మైనస్ 7 డిగ్రీల చలిలో.. ప్రాణాలకు తెగించి టైగర్ ష్రాఫ్ యాక్షన్

సినీ నటుల జీవితాలు పై నుంచి చూడటానికి చాలా అందంగా, హుందాగా కనిపిస్తాయి. కానీ వారి సుఖం వెనుక ఎన్ని కష్టాలు ఉంటాయో కొందరికి మాత్రమే తెలుస్తుంటాయి. కోట్ల రూపాయల రెమ్యునరేషన్ వెనుక ప్రాణాలకు తెగించి నటించాల్సిన పరిస్థితులు ఉంటాయి. అలాంటి సంఘటనకు ఉదాహరణగా బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ నటించిన ఓ సన్నివేశం ఒళ్లు గగుర్పాటుకు గురిచేస్తుంది. అదేంటే మీరే చూడండి..

2020లో క్రేజీ చిత్రంగా

2020లో క్రేజీ చిత్రంగా

బాలీవుడ్ సీనియర్ నటుడు జాకీ ష్రాఫ్ తనయుడు టైగర్ ష్రాఫ్ నటించిన బాగీ 3 చిత్రం 2020లో సంచలనం చిత్రంగా నమోదైంది. ఏడాది తోలి భాగంలో వచ్చిన ఈ చిత్రం భారీ విజయాన్ని అందుకొన్నది. ఈ చిత్రంలో శ్రద్దాకపూర్‌తోపాటు టైగర్ ష్రాఫ్ యాక్టింగ్, యాక్షన్ సీన్లకు మంచి ప్రశంసలు లభించాయి.

బాక్సాఫీస్ వద్ద ధమాకా

బాక్సాఫీస్ వద్ద ధమాకా

కొరియోగ్రాఫర్ ఆహ్మద్ ఖాన్ దర్శకత్వం వహించిన భాగీ3 చిత్రం కోసం శరీరపరంగా ప్రత్యేకమైన శ్రద్ద తీసుకొన్నాడు. పాత్రకు తగినట్టే సిక్స్ ప్యాక్‌తో తెరపైన ఆకట్టుకొన్నాడు. దాంతో ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ.150 కోట్లకుపైగా వసూళ్లను సాధించింది. అయితే ఇంతటి ఘనత వెనుక టైగర్ ష్రాఫ్ కష్టం ఓ వీడియో రూపంలో చూపించారు.

క్లైమాక్స్ సీన్ల కోసం

భాగీ 3 చిత్రంలోని క్లైమాక్స్ ఎపిసోడ్స్ కోసం టైగర్ ష్రాఫ్ ప్రాణాలకు తెగించారని చిత్ర యూనిట్ వెల్లడించింది. ఎముకలు విరిగే చలిలో కూడా అర్ధనగ్నంగా ఫైట్స్ సీన్లలో నటించాడు. క్లైమాక్స్ సీన్ల షూట్ చేసేటప్పుడు ఆ ప్రాంతంలో ఉష్ణోగ్రత మైనస్ 7 డిగ్రీల సెల్సియస్ ఉందని వెల్లడించారు. ఆ సీన్‌కు సంబంధించిన ఓ వీడియోను టైగర్ ష్రాఫ్ అభిమానులతో పంచుకొన్నారు.

Recommended Video

Salman Khan Clash with Jackie Shroff for Sangeeta Bijlani Now Goes Viral

టైగర్ ష్రాఫ్ గ్రేట్ అంటూ

టైగర్ ష్రాఫ్ అంకితభావం గురించి దర్శకుడు ఆహ్మద్ ఖాన్ మాట్లాడుతూ.. భరించలేనంత చలి... మైనస్ డిగ్రీల ఉష్ణోగ్రతలో భారీ గన్స్ చేతులో పట్టుకొని టైగర్ నటించాడు. మొహంలో ఎలాంటి బాధ లేకుండా అన్ని ఓర్చుకొని సీన్‌ను పండించారు. ఆ సీన్ చూస్తే మాకే ఒళ్లు జలదరించింది అని ఆహ్మద్ ఖాన్ అన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X