డేట్‌కు వెళ్లొస్తూ అడ్డంగా దొరికిపోయిన బాలీవుడ్ ప్రేమజంట

సినీరంగంలోని చాటింగులు.. డేటింగులు.. ప్రేమలు.. బ్రేకప్పులు కొత్తేంకాదు. గతంలో ఇవన్నీ సీక్రెట్‌గా నడిచేవి కానీ, ఇప్పుడు మాత్రం ఎక్కడ చీమ చిటుక్కుమన్నా ఇట్టే తెలిసిపోతుంది. దీనికి కారణం సోషల్ మీడియా అందుబాటులోకి రావడమే. దానికితోడు నేటి తరం కూడా ఎంతో ఉత్సాహంతో ఇలాంటివి షేర్ చేస్తూ ఉంటుంది. అందుకే సెలెబ్రిటీలు చాలా జాగ్రత్తలు పడుతూ ఉంటారు.

ఇక సినీరంగంలోని ప్రేమజంటలు బయట తిరగాలంటేనే భయపడిపోతున్నారు. అందుకే రహస్యంగా తమ పనులు కానిచ్చేస్తున్నారు. అయినా.. ఎలాగోలా బుక్కైపోతున్నారు. తాజాగా ఓ ప్రేమజంటకు కూడా ఇలాంటి అనుభవమే ఎదురైంది. వాళ్లెవరో కాదు.. ఎన్నో రోజులుగా చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్న టైగర్ ష్రాఫ్, దిశా పటానీ.

 Tiger Shroff and Disha Patani Booked Once Again

పైకి తామిద్దరం ప్రేమించుకోవడం లేదని చెప్పుకున్నా.. ఈ జంట మాత్రం తరచూ చక్కర్లు కొడుతూనే ఉంది. ఈ క్రమంలోనే ఎన్నోసార్లు మీడియా ప్రతినిథులకు అడ్డంగా దొరికిపోయింది. చాలా పత్రికల్లో వీళ్ల గురించి ప్రత్యేక కథనాలు కూడా వచ్చాయి. అయినా.. వాళ్లిద్దరి మధ్య బంధం గురించి ఏనాడూ బయటకు చెప్పలేదు. కానీ, వీరిద్దరూ కొన్ని రోజులుగా ప్రేమలో ఉన్నారని బాలీవుడ్ కోడై కూస్తోంది.

ఈ నేపథ్యంలో టైగర్ ష్రాఫ్, దిశా పటానీ మరోసారి అడ్డంగా దొరికిపోయారు. మంగళవారం మధ్యాహ్నం ముంబైలోని ఓ రెస్టారెంట్‌లో లంచ్‌ డేట్‌కు వెళ్లొస్తూ కెమెరా కంటికి చిక్కారు. ఈ పిక్స్‌లో టైగర్ గ్రే కలర్ బనియన్, బ్లాక్ జీన్స్ వేసుకుని ఉండగా.. దిశా మాత్రం నార్మల్ రెడ్ షార్ట్, టాప్ ధరించి ఉంది. ఈ ఫొటోలు సోషల్ మీడియాలో ప్రత్యక్షం అవ్వడంతో కొద్ది సమయంలోనే వైరల్ అయ్యాయి. దీంతో బీ టౌన్‌లో ఈ జంట మరోసారి హాట్ టాపిక్ అయింది.

వీళ్లిద్దరూ గతంలోనూ డిన్నర్ డేట్‌ కోసం ఓ రెస్టారెంట్‌కు వెళ్తూ దొరికిపోయారు. అయితే, అప్పుడు వీళ్లతో పాటు టైగర్ ష్రాఫ్‌ సోదరి కృష్ణ ష్రాఫ్‌ ఉండడంతో వీరి బంధం బలమైందని అంతా చెప్పుకున్నారు. అంతేకాదు, ఆ తర్వాత కూడా ఈ జంట పలుమార్లు ఇలానే దొరికిపోయింది. కానీ, వీళ్లు మాత్రం ఇప్పటికీ స్నేహితులమే అని చెప్పుకుంటుండడం విశేషం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X