తెరపైకి వచ్చిన టైగర్ 3... మరోసారి దుమ్మురేపనున్న సల్మాన్ -కత్రినా

అంతకు ముందు ఎన్ని సినిమాల్లో కలసి నటించినా సల్మాన్ - కత్రినా జోడీకి ఉన్న డిమాండ్ ఏక్ థా టైగర్ సినిమా నుంచి మరో లెవెల్ కి వెళ్లిపోయిందనే చెప్పాలి. ఈ సినిమాకు సీక్వెల్ గా వచ్చిన టైగర్ జిందా హై కూడా జనాలను విపరీతంగా ఆకట్టుకుంది. తాజాగా ఈ సినిమాకు మరో సీక్వెల్ కూడా రాబోతోందని తెలుస్తోంది.

ఇప్పటికే చర్చల దశలో ఉన్న టైగర్ 3 త్వరలోనే పట్టాలెక్కబోతోందని తెలుస్తోంది. ఇప్పటికే సల్మాన్ ఖాన్ తన అంగీకారం తెలుపగా, కత్రినా కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిందట. ఇక ఈ చిత్రానికి మనీశ్ శర్మ దర్శకత్వం వహించబోతున్నాడని తెలుస్తోంది.

Tiger 3 on cards, Salman-Katrina to light up the screen once again

ఇక గత సినిమాల కన్నా టైగర్ 3 మరో రేంజ్ లో ఉండబోతోందన్నది ట్రేడ్ వర్గాల సమాచారం. యాక్షన్ డోస్ కూడా కాస్తంత పెంచబోతున్నారట. ఏక్ థా టైగర్, టైగర్ జిందా హై కు మించి, ఈ చిత్రంలో హంగులు ఆర్భాటాలకు పెద్ద పీట వేయబోతున్నారని చిత్ర యూనిట్ చెబుతోంది. ఇక ఈ ప్రాజెక్ట్ కు నిర్మాత ఆదిత్య చోప్రా, సల్మాన్ ఖాన్ ఏరి కోరి మనీశ్ శర్మను ఎంపిక చేశారట.

ప్రతి సినిమా దేనికదే విభిన్నంగా ఉండాలి కాబట్టి, సినిమా సినిమాకూ డైరెక్టర్లను మార్చుతున్నట్లు తెలుస్తోంది. మరి ఈ టైగర్ 3 ప్రేక్షకులను ఏ రీతిన మెప్పిస్తాడో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X