తొలి ముద్దు అనుభవం, అతడు అద్భుతమైన కిస్సర్, .... హీరో కూతురు హాట్ కామెంట్!
బాలీవుడ్ యంగ్ హీరో టైగర్ ష్రాఫ్ అద్భుతంగా డాన్స్ చేస్తాడు, యాక్షన్ సీన్స్ కూడా అదరగొడతాడు. అయితే అతడిలో ఉండే క్వాలిటీ ఇవి మాత్రమే కాదు... టైగర్ గ్రేట్ కిస్సర్ అంటూ పొగడ్తల వర్షం కురిపిస్తోంది బాలీవుడ్ నటుడు చుంకీ పాండే కూతురు అనన్య పాండే.
టైగర్ ష్రాఫ్ హీరోగా రూపొందుతున్న 'స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2' చిత్రంలో అనన్య పాండే హీరోయిన్‌గా నటిస్తోంది. తాజాగా టైగర్ ష్రాఫ్, అనన్య పాండే, మరో నటి తారా సుతారియా ఓ రేడియో ఇంటరాక్షన్లో పాల్గొన్న సందర్భంగా వారి మధ్య ఆసక్తికర డిస్క్రషన్ జరిగింది.

అతడు గ్రేట్ కిస్సర్
మీరు ఏ విషయంలో ఇతరుల కంటే బెటర్ అనే ప్రశ్న ఎదురవ్వగా టైగర్ స్పందిస్తూ... ‘ముద్దు పెట్టడంలో నేను బెస్ట్ ఏమో? నిజంగా నాకు తెలియదు నేను ఎందులో బెస్ట్ అనేది' అంటూ సమాధానం ఇచ్చారు. దీనికి అనన్య రియాక్ట్ అవుతూ ‘‘అవును... టైగర్ ష్రాఫ్ గ్రేట్ కిస్సర్. ఆ విషయంలో నేను హామీ ఇస్తున్నాను'' అంటూ కామెంట్ చేసింది. తారా సుతారియా కూడా ఈ విషయాన్ని అంగీకరించింది.

ఇది నాకు తొలి ముద్దు అనుభవం
‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2' చిత్రానికి సంబంధించి ఇటీవల విడుదలైన ఓ పాటలో టైగర్ ష్రాఫ్... అనన్య పాండే, తారాలతో ముద్దు పెడుతూ కనిపించాడు. ‘నేను ఇప్పటి వరకు ఎవరినీ కిస్ చేయలేదు. అందుకే నేను ఇతరులతో పోల్చలేను. నాకు ఇది బెస్ట్ ఫస్ట్ కిస్ ఎవర్' అని అనన్య చెప్పుకొచ్చారు.

స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2
‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2' సినిమా విషయానికొస్తే... పునీత్ మల్హోత్రా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ప్రతిష్టాత్మక సెయింట్ థెరిసా కాలేజ్‌లో జరిగే కథ చుట్టూ తిరుగుతుంది. స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ ట్రోపీ దక్కించుకోవడానకి రోహన్(టైగర్), శ్రేయ(అనన్య), మియా(తారా) పోటీ పడే విధానం ఆసక్తికరంగా ఉంటుంది.

సూపర్ హిట్ మూవీకి సీక్వెల్
గతంలో వరుణ్ ధావన్, సిద్దార్థ్ మల్హోత్రా, అలియా భట్ ప్రధాన పాత్రల్లో నటించిన ‘స్టూడెంట్ ఆఫ్ ది' ఇయర్ చిత్రానికి ఇది సీక్వెల్. ప్రముఖ బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్ ధర్మ ప్రొడక్షన్స్ బేనర్లో ఈ చిత్రాన్ని నిర్మించారు. మే 10న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.


Click it and Unblock the Notifications











