బికినీలో కనిపిస్తావా? ఆయన చెల్లెలుగా సిగ్గులేదా? స్టార్ హీరో సిస్టర్‌పై నెటిజన్ ఫైర్
బాలీవుడ్‌లో ప్రముఖ నటుడు జాకీ ష్రాఫ్, ఆయేషా ష్రాఫ్ దంపతుల కూతురు కృష్ణ ష్రాఫ్ అందాల ఆరబోత గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం అక్కర్లేదు. పలు సందర్భాల్లో బీచుల వెంట విహారయాత్ర చేస్తూ బికినీతో దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో పోస్టు చేయడం ఆ తర్వాత నెటిజన్లు ట్రోల్ చేయడం సర్వసాధారణంగా మారింది. తాజాగా బికినీలో హాట్ హాట్‌గా కనిపించిన కృష్ణ ష్రాఫ్ ఎదురైన చేదు అనుభవం ఏమిటంటే..

వివిధ భంగిమలో ఫోజులిస్తూ బికినీలో
బాలీవుడ్ యువ హీరో టైగర్ ష్రాఫ్ సోదరి కృష్ణ ష్రాప్ సోషల్ మీడియా అకౌంట్‌ను పరిశీలిస్తే వివిధ భంగిమలో ఫోజులిస్తూ బికినీలో దర్శనమిచ్చే ఫోటోలే కనిపిస్తాయి. తాజాగా బికినీలో ఫోటో దిగి వైల్డ్ చైల్డ్ అంటూ కామెంట్ పెట్టింది. ఆ ఫోటోపై నెటిజన్లు తలో విధంగా స్పందించారు.

నెటిజన్ ఘాటుగా
బికినీలో వీరంగం సృష్టించిన కృష్ణ ష్రాఫ్ చూసి తట్టుకోలేక ఓ నెటిజన్ ఘాటుగా స్పందించారు. మేడమ్ మీ అన్న టైగర్ ష్రాఫ్ ఎంత పద్దతిగా ఉంటాడు. మీ ఫ్యామిలీ ప్రతిష్టకు తగినట్టుగా వ్యవహరిస్తాడు. కానీ మీరే ఆ పద్దతిని అలవాటు చేసుకొ మీకు ఏ మాత్రం సిగ్గులేకుండా బికినీలో కనిపిస్తావా? నీ ఫోటోలు నీ తల్లిదండ్రులు చూడరా? అంటూ ఘాటుగా మెసేజ్ పెట్టాడు

కృష్ణ ష్రాఫ్ స్పందిస్తూ..
తన సోదరుడితో పోల్చుతూ నెటిజన్ చేసిన ట్రోల్స్‌పై కృష్ణ ష్రాఫ్ స్పందిస్తూ.. సర్.. మీ పట్టింపునకు, మీ ఆందోళనకు థ్యాంక్యూ. కానీ దయచేసి మీరు ఫక్ ఆఫ్. మీ కామెంట్లకు ధన్యవాదాలు. ఎవరైనా నేను పెట్టిన మెసేజ్‌ను ట్రాన్స్‌లేట్ చేసి వినిపించండి. థ్యాంక్స్ అంటూ కృష్ణ ష్రాఫ్ మరింత ఘాటుగా సమాధానం ఇచ్చింది.

వైరల్‌గా కృష్ణ ష్రాఫ్ ఫోటోలు
ఇన్స్‌టాగ్రామ్‌లో కృష్ణ ష్రాఫ్ పోస్టు చేసిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి. పలు సందర్భాల్లో ఇలాంటి ట్రోల్స్ ఆమెను ఇబ్బందికి గురిచేశాయి. అయినా కృష్ణ ష్రాఫ్ తన పద్దతిని, అందాల అరబోతను మానుకోలేదు. స్విమ్మింగ్ పూల్, బీచ్ ఫోటోలతో ఆమె సందడి చేస్తున్నది.


Click it and Unblock the Notifications











