twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఆమె కంపెనీ బాగా ఎంజాయ్ చేశా.. ఆ రూమర్‌పై స్పందించిన స్టార్ హీరో!

    |

    బాలీవుడ్ హాట్ బ్యూటీ దిశా పటాని, యంగ్ హీరో టైగర్ ష్రాఫ్ మధ్య చాలా కాలంగా ప్రేమ వ్యవహారం సాగుతోంది. కానీ ఈ జంట ఎప్పుడూ ఈ విషయాన్ని బయట పెట్టలేదు. డిన్నర్స్, లంచ్ డేట్స్ చేస్తూ పలు సందర్భాల్లో దిశా పటాని, టైగర్ మీడియా కంట పడ్డారు. వీరిద్దరూ బాగి 2 చిత్రంలో నటించిన సంగతి. ఈ చిత్రంలో టైగర్, దిశా రొమాన్స్ బాలీవుడ్‌లో హాట్ టాపిక్ గా మారింది. టైగర్ ష్రాఫ్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. దిశా పటాని, తన గురించి వస్తున్న రూమార్స్ పై స్పందించాడు.

    ఆమె కంపెనీ ఎంజాయ్ చేశా

    ఆమె కంపెనీ ఎంజాయ్ చేశా

    దిశా పటానితో డేటింగ్ చేస్తున్నారా అనే ప్రశ్నకు టైగర్ సమాధానం ఇచ్చాడు. ఇలాంటి వార్తలు సినీనటులు సహజమే. నటీనటులు కాస్త క్లోజ్ గా కనిపించినా, కలసి నటించినా ఇలాంటి రూమర్స్ రావడం సహజమే. ఎందుకంటే సెలెబ్రిటీల వ్యక్తిగత జీవితం గురించి తెలుసుకోవాలని ఆసక్తి చూపుతారు. అందులో భాగంగానే ఈ వార్తలన్నీ వస్తున్నాయి. వాస్తవంగా చెప్పాలంటే ఆన్ స్క్రీన్ పై దిశాపటాని తోడుని ఎంజాయ్ చేశా అని టైగర్ ష్రాఫ్ తెలిపాడు.

    ఎప్పటికి స్నేహితులమే

    ఎప్పటికి స్నేహితులమే

    ఆఫ్ స్క్రీన్ లో తామిద్దరం ఎప్పటికి స్నేహితులమే అని టైగర్ వివరణ ఇచ్చారు. కానీ ప్రేమ, డేటింగ్ విషయాల గురించి దాటవేశారు. ఈ మధ్యన దిశా పటాని, టైగర్ ష్రాఫ్ విడిపోయారయి కూడా వార్తలు వచ్చాయి. కొద్ది రోజుల క్రితమే దిశా పటాని టైగర్ ష్రాఫ్ సోదరితో కనిపించింది. దీపికా, రణవీర్ రిసెప్షన్ కు టైగర్, దిశా పటాని జంటగా హాజరుకావడంతో ఈ రూమర్స్ అన్ని పటాపంచలు అయ్యాయి.

    ఫోటో షూట్స్‌తో రచ్చ

    ఫోటో షూట్స్‌తో రచ్చ

    టైగర్ ష్రాఫ్ క్రేజీ చిత్రాలతో దూసుకుపోతుండగా, దిశా పటానికి మాత్రం ఆశించిన అవకాశాలు రావడం లేదు. ప్రస్తుతం దిశా పటాని ఘాటు ఫోటో షూట్స్‌తో బాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. దిశా పటాని చేస్తున్న ఫోటో షూట్స్ కొన్ని వివాదంగా కూడా మారుతున్నాయి. బాలీవుడ్ లో అవకాశాలు కరువవడంతో సౌత్ వైపు చూస్తోంది. త్వరలో ఓ తెలుగు చిత్రంలో నటించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

    బాగి3కి రంగం సిద్ధం

    బాగి3కి రంగం సిద్ధం

    ఇక టైగర్ ష్రాఫ్ బాగి సిరీస్ తో తన జైత్ర యాత్రని కొనసాగించాలని చూస్తున్నాడు. ఇటీవలే బాగి 3 చిత్రాన్ని కూడా ప్రకటించారు. ఈ చిత్రంలో ఇంకా హీరోయిన్ ఖరారు కాలేదు. మరో మారు దిశా పటాని హీరోయిన్ గా ఎంపికవుతుందేమో అనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మరో వైపు స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2 లో కూడా టైగర్ ష్రాఫ్ నటిస్తున్నాడు.

    English summary
    Tiger Shroff on link up rumours with Disha Patani: I enjoy Disha’s company & our friendship remains unaffected
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X