దుమ్ములేపుతోన్న భాఘీ 3 ట్రైలర్.. సూపర్ హీరోలా విరుచుకుపడిన టైగర్ ష్రాఫ్
బాలీవుడ్‌లో తనకంటూ ఓ ప్రత్యేకమైన ఫాలోయింగ్‌ను ఏర్పరుచుకున్నాడు టైగర్ ష్రాఫ్. యాక్షన్ హీరోగా, డ్యాన్సుల్లోనూ మిగతా హీరోల కంటే భిన్నంగా కొత్త దనం ట్రై చేస్తూ క్రేజీ హీరోగా మారిపోయాడు టైగర్. హృతిక్ రోషన్‌కు ప్రత్యామ్నాయంలా అనిపించే టైగర్.. చివరగా వార్ చిత్రంతో దండయాత్రం చేశాడు. విశేషమేమిటంటే యాక్షన్ హీరోలుగా పేరు తెచ్చుకున్న హృతిక్, టైగర్ ఇద్దరు కలిసి నటించడం.
గతేడాది విడుదలైన వార్ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని నమోదు చేసింది. సైరా చిత్రంతో పాటుగా విడుదలైన వార్.. బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద దాదాపు 250కోట్లను కొల్లగొట్టింది. అందులో వీరిద్దరు చేసిన యాక్షన్ సీక్వెన్స్‌కు ఆడియెన్స్ ఫిదా అయ్యారు. మళ్లీ అదే స్టైల్లో ఉండేలా బాఘీ 3ని సిద్దం చేశాడు.

టైగర్ ష్రాఫ్‌కు భాఘీ టైటిల్ బాగా కలిసి వచ్చింది. అందుకే తెలుగు వర్షం సినిమా బాఘీగా, క్షణం సినిమాను భాఘీ2గా రీమేక్ చేశాడు. తాజాగా భాఘీ3ని సిద్దం చేశాడు. తన అన్నను చంపిన దేశం మీద పగ తీర్చుకునే తమ్ముడి పాత్రను టైగర్ అద్భుతంగా పోషించాడు. ఈ ట్రైలర్‌లో చూపించిన యాక్షన్ సీక్వెన్స్‌కు రోమాలు నిక్కబొడుచుకోవాల్సిందే. మార్చి 6న ఈ చిత్రం విడుదల కాబోతోంది.


Click it and Unblock the Notifications











