాష్ కపూర్ పై లైంగిక వేధింపుల ఆరోపణలు సంచలనంగా మారడంతో మొఘల్ చిత్రం నుంచి తాను తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు. మొత్తంగా మీటూ ఉద్యమం బాలీవుడ్ లో పెను ప్రకంపనలు సృష్టిస్తోంది.