twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    టిక్ టాక్ ఇండియన్ క్వీన్‌గా స్టార్ హీరోయిన్.. దాదాపు కోటి మంది ఫాలోవర్లతో టాప్ ప్లేస్

    |

    టిక్ టాక్ అంటే పరిచయం లేని వారెవరూ ఉండరు. ఎవ్వరికీ తెలియన అనామకులను కూడా ప్రపంచానికి పరిచయం సెలెబ్రిటీ స్టేటస్‌ను తీసుకొస్తుంది. సాంకేతిక పెరుగుతున్న కొద్దీ ఇలాంటి యాప్‌లు వస్తూనే ఉంటాయి. జనాలను ఆకర్షిస్తూనే ఉంటాయి. ప్రపంచంలో ఎక్కువగా ఉపయోగిస్తున్న యాప్‌లో టిక్ టాక్ ఒకటి. ఈ యాప్‌పై ఇండియాలో భిన్న స్వరాలు వినపడుతుండగా.. వీటికి ఎంతో మంది బానిసలయ్యారు. దీని గురించి నిత్యం వార్తలు వస్తూనే ఉంటాయి.

    బ్యాన్ విధించిన ప్రభుత్వం..

    బ్యాన్ విధించిన ప్రభుత్వం..

    టిక్ టాక్‌లో హద్దులు మీరుతున్నారని, అశ్లీలతను ప్రోత్సహించేలా ఉందని ఎంతో మంది దీన్ని వ్యతిరేకించగా.. భారత ప్రభుత్వం నిషేధించింది. టిక్ టాక్‌ను బ్యాన్ చేయడంతో ఎంతో మంది బాధపడిన వార్తలు కూడా వైరల్ అయ్యయి.

    వెలుగులోకి వచ్చిన ప్రతిభ..

    వెలుగులోకి వచ్చిన ప్రతిభ..

    టిక్ టాక్ వీడియోల ద్వారా వారి నటన కౌశలాన్ని ఎంతో మెరుగుపరుచుకుని సినీ అవకాశాలను కూడా సంపాదిస్తున్నారు. సినీ యాక్టర్ల కంటే టిక్ టాక్ స్టార్లకే ఎక్కువ ఫాలోయింగ్ ఉన్న సందర్భాలు కూడా ఉన్నాయి. పిల్లలు, యువత, పెద్దలు ఇలా తేడా లేకుండా ఎక్కడ పడితే అక్కడ ఎలా పడితే అలా వీడియోలు చేస్తూ హల్ చల్ చేస్తుంటారు.

    లైకుల కోసం అశ్లీలత..

    లైకుల కోసం అశ్లీలత..

    వారు చేసిన వీడియోలకు ఎక్కువ మొత్తంలో లైకులు, షేర్లు రావాలనే ఉద్దేశ్యంతో అశ్లీలతను ప్రోత్సహిస్తుంటారు. మరి కొందరు తీవ్ర పదజాలంతో దూషిస్తుంటారు. ఇలా టిక్ టాక్‌ను అనవసరమైన వాటికి ఉపయోగిస్తూ పెడదారిన పడుతున్నారు. అయితే మంచి చెడు ఉన్న ఈ యాప్‌లో సెలెబ్రిటీలు సైతం వీడియోలు చేస్తూ తమ అభిమానులను ఖుషీ చేస్తుంటారు.

    టిక్ టాక్ ఇండియన్ క్వీన్..

    టిక్ టాక్ ఇండియన్ క్వీన్..

    అత్యధిక మంది ఫాలోవర్లు కలిగిన శ్రీలంక భామ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ టాప్ ప్లేస్‌ దక్కించుకుని టిక్ టాక్ క్వీన్ ఇండియా-2019గా నిల్చుంది. ఆమెకు టిక్ టాక్‌లో దాదాపు 9.5మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారని టిక్ టాక్ సంస్థ తెలిపింది. ఈ జాబితాలో రితేష్ దేశ్‌ముక్ 6.8మిలియన్లతో రెండో స్థానంలో, 2.2 మిలియన్లతో కపిల్ శర్మ మూడో స్థానంలో నిలిచారని పేర్కొంది.

    English summary
    TikTok Queen India 2019 Is Jacqueline Fernandez. Jacqueline tops the celebrities list with 9.5 million followers. She is followed by Riteish Deshmukh 6.8 million and Kapil Sharma 2.2 million.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X