Pathaan: పార్లమెంట్ లో పఠాన్ సినిమాపై ప్రశంసలు.. మంచి సందేశం ఇచ్చారంటూ..
ఇటీవల బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ నటించిన పఠాన్ సినిమా గ్రాండ్ గా ప్రేక్షకులు ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఇక ఈ సినిమా ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా 840 కోట్లకు పైగా కలెక్షన్స్ అందుకొని సరికొత్త రికార్డును క్రియేట్ చేసింది. అయితే ఈ సినిమా విడుదలకు ముందు బేషరమ్ పాట ద్వారా కొంత కాంట్రవర్సీ క్రియేట్ చేసుకుంది. అయితే ముఖ్యంగా బీజేపీకి సంబంధించిన నాయకులూ కూడా ఈ పాటను వెంటనే బ్యాన్ చేయాలి అని కూడా తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.
బాయికాట్ బాలీవుడ్ అంటూ ఎన్నో రకాల నెగిటివ్ ట్యాగ్స్ ట్రెండ్ అయ్యాయి. అయితే ఈ విషయంలో షారుఖ్ ఖాన్ ను అలాగే పఠాన్ చిత్ర యూనిట్ సభ్యులపై కొంతమంది ప్రతిపక్ష రాజకీయ నాయకులు మద్దతు పలకడం విశేషం. ఇక రీసెంట్ గా ఇటీవల విడుదలైన పఠాన్ చిత్రం అద్భుతమైన సందేశాన్ని కలిగి ఉంది అని తృణమూల్ కాంగ్రెస్ నాయకుడు డెరెక్ ఓబ్రెయిన్ రాజ్యసభలో వివరణ ఇవ్వడం మరింత హాట్ టాపిక్ గా మారింది.

పార్లమెంట్ లో రాష్ట్రపతి ప్రసంగ ధన్యవాద తీర్మానంపై చర్చలో పాల్గొన్న డెరెక్ ఓబ్రెయిన్ పఠాన్ సినిమాకు సంబంధించిన సందేశం గురించి మాట్లాడాలని అలాగే చిత్ర సభ్యులు మెచ్చుకోవాల్సిన అవసరం ఉంది అని మాట్లాడారు. ముఖ్యంగా సిద్దార్థ్ ఆనంద్ దర్శకుడిగా అద్భుతమైన పాయింట్ తో మేకింగ్ విధానంతో ఆకట్టుకున్నారు అంటూ ఇండియన్ బిగ్గెస్ట్ గ్లోబల్ అంబాసిడర్స్ మీరే అని అన్నారు.
ఒక అద్భుతమైన పఠాన్ ను రూపొందించారు అని, ఒక విధంగా మేము చేయలేని ఎన్నో పనులు షారుక్ ఖాన్ డింపుల్ కపాడియా అలాగే జాన్ అబ్రహం ఈ దేశానికి చూపించారు అని అన్నారు. ఇక భారతదేశం అతిపెద్ద ప్రపంచ రాయబారులతో ఎట్టి పరిస్థితుల్లో గొడవలు పడవద్దు అనే పాయింట్ అర్దమయ్యేలా చూపించినట్లుగా ఆయన తెలియజేశారు. అంతేకాకుండా మీరు బాలీవుడ్ ను బహిష్కరించాలి అని ఒక తీవ్రమైన నెగిటివ్ కామెంట్ చేశారు కానీ వారు మీకు మాత్రం ఒక అద్భుతమైన సందేశం తో కూడిన సినిమాను చూపించారు అని డెరెక్ ఓబ్రెయిన్ తెలియజేశారు.


Click it and Unblock the Notifications











