స్టార్ హీరో తల్లికి 58 లక్షల కుచ్చుటోపి.. చీటింగ్ చేశారంటూ కేసు నమోదు

స్టార్ హీరో జాకీ ష్రాఫ్ సతీమణి, యువ హీరో టైగర్ ష్రాఫ్ తల్లి ఆయేషా ష్రాఫ్ ముంబై పోలీసులను ఆశ్రయించింది. తమను 58 లక్షల రూపాయల మేర మోసానికి పాల్పడ్డారంటూ ఓ వ్యక్తిపై ముంబైలోని శాంతాక్రజ్ పోలీసులను ఆమె ఆశ్రయించారు. దాంతో ఆయేషా ష్రాఫ్ ఆరోపించిన వ్యక్తిపై ముంబై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆయేషా చేసిన ఆరోపణల్లో నిజాలు నిగ్గు తేల్చేందుకు దర్యాప్తు చేపట్టారు. ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..

యువ హీరో టైగర్ ష్రాఫ్ ఎంఎమ్ఏ మ్యాట్రిక్స్ కంపెనీని స్థాపించాడు. ఆ కంపెనీ ద్వారా మార్షల్ ఆర్ట్స్‌లో శిక్షణతోపాటు జిమ్ ట్రైనింగ్ ఇస్తున్నారు.ఈ కంపెనీలో ట్రైనర్‌గా అలెన్ ఫెర్నాండేజ్‌ను నియమించారు. అయితే సినిమా షూటింగులతో బిజీగా ఉండటంతో తన తల్లికి ఈ కంపెనీని టైగర్ ష్రాఫ్ అప్పగించారు. దాంతో ఈ కంపెనీ వ్యవహారాలను ఆయేషా చూసుకొంటున్నారు అని ముంబై పోలీసులు తెలిపారు.

Tiger Shroff mother Ayesha Shroff filed Cheating case on Gym Trainer Alan Fernandes duping 58 Lakhs

ఎంఎమ్ఏ మ్యాట్రిక్స్ జీమ్‌లో మార్షల్ ఆర్ట్స్ నేర్పిస్తూ అలెన్ ఫెర్నాండేజ్ ప్రపంచవ్యాప్తంగా పోటీలను నిర్వహిస్తున్నాడు. ఆయనకు నెలకు 3 లక్షల రూపాయల వేతనం అందిస్తున్నారు. అయితే పలు రకాల టోర్నమెంట్‌లు నిర్వహించి భారీగా డబ్బులు సంపాదించాడు. మొత్తం 11 టోర్నమెంట్ల ద్వారా సుమారు 58 లక్షలు సంపాదించారు. డిసెంబర్ 2018 నుంచి జనవరి 2023 వరకు బ్యాంకులో డబ్బులు డిపాజిట్ చేశారు అని పోలీసులు తెలిపారు.

అయితే టోర్నమెంట్ల నిర్వహణ ద్వారా సంపాదించిన మొత్తాన్ని తమకు ఇవ్వలేదని.. తమకు దాదాపు 58 లక్షలు రూపాయలను మోసం చేశారని ఆయేషా శాంతాక్రజ్‌ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దాంతో అతడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని టైగర్ ష్రాఫ్ తల్లి ఫిర్యాదుపై పోలీసులు స్పందించారు.

Tiger Shroff mother Ayesha Shroff filed Cheating case on Gym Trainer Alan Fernandes duping 58 Lakhs

అలెన్ ఫెర్నాండేజ్‌పై చీటింగ్, నిధుల అవకతవకల ఆరోపణలపై కేసు నమోదు చేశారు. ఇండియన్ పీనల్ కోడ్ ప్రకారం.. 420, 408, 465,467, 468 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X