వామ్మో ఏకంగా 220 కేజీల బరువు ఎత్తేశాడు.. టైగర్ వర్కౌట్లు చూస్తే షాక్!
ఇండియన్ సెలెబ్రిటీలో అత్యంత ఫిట్‌గా ఉండే హీరోల్లో టైగర్ ష్రాఫ్ ఒకడు. టైగర్ ఫిట్‌నెస్‌కు ఫిదా కానివారెవ్వరూ ఉండరు. చేసింది కేవలం బాలీవుడ్ సినిమాలే అయినా టైగర్‌కు నేషనల్ వైడ్ క్రేజ్ వచ్చింది. ఇక టైగర్‌కు తెలుగులోనూ మంచి ఫాలోయింగ్ ఉంది. ముఖ్యంగా సెలెబ్రిటీ పిల్లలకు టైగర్ అంటే మహా ఇష్టం. ఆయన చేసే డ్యాన్స్‌లు, స్టంట్స్, యాక్షన్ సీక్వెన్స్‌లు హాలీవుడ్ రేంజ్‌లో ఉండటమే అందుకు కారణం.
టాలీవుడ్ స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్, టైగర్ ష్రాఫ్‌కు ఆ మధ్య జరిగిన సంభాషణ సోషల్ మీడియాలో ఎంతగా వైరల్ అయిందో అందరికీ తెలిసిందే. వార్, భాఘీ సినిమాలకు తన పిల్లలు ఫ్యాన్స్ అని బన్నీ చెప్పడం, వాళ్లని కలుస్తాను అని టైగర్ చెప్పడం మనమంతా చూశాం. ఆ సమయంలో టైగర్ ష్రాఫ్ ఫుల్ ఫేమస్ అయ్యాడు. ఇక తాజాగా టైగర్ మరోసారి వార్తల్లో నిలిచాడు. జిమ్‌లో తెగ కష్టపడిపోతోన్న వీడియోను షేర్ అందర్నీ ఆశ్చర్యపరిచాడు.

గత ఐదారు నెలలుగా స్టార్స్ అందరూ ఇంట్లోనే ఉంటూ ఎవరి పనుల్లో వారు బిజీగా ఉన్నారు. హీరోలు అయితే తమ ప్రాజెక్ట్‌ల కోసం శరీరాకృతిని మార్చుకునే పనిలో పడ్డారు. ఇంకొందరు తమ ఫిట్‌నెస్‌ను మెయింటెన్ చేస్తూ జిమ్‌లో కుస్తీలు పడుతున్నారు. అందులో భాగంగానే టైగర్.. ఏకంగా 220 కేజీల బరువును ఎత్తేశాడు. ఇక వాటిని ఎత్తడానికి టైగర్ భారీగానే కసరత్తులు చేసినట్టు కనిపిస్తోంది. ప్రస్తుతం ఈ వీడియో తెగ వైరల్ అవుతోంది.


Click it and Unblock the Notifications











