థగ్స్ ఆఫ్ హిందూస్థాన్ ప్రీ రిలీజ్ రివ్యూ: రికార్డుల మోతకు అమీర్ రెడీ.. బాహుబలి2పై గురి
Recommended Video

బాలీవుడ్ బాక్సాఫీస్ రికార్డులను తిరగరాయడానికి థగ్స్ ఆఫ్ హిందూస్థాన్ సిద్ధమవుతున్నది. తొలిసారి ఈ చిత్రం కోసం అమీర్ ఖాన్, అమితాబ్ బచ్చన్ జతకట్టి ప్రేక్షకులకు నిజమైన దీపావళీ పండుగను తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. చారిత్రక నేపథ్యంగా రూపొందిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా నవంబర్ 8న రిలీజ్ కానున్నది. అయితే రిలీజ్‌కు ముందు ఈ సినిమా సృష్టిస్తున్న హంగామా అంతా ఇంతా కాదు. స్వదేశంలోనూ, ఓవర్సీస్ మార్కెట్‌లోనూ ఈ మూవీ అనేక విశేషాలను సొంతం చేసుకొన్నది. అదేమిటంటే..

థగ్స్ ఆఫ్ హిందూస్థాన్ చిత్ర కథ ఇదే
థగ్స్ ఆఫ్ హిందూస్థాన్ చిత్ర కథ 1795 కాలానికి సంబంధించింది. భారత్‌లో బ్రిటీష్ సామ్రాజ్య విస్తరణ అడ్డుకొంటూ సవాల్ విసిరిన ఇద్దరు బందిపోటు దొంగల కథగా ఈ చిత్రం రూపొందింది. అమితాబ్ కుదాభక్ష్ ఆజాద్, అమీర్ ఖాన్ ఫిరంగీ మల్లాగా కనిపించున్నారు. కత్రినా కైఫ్ సురయ్యా అనే డ్యాన్సర్ పాత్రలో మెరువనున్నారు. యుద్ధ నారీగా దంగల్ ఫేం ఫాతీమా షేక్ సనా కనిపిస్తారు.

దేశవ్యాప్తంగా రికార్డు థియేటర్లలో
థగ్స్ ఆఫ్ హిందూస్థాన్ చిత్రం దేశవ్యాప్తంగా 5 వేల థియేటర్లలో రిలీజ్ అవుతున్నది. బాలీవుడ్ చరిత్రలోనే ఏ చిత్రం కూడా ఇన్ని థియేటర్లలో రిలీజ్ కాలేదు. గతంలో ఈ రికార్డు సల్మాన్ ఖాన్ నటించిన టైగర్ జిందా హై చిత్రంపై ఉంది. ఆ చిత్రం 4600 థియేటర్లలో విడుదలైంది.

ఓవర్సీస్, వరల్డ్ వైడ్‌గా రిలీజ్
ఇక థగ్స్ ఆఫ్ హిందూస్థాన్ చిత్రం ఓవర్సీస్‌లో 2 వేల థియేటర్లలో విడుదలవుతున్నది. అంటే దేశవ్యాప్తంగా 5 వేలు, విదేశాల్లో 2 వేల థియేటర్లలో కలిపి మొత్తంగా 7 వేల థియేటర్లలో రిలీజ్ అవుతున్నది. బాలీవుడ్ చరిత్రలో ఇదోక రికార్డు.

బాహుబలి 2 రికార్డు పదిలం
అయితే థగ్స్ ఆఫ్ హిందూస్థాన్ చిత్రం బాహుబలి2 రికార్డును అధిగమించలేకపోయింది. రాజమౌళి దర్శకత్వం వహించిన బాహుబలి2 చిత్రం స్వదేశంలోనే అంటే తెలుగు, తమిళం, హిందీ, మలయాళంలో కలిపి 6500 థియేటర్లలో రిలీజ్ అయింది. అయితే థియేటర్లు తగ్గినా భారీ కలెక్షన్లను రాబట్టే అవకాశం ఉంది.

తొలిరోజే రూ.50 కోట్లు
థగ్స్ ఆఫ్ హిందూస్తాన్ చిత్రం బాహుబలి2 రికార్డులను తిరగరాస్తుందా అనే ప్రశ్న బాలీవుడ్ సినీ వర్గాల్లో మొదలైంది. అయితే తొలిరోజు ఈ చిత్రం స్వదేశంలోనే రూ.50 కోట్ల మార్కును దాటే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నారు.

బాహుబలి 2 కలెక్షన్లపై గురి
ఒకవేళ తొలిరోజు రూ.50 కోట్ల వసూలు చేస్తే బాలీవుడ్ రికార్డులన్నీ తిరగరాయడం ఖాయం. హిందీ భాషలో మొదటి రోజు బాహుబలి2 చిత్రం రూ.41 కోట్లు కలెక్ట్ చేసింది. బాహుబలి రికార్డును అమీర్ ఖాన్ అధిగమిస్తాడా వేచి చూడాల్సిందే.

మూడు రోజుల్లో రూ.100 కోట్లు
ఇక తొలి మూడు రోజుల్లో థగ్స్ ఆఫ్ హిందూస్థాన్ చిత్రం రూ.100 కోట్ల క్లబ్‌లో చేరే అవకాశముందని ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి. లాంగ్ వీకెండ్ కావడం, పెరిగిన టికెట్ ధర రికార్డు స్థాయి కలెక్షన్లు నమోదు కావడానికి ఛాన్స్ ఉందని చెప్పుకొంటున్నారు. శనివారం రోజు వరకే 2 లక్షల టికెట్లు అడ్వాన్స్ బుకింగ్ రూపంలో అమ్ముడయ్యాయనేది తాజా సమాచారం.

రూ.300 కోట్లతో ప్రతిష్ఠాత్మకంగా
యాష్ రాజ్ ఫిలిం బ్యానర్‌పై ధూమ్3 ఫేమ్ విజయ్ కృష్ణ ఆచార్య దర్శకత్వంలో థగ్స్ ఆఫ్ హిందూస్థాన్ రూపొందింది. ఈ చిత్రంలో అమీర్, అమితాబ్‌తోపాటు కత్రినా కైఫ్, ఫాతీమా సనా షేక్ తదితరులు నటించారు. మనుస్ నందన్ సినిమాటోగ్రఫి, సంగీతం అజయ్ అతుల్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ జాన్ స్టివార్ట్ ఎడూరి అందించారు. ఈ సినిమాను నిర్మాత ఆదిత్య చోప్రా రూ.300 కోట్లతో రూపొందించారు.


Click it and Unblock the Notifications











