టైగర్ ష్రాఫ్, దిశా పటానీ చీప్ ట్రిక్స్... ఛీ కొడుతున్న నెటిజన్లు!
బాలీవుడ్ స్టార్స్ టైగర్ ష్రాఫ్, దిశా పటానీ మధ్య లవ్ ఎఫైర్ ఉన్నట్లు బాలీవుడ్ మీడియా చాలా రోజులుగా కోడై కూస్తోంది. అయితే తమ మధ్య ఉన్న సంబంధం గురించి అఫీషియల్‌గా చెప్పకుండా దోబూచులాడుతూ పబ్లిసిటీ పెంచుకునేందకు చీప్ ట్రిక్స్ ప్లే చేస్తున్నారనే విమర్శలు సైతం ఉన్నాయి.
తాజాగా ఈ ఇద్దరూ వాలంటైన్స్ డే సందర్భంగా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఫోటోలు హాట్ టాపిక్ అయ్యాయి. ఆ ఫోటోస్ చూసిన అభిమానులు వీరికి ఎంగేజ్మెంట్ అయిందని నమ్మి విషెస్ కూడా తెలియజేశారు. కానీ ఇది కూడా పబ్లిసిటీ స్టంటే అని తేలిపోయింది.

ఎంగేజ్మెంట్ రింగ్స్?
ఇటు టైగర్ ష్రాఫ్, అంటు దిశా పటానీ తమ చూపుడు వేలికి ఉన్న రింగ్స్ ప్రదర్శిస్తూ ఒకే రకమైన భంగిమలో ఫోజులు ఇవ్వడంతో... వీరికి ఎంగేజ్మెంట్ జరిగినట్లు, త్వరలో తమ రిలేషన్ షిప్ గురించి అఫీషియల్‌గా ప్రకటించబోతున్నట్లు వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. అభిమానులు కూడా ఇద్దరికీ కంగ్రాట్స్ చెబుతూ విష్ చేశారు.
అసలు విషయం ఇదీ..
తమ పోస్టులతో సెన్సేషన్ క్రియేట్ చేసి, అందరిలోనూ అనుమానాలు రేకెత్తించిన ఈ లవ్ బర్డ్స్... సాయంత్రం 7 గంటలకు అసలు విషయం వెల్లడించారు. ఇద్దరూ పెప్సీ బ్రాండ్ అంబాసిడర్‌గా ఎంపికయ్యారట. ఆ విషయాన్ని హైలెట్ చేయడానికే ఈ డ్రామా ఆడినట్లు తేలిపోయింది.
భగ్గుమన్న నెటిజన్లు
అయితే ఈ జంట చేసిన పనిపై కొందరు నెటిజన్లు భగ్గుమంటున్నారు. చెప్పే విషయం సూటిగా చెప్పకుండా... పబ్లిసిటీ కోసమో, సెన్సేషన్ కోసమో అందరినీ వెర్రివాళ్లను చేసే ఇలాంటి ప్రయత్నాలు మానుకోవాలని సూచిస్తున్నారు.

టైగర్, దిశా
సినిమాల విషయానికొస్తే.. 2018లో ‘భాగీ 2'లో ఇద్దరూ కలిసి నటించారు. ప్రస్తుతం టైగర్ ష్రాఫ్ ‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2' చిత్రం చేస్తుండగా, దిశా పటానీ సల్మాన్ ఖాన్ మూవీ ‘భారత్'లో ముఖ్యమైన పాత్ర పోషిస్తోంది.


Click it and Unblock the Notifications











