అదొక చెత్త సినిమా.. అయినా 200 కోట్ల కలెక్షన్స్.. దర్శకుడి సంచలన వ్యాఖ్యలు!

ప్రముఖ దర్శకుడు, నటుడు అయిన తిగ్మాంషు ధులియా తాజాగా వివాదాస్పద వ్యాఖ్యలతో వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచాడు. అజయ్ దేవగన్, మాధురి దీక్షిత్, రితేష్ దేశ్ ముఖ్, అనిల్ కపూర్ లాంటి స్టార్స్ అంతా కలసి నటించిన చిత్రం టోటల్ ఢమాల్. ఇంద్రకుమార్ దర్శత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఫిబ్రవరి 22న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రానికి పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. టోటల్ ఢమాల్ చిత్రంపై ధులియా చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం బాలీవుడ్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారాయి.

కొన్ని వర్గాలకు మాత్రమే

కొన్ని వర్గాలకు మాత్రమే

ధులియా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. గతంలో తాము చిత్రాలు తెరకెక్కిస్తే ప్రతి ఒక్క ప్రేక్షకుడికి కనెక్టయ్యేది. కానీ ఇప్పుడు సినిమా పట్ల ప్రేక్షకుల్లో అభిరుచి మారుతోంది. కొన్ని చిత్రాలు కొన్ని వర్గాల ప్రేక్షకులకు మాత్రమే నచ్చుతున్నాయి అని ధులియా అన్నారు. మధ్య తరగతి ఆడియన్స్, ఎగువ మధ్యతరగతి ఆడియన్స్ ఆలోచనా విధానంలో మార్పు వచ్చిందని ధులియా అన్నారు.

 అదొక చెత్త సినిమా

అదొక చెత్త సినిమా

ధులియా మాట్లాడుతూ.. ఇటీవల టోటల్ ఢమాల్ అనే చిత్రం విడుదలయింది. అదొక చెత్త సినిమా. అదెంటోకాని ఆ చిత్రాన్ని చూసేందుకు ప్రేక్షకులు ఎగబడుతున్నారు. టోటల్ ఢమాల్ ట్రైలర్ మొత్తం చెత్తే. అయినా కూడా ఆ చిత్రానికి 200 కోట్ల వసూళ్లు వస్తున్నాయని ధులియా వివాదాస్పద వ్యాఖ్యలు చేసారు. పాత తరం దర్శకుడు దాదా కోండ్కే చిత్రాలని దిగువ తరగతి ప్రేక్షకుల మాత్రమే ఆదరించేవారు. ఆయన చిత్రాలు ధనవంతులకు నవచ్చేవి కావు అని ధులియా అన్నారు.

 అలాగే తీయాల్సి వస్తోంది

అలాగే తీయాల్సి వస్తోంది

తనకు విభిన్నమైన కోణంలో సినిమాలు తీయాలని ఉంది. నాకు నచ్చిన విధంగా సినిమా తీయలేకపోతున్నాననే భాధ వెంటాడుతూనే ఉంది. కానీ ఇప్పటి చిత్రాల్లో హీరో, హీరోయిన్లు, వాళ్ళ స్నేహితులు ఇలాంటి పాత్రలతోనే తీయాల్సి వస్తోందని ధులియా అన్నారు. కొత్తదనంతో సినిమాలు తీస్తే ప్రేక్షకులు ఆదరిస్తారో లేదో అనే భయం ప్రతి దర్శకుడితో ఉందని ధులియా అన్నారు.

మిలాన్ టాకీస్

మిలాన్ టాకీస్

ధులియా తెరకేకించిన మిలాన్ టాకీస్ చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. టోటల్ ఢమాల్ చిత్రాన్ని భారీ యాక్షన్, వినోదాత్మక అంశాలతో తెరకెక్కించారు. ఈ చిత్రం విజయవంతంగా ప్రదర్శించబడుతున్న సమయంలో ధులియా చేసిన వ్యాఖ్యలు వివాదంగా మారాయి. టోటల్ ఢమాల్ చెత్త సినిమా అంటూ ధులియా చేసిన వ్యాఖ్యలపై చిత్ర యూనిట్ ఎలా స్పందిస్తుందో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X