గుండె బద్దలైంది.. మాటలు రావట్లే.. సుశాంత్ సింగ్ మృతిపై ఆర్జీవి, మహేష్, అనసూయ

బాలీవుడ్ యువ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మృతిపై బాలీవుడ్ సినీ తారలు ఒక్కొక్కరుగా స్పందిస్తూ ఉన్నారు. అయితే ప్రతి ఒక్కరు కూడా ఈ ఘటన నిజం కాకుంటే బావుంటుందని అంటున్నారు. బాలీవుడ్ స్టార్స్ తో పాటు టాలీవుడ్ స్టార్స్ కూడా అతని మృతి పట్ల తీవ్ర మనోవేదనకు లోనవుతున్నట్లు సోషల్ మీడియా ద్వారా స్పందిస్తున్నారు. మహేష్ బాబు రామ్ గోపాల్ వర్మ, అనసూయా భరద్వాజ్ సోషల్ మీడియాలో ఈ విధంగా ట్వీట్స్ చేశారు.

రామ్ గోపాల్ వర్మ

రామ్ గోపాల్ వర్మ

విలక్షణ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కూడా ఈ ఘటనపై ట్విట్టర్ ద్వారా స్పందించారు. బాలీవుడ్ మునుపెన్నడు అనుభవించని అత్యంత షాకింగ్ విషయం ఇదేనని అన్నారు. అతను ఇంకా యంగ్ గానే ఉన్నాడు. ఎంతో మంచి లైఫ్ ఉంది. అయినా ఎందుకు ఇలా చేశాడు అంటూ జేమ్స్ డీన్ మరియు హీత్ లెడ్జర్ మరణాల కంటే సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం చాలా షాకింగ్ విషయం అని అన్నారు. అలాగే కరోనావైరస్ తో పాటు దేవుడు బాలీవుడ్‌కు మరో శాపం తెచ్చిపెట్టినట్లు తెలుస్తోందని అన్నారు

మహేష్ బాబు ట్వీట్..

మహేష్ బాబు ట్వీట్..

సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణవార్త గురించి తెలియగానే షాక్ అయ్యాను. పవర్ హౌజ్ లాంటి టాలెంట్ ఉన్న అతి తక్కువ వయసు ఉన్న హీరో. అతను ఆత్మకు శాంతి దొరకలని అనుకుంటున్నాను. అతని మృతిపట్ల కుటుంబ సభ్యులు మనోవేదనకు లోను కాకుండా ధైర్యంగా ఉండాలని ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నట్లు మహేష్ బాబు ట్వీట్ చేశారు.

అనసూయ భరద్వాజ్..

అనసూయ భరద్వాజ్..

నేను చాలా వినాశనానికి గురయ్యాను. ఈ భయంకరమైన వార్త గురించి తెలుసుకోవడానికి నాకు కొంత సమయం పట్టింది. మరో అద్భుతమైన వ్యక్తిని కోల్పోయాము. మరణం గురించి పదే పదే వినడం హృదయం బద్దలువుతోంది. అతని కుటుంబానికి నా హృదయపూర్వక సంతాపం తెలియజేస్తున్నాను అలాగే సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మకు శాంతి చేకూరాలని కొరుకుంటున్నట్లు అనసూయ పేర్కొన్నారు.

Recommended Video

Sushant Singh Rajput Latest News And His last Instagram Post
అనిల్ రావిపూడి..

అనిల్ రావిపూడి..

టాలీవుడ్ దర్శకుడు అనిల్ రావిపూడి కూడా సుశాంత్ మృతి షాకింగ్ గా ఉందని అన్నారు. అలాగే ఈ ఘటనతో మాటలేమి రావట్లేదనే విదంగా ఉందంటూ.. అతను ఆత్మకి శాంతి చేకూరాలని అన్నారు. సినిమా హీరోలతో పాటు దర్శకులు, నిర్మాతలు ఇలా చాలా మంది సుశాంత్ సింగ్ మృతి పట్ల సంతాపం తెలియజేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X