Don't Miss!
- News Shocking Video: గాల్లో ఢీకొన్న రెండు నేవీ హెలికాఫ్టర్లు-10 మంది స్టాఫ్ దుర్మరణం..!
- Sports CSK vs LSG: అందుకే రచిన్ రవీంద్రను పక్కనపెట్టాం: రుతురాజ్ గైక్వాడ్
- Lifestyle గాడిదపాలు అమ్మి కోట్ల వ్యాపారం.. లీటరు ధర రూ.7,000లు పైమాటే..!
- Automobiles ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్‌కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్‌మి 5G స్మార్ట్‌ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
టిక్ టాక్ ఇండియన్ క్వీన్‌గా స్టార్ హీరోయిన్.. దాదాపు కోటి మంది ఫాలోవర్లతో టాప్ ప్లేస్
టిక్ టాక్ అంటే పరిచయం లేని వారెవరూ ఉండరు. ఎవ్వరికీ తెలియన అనామకులను కూడా ప్రపంచానికి పరిచయం సెలెబ్రిటీ స్టేటస్‌ను తీసుకొస్తుంది. సాంకేతిక పెరుగుతున్న కొద్దీ ఇలాంటి యాప్‌లు వస్తూనే ఉంటాయి. జనాలను ఆకర్షిస్తూనే ఉంటాయి. ప్రపంచంలో ఎక్కువగా ఉపయోగిస్తున్న యాప్‌లో టిక్ టాక్ ఒకటి. ఈ యాప్‌పై ఇండియాలో భిన్న స్వరాలు వినపడుతుండగా.. వీటికి ఎంతో మంది బానిసలయ్యారు. దీని గురించి నిత్యం వార్తలు వస్తూనే ఉంటాయి.
బ్యాన్ విధించిన ప్రభుత్వం..
టిక్ టాక్‌లో హద్దులు మీరుతున్నారని, అశ్లీలతను ప్రోత్సహించేలా ఉందని ఎంతో మంది దీన్ని వ్యతిరేకించగా.. భారత ప్రభుత్వం నిషేధించింది. టిక్ టాక్‌ను బ్యాన్ చేయడంతో ఎంతో మంది బాధపడిన వార్తలు కూడా వైరల్ అయ్యయి.
వెలుగులోకి వచ్చిన ప్రతిభ..
టిక్ టాక్ వీడియోల ద్వారా వారి నటన కౌశలాన్ని ఎంతో మెరుగుపరుచుకుని సినీ అవకాశాలను కూడా సంపాదిస్తున్నారు. సినీ యాక్టర్ల కంటే టిక్ టాక్ స్టార్లకే ఎక్కువ ఫాలోయింగ్ ఉన్న సందర్భాలు కూడా ఉన్నాయి. పిల్లలు, యువత, పెద్దలు ఇలా తేడా లేకుండా ఎక్కడ పడితే అక్కడ ఎలా పడితే అలా వీడియోలు చేస్తూ హల్ చల్ చేస్తుంటారు.
లైకుల కోసం అశ్లీలత..
వారు చేసిన వీడియోలకు ఎక్కువ మొత్తంలో లైకులు, షేర్లు రావాలనే ఉద్దేశ్యంతో అశ్లీలతను ప్రోత్సహిస్తుంటారు. మరి కొందరు తీవ్ర పదజాలంతో దూషిస్తుంటారు. ఇలా టిక్ టాక్‌ను అనవసరమైన వాటికి ఉపయోగిస్తూ పెడదారిన పడుతున్నారు. అయితే మంచి చెడు ఉన్న ఈ యాప్‌లో సెలెబ్రిటీలు సైతం వీడియోలు చేస్తూ తమ అభిమానులను ఖుషీ చేస్తుంటారు.
టిక్ టాక్ ఇండియన్ క్వీన్..
అత్యధిక మంది ఫాలోవర్లు కలిగిన శ్రీలంక భామ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ టాప్ ప్లేస్ దక్కించుకుని టిక్ టాక్ క్వీన్ ఇండియా-2019గా నిల్చుంది. ఆమెకు టిక్ టాక్‌లో దాదాపు 9.5మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారని టిక్ టాక్ సంస్థ తెలిపింది. ఈ జాబితాలో రితేష్ దేశ్ముక్ 6.8మిలియన్లతో రెండో స్థానంలో, 2.2 మిలియన్లతో కపిల్ శర్మ మూడో స్థానంలో నిలిచారని పేర్కొంది.