Tiger 3 Trailer Review అప్పటి వరకు టైగర్ ప్రాణాలతోనే.. యాక్షన్, రొమాన్స్‌తో రఫాడించిన సల్మాన్ ఖాన్

బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ మరోసారి సీక్రెట్ ఏజెంట్, రా ఆఫీసర్‌గా నటిస్తున్న చిత్రం టైగర్ 3. మనీష్ శర్మ దర్శకత్వంలో అదిత్య చోప్రా నిర్మాతగా ప్రతిష్టాత్మక యాష్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్‌పై రూపొందిన ఈ చిత్రంలో కత్రినా కైఫ్, ఇమ్రాన్ హహ్మీ ప్రధాన పాత్రల్లో నటించారు.ఈ సినిమాకు సంబంధించిన మూవీ ట్రైలర్‌ను అభిమానులు, ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. అభిమానులు ఎంతోకాలంగా ఆతృతగా ఎదురు చూస్తున్న ఈ ట్రైలర్ ఎలా ఉందంటే?

యష్ రాజ్ ఫిల్మ్స్ స్పై యూనివర్స్ సిరీస్‌లో భాగంగా రూపొందిన టైగర్ 3 చిత్రంలో రేవతి ఎమోషనల్ పాత్రలో కనిపించారు. దేశభక్తుడు, శత్రువులకు మధ్య తేడా ఏమిటంటే? ఒకే వ్యక్తి చూస్తే తెలుస్తుందనే భావోద్వేగమైన డైలాగ్‌తో మొదలైంది. యాక్షన్ ఎపిసోడ్స్‌తోపాటు టైగర్ జీవితంలో భార్య కత్రినా, కొడుకుతో ఫ్యామిలీ మూమెంట్స్ కనిపించడంతో అన్ని రకాల ఎమోషన్స్‌తో ఈ సినిమా రూపొందిందనే విషయం స్పష్టమైంది.

Tiger 3 Trailer Review: Salman Khan, Katrina Kaif punched with actions and Romance

టైగర్‌తోపాటు కత్రినా కైఫ్ చేసిన యాక్షన్ సీన్లు ట్రైలర్‌లో హైలెట్‌గా కనిపించాయి. కత్రినా టవల్ కట్టుకొని చేసిన ఫైట్ ఏదో మ్యాజిక్ చేసే విధంగా కనిపించింది. ఈ సినిమాలో హై ఎమోషన్స్‌తోపాటు పవర్ ఫుల్ యాక్షన్ సీక్వెన్స్ కనిపించాయి. అలాగే అభిమానులను ఏ మాత్రం నిరాశ పరచకుండా రొమాన్స్‌ కూడా పెద్ద పీట వేయడం కనిపించింది.

టైగర్ 3 చిత్రంలో తొలిసారి విలన్‌గా ఇమ్రాన్ హష్మీ కనిపించబోతున్నాడు. పాకిస్థాన్‌కు చెందిన వ్యక్తిగా టైగర్ బంధించిన సీన్‌లో ఆయన తనదైన శైలిలో ఫెర్ఫార్మ్ చేశాడనిపిసించింది. వెల్‌కమ్ టు పాకిస్థాన్.. టైగర్ అంటూ తన మార్క్ నటనను ప్రదర్శించాడు. ఇక శ్వాస ఆగనంత కాలం.. టైగర్ బతికే ఉంటాడు అని సల్మాన్ పంచ్ డైలాగ్‌తో ఫ్యాన్స్ పండుగ వాతావరణం క్రియేట్ చేశాడు.

సాధారణంగా ప్రతీ సినిమా గురువారం లేదా శుక్రవారం రిలీజ్ అవుతుంటుంది. కానీ టైగర్ 3 విషయానికి వస్తే.. ఆదివారం అంటే నవంబర్ 12వ తేదీన రిలీజ్ అవుతున్నది. 2023 సంవత్సరంలో అధిక మాసం కావడంతో పండుగల తేదీలు మారిపోయాయి. ఈ సంవత్సరం సోమవారం సవంబనఖ 13వ తేదీన కొత్త చంద్రుడు రావడం లేదా అమావాస్య కావవడం, అలాగే నవంబర్ 13న గోవర్ధన పూజ, అలాగే గుజరాతీ న్యూ ఇయర్ కావడంతో సెలవు దినాలు వచ్చాయి. ఇక నవంబర్ 15వ తేదీన భాయ్ దూజ్ సెలవుదినం అవ్వడంతో ఈ సినిమాకు కలిసి వచ్చే అంశంగా మారింది.

సల్మాన్ ఖాన్ నటించిన టైగర్ చిత్రం ట్రైలర్ రిలీజ్ తర్వాత ఈ సినిమాపై మరింత అంచనాలు పెరిగాయి. ఎంతోకాలంగా ఎదురు చూస్తున్న అభిమానులకు సంతోషాన్ని కలిగించింది. ఈ సినిమా భారీ అంచనాల మధ్య తెలుగు, తమిళం, హిందీ భాషల్లో నవంబర్ 12వ తేదీన రిలీజ్ అవుతున్నది. కొంతకాలంగా ఫ్లాఫులతో బాధపడుతున్న సల్మాన్ ఖాన్‌కు ఈ సినిమా కచ్చితంగా విజయాన్ని అందించాల్సిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో సల్లూభాయ్‌కి సక్సెస్ లభిస్తుందా? అనేది ఆసక్తికరంగా మారింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X