అల్లు అర్జున్‌తో మల్టీస్టారర్ కోసం ఎదురుచూస్తున్నా.. టైగర్ ష్రాఫ్!

Recommended Video

Allu Arjun Should Be My Co-Star In MY Tollywood Debut : Tiger Shroff | Filmibeat Telugu

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కు ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనసవరం లేదు. మలయాళంలో కూడా అల్లు అర్జున్ కు అభిమానులు ఉన్నారు. చాలా మంది సెలెబ్రిటీలు సైతం అల్లు అర్జున్ ని ఇష్టపడతారు. అల్లు అర్జున్ ఎజెర్జిటిక్ పెర్ఫామెన్స్, డాన్సులు మతిపోగోట్టే విధంగా ఉంటాయి. ఈ ప్రత్యేకతలతోనే బన్నీ భారీ స్థాయిలో క్రేజ్ ఏర్పరుచుకున్నారు. నా పేరు సూర్య చిత్రం తరువాత అల్లు అర్జున తన తదుపరి చిత్రాన్ని ఇంకా ప్రకటించలేదు. ఇదిలా ఉండగా బాలీవుడ్ స్టార్ హీరో టైగర్ ష్రాఫ్ అల్లుఅర్జున్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

హైదరాబాద్‌లో సందడి

హైదరాబాద్‌లో సందడి

సీనియర్ నటుడు జాకీ ష్రాఫ్ తనయుడిగా బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన టైగెర్ ష్రాఫ్ తనకంటూ ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకున్నాడు. ఓ ప్రయివేట్ కార్యక్రమం కోసం టైగర్ ష్రాఫ్ హైదరాబాద్ లో సందడి చేశారు. ఈ సందర్భంగా టాలీవుడ్ లో కూడా నటించాలని ఉందనే తన కోరికని బయటపెట్టాడు.

 అల్లుఅర్జున్‌తో కలసి

అల్లుఅర్జున్‌తో కలసి

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తో కలసి నటించాలనే తన కోరికని టైగర్ ష్రాఫ్ వెల్లడించాడు. నాకు అల్లు అర్జున్ అంటే చాలా ఇష్టం. అతడితో కలసి నటించే సమయం కోసం ఎదురుచూస్తున్నా అంటూ టైగర్ వెల్లడించాడు. నా తండ్రి జాకీ ష్రాఫ్ తెలుగు చిత్రాల్లో కూడా నటించారు. నాకు కూడా టాలీవుడ్ లో నటించాలనే కోరిక ఉంది. మంచి కథతో వస్తే తప్పకుండా చేస్తా అని టైగర్ తెలిపాడు.

టాలీవుడ్ చిత్రాల వలనే

టాలీవుడ్ చిత్రాల వలనే

టైగర్ ష్రాఫ్ కు బాలీవుడ్ లో స్టార్ డమ్ ఏర్పడిందంటే అందులో తెలుగు చిత్రాల పాత్ర కూడా ఉంది. టైగర్ ష్రాఫ్ బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది అల్లు అర్జున్ పరుగు చిత్ర రీమేక్‌తోనే కావడం విశేషం. పరుగు చిత్రాన్ని హీరో పంతి పేరుతో రీమేక్ చేశారు. ఆ చిత్రం మంచి విజయం సాధించింది. ఆ తరువాత వర్షం చిత్ర రీమేక్ భాగిలో కూడా టైగర్ ష్రాఫ్ నటించాడు.

 హృతిక్ రోషన్ తరువాత

హృతిక్ రోషన్ తరువాత

టైగర్ ష్రాఫ్ కు బాలీవుడ్ హృతిక్ రోషన్ తరువాత మంచి డాన్సర్ అనే గుర్తింపు ఉంది. ప్రస్తుతం టైగర్ ష్రాఫ్ స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2 చిత్రంలో నటిస్తున్నాడు. 2012 లో విజయం సాధించిన స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ కు ఇది సీక్వెల్. ఇదిలా ఉండగా టైగర్ ష్రాఫ్ ఎఫైర్స్ తో కూడా వార్తల్లో నిలుస్తున్నాడు. ప్రస్తుతం టైగర్ ష్రాఫ్, దిశా పటాని మధ్య ఘాటుగా ప్రేమాయణం సాగుతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X