థగ్స్ ఆఫ్ హిందూస్తాన్: అమితాబ్ బచ్చన్ వేసిన స్టెప్స్ చూస్తే ఆశ్చర్యమే!
యశ్ రాజ్ ఫిలింస్ సంస్థ నుండి వస్తున్న భారీ యాక్షన్ అడ్వంచరస్ మూవీ 'థగ్స్ ఆఫ్ హిందూస్తాన్' దీపావళి సందర్భంగా విడుదల చేయబోతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే విడుదలైన ట్రైలర్, పోస్టర్లకు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా సినిమాలోని ఓ సాంగ్ ప్రోమో విడుదల చేశారు.
ఈ పాటలో అమితాబ్ బచ్చన్, అమీర్ ఖాన్ కలిసి డాన్స్ చేయడం అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. బిగ్ బి ఈ వయసులోనూ ఉత్సాహంగా స్టెప్పులేయడం ఇందులో చూడొచ్చు. ఆ సాంగుపై మీరూ ఓ లుక్కేయండి మరి.
'థగ్స్ ఆఫ్ హిందూస్తాన్' చిత్రాన్ని హిందీతో పాటు తెలుగు, తమిళంలో విడుదల చేస్తున్నారు. ఈ చిత్రం తెలుగు ట్రైలర్ ప్రముఖ దర్శకుడు రాజమౌళి ట్విట్టర్ ద్వారా విడుదల చేసిన సంగతి తెలిసిందే.

అమితాబ్ బచ్చన్, ఆమిర్ ఖాన్ ప్రధాన పాత్రల్లో నటించిన 'థగ్స్ ఆఫ్ హిందుస్తాన్' నవంబర్ 8న విడుదలకు సిద్ధమవుతోంది. ఫిలిప్ మీడో రచించిన 1839 నాటి ఫిక్షన్ నవల... కన్‌ఫెషన్స్ ఆఫ్ ఎ థగ్స్ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కించారు. ఈ చిత్రాన్ని యశ్ రాజ్ ఫిల్మ్స్ పతాకంపై ఆదిత్యా చోప్రా నిర్మిస్తున్నారు. అమితాబ్ బచ్చన్, అమీర్ ఖాన్‌తో పాటు కత్రినా కైఫ్, ఫాతిమా సనా షేక్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ధూమ్ 3 ఫేం విజయ్ కృష్ణ ఆచార్య ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.


Click it and Unblock the Notifications











