twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    హిందీ జెర్సీకి భారీ ఓటీటీ ఆఫర్.. హీరో మీద నమ్మకంతో తెలుగు నిర్మాతల తెగింపు

    |

    నాని నటించిన ఎమోషనల్ స్పోర్ట్స్ డ్రామా జెర్సీ సినిమా హిందీలో రీమేక్ అవుతున్న విషయం తెలిసిందే. తెలుగులో కమర్షియల్ గా పెద్దగా లాభాలు అంధించకపోయినప్పటికి చాలా వరకు ఆ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. అయితే బాలీవుడ్ లో ఇలాంటి సినిమాలు తప్పకుండా సక్సెస్ అవుతాయని అగ్ర నిర్మాతలు దిల్ రాజు, అల్లు అరవింద్ గట్టిగానే ప్లాన్ చేశారు.

    హిందీ జెర్సీలో షాహిద్ కపూర్ హీరోగా నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా కోసం షాహిద్ కూడా దాదాపు మూడు నెలల పాటు క్రికెట్ కోచింగ్ తీసుకున్నాడు. ఇక చాలా వరకు జెర్సీ సినిమా షూటింగ్ ఇటీవలే తుది దశకు చేరుకుంది. సినిమాకు ఒరిజినల్ దర్శకుడు గౌతమ్ తిన్ననురి దర్శకత్వం వహిస్తున్నాడు. ఒరిజినల్ సోల్ మిస్సవ్వకుండా అలాగే బాలీవుడ్ ఆడియెన్స్ కి నచ్చే విధంగా కొన్ని మార్పులైతే చేసినట్లు సమాచారం. ఇక ఈ సినిమాను ఓటీటీలో రిలీజ్ చేసే అవకాశం ఉన్నట్లు రూమర్స్ వస్తున్నాయి.

    Tollywood producers rejected Jersey hindi remake ott rights

    అమెజాన్, నెట్ ఫ్లిక్స్ పోటీపోటీగా సినిమా ఓటీటీ హక్కుల కోసం పోటీ పడుతున్నట్లు సమాచారం. సినిమాపై పెట్టిన పెట్టుబడి కంటే 30% ఎక్కువ అమౌంట్ ఆఫర్ చేస్తున్నట్లు తెలుస్తోంది అయితే ఇప్పటికే థియేటర్స్ ఓపెన్ చేసుకోవడానికి కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కానీ జనాలు థియేటర్స్ కు మళ్ళీ వస్తారా లేదా అనేది పెద్ద అనుమానంగా మారింది. ఇక షాహిద్ కపూర్ అర్జున్ రెడ్డి రీమేక్ తో ఒక్కసారిగా బాలీవుడ్ లో తన మార్కెట్ ను పెంచుకున్నాడు. అందుకే నిర్మాతలు హీరో మార్కెట్ మీద నమ్మకంతో ఆ ఆఫర్ ని వద్దని తెగించి చెప్పేశారట. ఓటీటీలో కాకుండా డైరెక్ట్ గా థియేటర్స్ లోనే విడుదల చేయాలని దిల్ రాజు, అల్లు అరవింద్ స్ట్రాంగ్ గా ఫిక్స్ అయినట్లు సమాచారం.

    English summary
    After winning both critical acclaim and commercial success for Jersey, talented Tollywood director Gowtam Thinnanuri is currently helming the film’s Hindi remake. But some of them are playing real cricketers in this movie. it is reported that two known Indian cricketers will appear in the Hindi jersey starring Shahid Kapoor.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X